పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఋగ్వేదులు, సామవేదులు, యాజ్ఞవల్క్యులు, ఆరాధ్యులు అనే నియోగి శాఖలూ ఏ విధమైన సంబంధాలు లేకుండా ఉన్నాయి. వెలనాట్లు, తెలగాణ్యులు , కాసరనాట్లు, వేగినాట్లు, మురికినాట్లు, అనే వైదిక శాఖలున్నాయి. వీరిలో వీరికీ ఈ అంతరశ్శాఖలకూ ఇతర శాఖలతో సంభందాలులేవు. శ్రీ వైష్టవులు, గండికోటులు, మంగళం పాదులు, గంగవరంవారు, హెబ్బారువారు, మండయం, తుమ్ముకొండ, వడఘళ్ళై, తెంగలైలు, నియోగి వైష్ణవులు, అష్టగోత్రులు, ఆంధ్ర వైష్ణవులు శాఖలుగా ఉన్నారు. ఆరామ, పేరూరు, తుమ్మకొండ, ద్రావిళ్ళు అనే బేధాలుగల ద్రావిళ్ళు ఉన్నారు. మర్త్యులున్నారు. ఇది ఆంధ్రదేశంమాట. ఈలాగే ప్రతి రాష్ట్రంలోని బ్రాహ్మణులలో అంతశ్శాఖలున్నాయి.

    శాఖాభేదాలు ఇలాగే  క్షత్రియులలోనూ, వైశ్యులలోను వున్నవి.  రాష్ట్రాల సంబంధాలు లేవు, ఇంక శూద్రులలో సచ్చూద్రులనీ, సాధారణ శూద్రులనీ రెండు తేడాలు. ఆ సచ్చూద్రులలో కొన్ని వందల తేడాలు. సాధారణ శూద్రులలో కొన్ని వందల తేడాలున్నాయి. ఆంధ్రదేశంలో సచ్చూద్రులలో రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, మున్నూరుకాపు, తెలగ , ఆదివెలమ, ముదిరాజు అనేవారున్నారు. రెడ్లలో మోతాడ, పాకనాటి, పంటరెడ్లు, భూమంచి రెడ్లు వగైరా ఎందరో ఉన్నారు. కమ్మవారిలో పెద్ద కమ్మవారు, చిన్న కమ్మవారు వున్నారు.
   ఈలా  కోటితేడాలతో వున్న మనదేశం ఆ తేడాలనన్నీ అల్లాగే  వుంచుకొని, నాశనమైపోవడమూ, లేక మతము వ్యక్తిగతము, జాతిగతము కాదు: వివాహ, సాంఘీఖ, రాజకీయ, ఆర్థికాది వ్యవహారాలలో  మతాన్ని బలంకోసం  వుపయోగిస్తూ ప్రతిబంధకం కాకుండా చేసుకోవడమా? యిది రెండవ సమస్య.
    మహిళామణుళారా! ఈ సమస్యలు లోక కళ్యాణ ప్రదంగా స్త్రీలే పరిష్కరించగలరు. స్త్రీలే  శాసనసభలకు ప్రతినిధురాండ్రు కావాలి. అప్పుడు యుద్దాలు తలెత్తవు.మతకలహాలు పోతాయి.వర్గాకలాహాలు నాశనం అవుతాయి. ఈనూత్న సంవత్సరము స్త్రి ఉద్యమాలను, విజయగోపుర ద్వారం కదకు తిసుకోనిపోవుగాక. నన్ను మిరి మహొత్సవానికి అధ్యకు రాలిగా చేసినందులకుమీకు కృతజ్ఞరాలను,నమస్కారములు. మీకందరకు నా నూత్నవత్సరాభివాదాలు!" అని ముగించారు.సభ్యురాండ్రు హర్షధ్వనులతో  ఆశలు నింపారు.
   ఇంతలో హేమ లేచి "స్ర్తీ "అని తాను వ్రాసినమాట చదివింది. నూత్న సంవత్సరం మీదపాటకూడా ఆమె రాసిందే.
                                           "స్త్రి "
                                  "నిడురలేవే సోదరి!
                                   కుడురుకనవే సోదరి!