పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉదయ మందె శుభోద్యమంచిది

                                               అదే వినంబడి తూర్యనాదము
                                                                ఆలపిస్తావా?
                                                                నిడురలేవే......
                                  "సర్వవిద్యలు నివి కావే 
                                  సర్వకర్మలు నివి కావే 
                                               పర్వజేయు నుపర్వవిదిని 
                                              ఖర్వదిక్షా కాంతిపుంజము
                                               నిడురలేవే....
                                 పురుష హృదయము తట్టి పిలుపుము 
                                 పురుష ధర్మమూ బోధ చేయుము
                                             పొలతి దారికి పురుషు డేలా 
                                              నిలువగాలడో అడ్డమ్తే తానూ 
                                              నిడురలేవే........."
                                  అని దీప్తమధురకంఠంతో హేమ పడింది.


                                                                                                                 17
   సంవత్సరాది సాయంకాల కార్యక్రమంలో, మొదటి ఒక పండితురాలు పంచాంగాశ్రవణం  చేసి అందరూ అక్షతలు ప్రసాదించారు. తరువాత కవయిత్రుల గోష్టి జరిగింది. అందరికి వెండి కుంకుమ భారీణేలూ, రవికెల గుడ్డలూ,దారివాల్ శాలువాలూ బహుమతు లిచ్చారు.
   అప్పడోక యువతీ లేచి హాస్యరసప్రదానంగా సంవత్సర ఫలితాలు, "ఏ వత్సరము సన్న చీరలు మాయమోతాయి ,ఉతక చీరలు నూటికి నూట యాభ్తేపాళ్ళుఖరీదులు పెరుగుతాయి. ఈ సంవత్సరానికి రాజులేడు, మంత్రిలేడు,సేనదిపతి అర్ఘాదిపతి, గోపాలుడు ఎవ్వరూ పురుషులు లేరు. అందరూ యుద్దానికి పోవడముచేత , వారి వారి భార్యలే ఆయా పదవులను అలంకరించారు. రాజు గురువుకాడు గనుక అతని భార్య తారాదేవి రాణి అయింది. అందుచేత సినిమా తరాలకు ఎక్కువ డబ్బు వర్షం కురుస్తుంది. స్త్రీలకు మేష్టరు పనులు ఎక్కువౌతాయి. ,అ,త్రిపత్ని శుక్రని భార్య  తపస్సు చేసుకొంటూ ఉండడంవల్ల,  దేవయానే  ఆపనిచేస్తూ , బ్రాహ్మణుల కేవ్వరికి  మంత్రంగాలు ఉండకూడ డని శాసించింది.! బ్రాహ్మణుల బాలికలు అందరూ నూతుల్లో, గోతుల్లో , నదుల్లో, కాలవల్లోపడి అపరాయయతులకు  రాణులవుతారు.  సేనాదిపత్ని శనిగారి భార్య నిద్రలో ఉండడంవల్ల, ఆడవారు ఒకర్నొకరు తిట్టుకోరు.  తెల్లరంగంటే ఎక్కువ యిష్టపడతారు." అని చెప్పుతూ సభ్యురాండ్రను  నవ్వులలో ముంచెత్తింది!