పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బహుమతులు వచ్చినవారి కందరికీ ఖరీదుగల వెండి వస్తువులను అధ్యక్షురాలిచే సభవారు ఇప్పించారు. ఆ వెనుక పలువురు సభ్యురాండ్రు విడాకుల చట్టం, బహుభార్యత్వ నిరసనా, స్త్రిలకూ బాలికలకూ వేరే కాళాశాలలు ఉండకూడదని, కుమార్తేలకు సమానాస్త్రి సంక్రణమ ఉండాలని, భర్త ఆస్తి భార్యకు అసంపూర్ణమ్తెన హక్కులతో రావాలనిమొదల్తెనవిషయాల గురించి ఉపన్యసించారు ఆ వెనుక అందరూ రంగాస్ధలం నుంచి దిగి, ప్రేక్షకస్థలంలో అధివసించారు. నాట్య నాటకాది కార్యక్రమం ప్రారంభం అయింది. రెండు తెరలు ఈవలావలనుంచి వచ్చి రంగస్థలాన్ని క్రమ్మివేసినది. ఆ తెరలు గాఢనీలమైనవి. ఆ తెరలకు పూలఅంచులూ, మధ్య కమలాలూ మిలమిలలాడుతూ వున్నవి.

   అయిదు నిమిషాలు నిశ్శబ్దం ఆవహించింది. ఏమి జరుగుతుందో అన్న  నిరీక్షణలో ప్రేక్షకురాండ్రూ, వేరే ప్రత్యేక స్థలములో ఆసనములు  చూపబడిన పురుష ప్రేక్షకులూ మౌనం  వహించారు. అక్కడక్కడ అమరింపబడిన విద్యుచ్చామరముల స్వనం మాత్రం శ్రుతిలా వినబడుతూంది. అప్పుడా నిశ్చలతలో ఒక్క జేగంట' ఖంగ్' మని మ్రోగింది. దానిని అనుసరిస్తూ శంఖారావం, వివిధ వాద్యాల ధ్వనులు ఒక్కరాగం ఆలపించాయి. రెండు తెరలూ  ఈవలావలకు మాయమైనాయి.  ప్రేక్షకుల స్థలంలో  దీపాలు ఆరిపోయాయి. రంగస్థలంలో  అస్పష్ట దీపకాంతులూ, బూడిదరంగులతో వెనక తెరలూ, పక్కతెరలూ,  వున్నాయి. ఒక మొండి చెట్లు బొమ్మ  రంగస్థలం మధ్యనే వున్నది. అప్పుడపశ్రుతి అనిపించే ఒక విషాదవాద్య మేళనము అస్పష్టంగా ప్రారంభమైనది. పోను పోను  కొంచం స్పష్టమైనది. అంతలో వణికిపోతూ ఒక వృద్దుడు తెల్లటి గడ్డంతో, నల్లటి దుస్తులతో ప్రవేసించి కర్ర పుచ్చుకొని వంగిపోయి తిరుగుతూ,
                                                వెళ్ళిపోయే ముసలి ఏడును
                                                కుళ్ళిపోయిన పాత కాంక్షను
                                                మళ్ళి ఎప్పుడో  నాకు మీకూ
                                                కళ్ళతో చూపుల్!
                                               విక్రమాన్నై  వేగలేచితి
                                               ఆశ్రమాలు కోటిచేసి ప
                                               రాక్రమంతో వాజినైతీ
                                               రష్య చొచ్చాడూ!