పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాతమాటల చివరిపల్కును

                                               తాత గీతం తుది స్వరాన్నీ
                                               పాడుకొనుచూ, వణికిపోతూ
                                               కాలమునపోదున్
   అని పాడుతూ  అంతకన్న అంతకన్న అస్పస్టమగు కాంతులతో తిరిగి కూలిపోయినాడు. అందరూ చూస్తూవుండగా దీపాలన్నీ ఒక్కసారిగా  ఆరిపోయినాయి. రంగస్థలంలో గులాబి రంగులుప్రసరించాయి. మోడు చెట్టున చిగుర్లు  ప్రసరించాయి. లేత జేగురు ఆకులు  గాలిలో ఆడుతున్నాయి.అప్పుడొక బాల ప్రవేసించింది. ఆమె వేషం కోకిలవేషం!
                                            నేనె కోయిలనమ్మ!
                                             నేనె ఆశనుకొమ్మ!
                                            కొమ్మ కొమశిల తిరిగి
                                            ' కో ' యందు ' కో !కో !కో !
                                             పిలుతు నూత్నోత్సాహ
                                             కలిత మధుపాయలను,
                                             తలతు నా దేవుని వ
                                            సంతమూర్తిని ప్రేమ.
                                            నేనె వై తాళికుడ
                                            నేనె ప్రస్తావనను
                                            తన్వి! నాందీ సూత్ర
                                            ధారుణ్ణి నేనే!
   అని పాడి కోకో అంటూ నిష్క్రమించింది. కాంతులు  స్పష్టమయ్యాయి, ఆకులూ, కొమ్మలూ, చెట్టుకు తోచినవి. జంతుమేళము పూర్ణ స్వనయుక్తమైనది. అప్పుడు  వివిధ వర్ణ, వస్త్ర, పుష్పాలంకారాయుక్తలై ఎందరో బాలికలు పాడుతూ  ప్రవేశించారు. వారు పూవుల కన్యలు.
   మల్లిక : స్త్రీలకు మాత్రం హక్కులు లేవా
            సిగ్గులు లేవా పురుషులకూ?
   మాధవి :వనితకు మాత్రం ఆస్తి వలదటే
             ప్రాణం మానం పడతికి లేదా?
   శేఫాలి:మహిళలకు శక్తులు లేవనకే
           మహిషమర్థని మహిళేగా!
   మాలతి: కళలు లలితవే! చదువులు చేలివే!
             కర్మలలోనూ కామినేప్రథమం!
   అంతదీపాలు వంగపండు ఛాయదాల్చి రంగస్థలంలో దీపాలైనవి.