పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రయత్నం చేయాలనీ; తామందరూ ఇంతవరకూ చేసిన ప్రయత్నం వట్టి నాందిమాత్రమేననీ, ఇంకనూ కొన్నివేలరెట్ల ఉత్సాహంతో స్త్రీలందరూ నడుంకట్టుకొని ప్రయత్నం చేయాలనీ: అప్పుడుగాని స్త్రీల ఆశయాలు నెరవేరవనీ చెప్పుతూ ఈ నూత్న సంవత్సరం మనలనింకోమెట్టు పైకి తీసుకువెళ్ళుగాక అన్న కోర్కెకు హేమకేసుమసుందరీ దేవివంటి తెలివైన బాలికలు ఈ సంఘంలో చేరటమే దృష్టాంతమనీ, ఈ ఉత్సవానికి ఆమె కారకురాలనీ ఈ శుభోత్సవ వేళ వారందరికీ, మహారాణి సాహెబు గారికీ ప్రసిద్ధురాలైన అధ్యక్షురాలికీ స్వాగతమనీ చెప్పి కూర్చున్నారు.

   హర్ష ధ్వనులు సముద్రతరంగ ఘోషలై మిన్నుముట్ట అధ్యక్షురాలు లేచి తమ ఉపన్యాసం ప్రారంభించినారు.
   దుర్గాబాయమ్మగారూ !  మహారాణిగారూ ! సోదరీమణులారా!  ఒక్కొక్క మహాయుద్దము, ఒక్కొక్క మహోద్యమమూ,ఒక్కొక్కఅఖండమైన సాంఘీక వ్యవస్థా అన్నీ ఒకదానితో ఒకటి  గాఢ సంబందంతో ఉదయిస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో  ప్రళయయుద్ధం చెలరేగుతున్నది. మన దేశానికి తూర్పుఖండంలో కూడా మహాభయంకర ప్రళయం  రాబోతున్నది. అమెరికా అధ్యక్షులు అది రాకుండా  జపానువారి తలతిక్క మాన్పాలనీ, సంప్రతింపులవల్ల శాంతి సుస్థిరం చేద్దామని, ప్రయత్నం చేస్తున్నారు. కాని నా ఉద్దేశంలో  వారి ప్రయత్నం  నిష్ఫలమవుతుందనే. మనదేశంకూడా యుద్దదావాలనంలో మండిపోవచ్చును. ఈలాంటి ప్రళయం  వచ్చే రోజుల్లో  స్త్రీలను ఎదుర్కొనే సమస్యలు రెండున్నాయి.
   ఒకటి: స్ట్రీ  యథాప్రకారంగా ఆదర్శగృహిణయి, అందుకు తగిన చదువు నేర్చుకొని , చక్కని భార్యయై, భర్తకు కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, శయనేషు రంభా, క్షమయా ధరిత్రీ అయి అతనికి  బిడ్డల్ని కని, పెంచుతూ వంటచేసి  పెడుతూ వుండడమా; లేక తనదారి తాను చూచుకొని, తన కామత్రుప్తికీ, ఉత్తమ కార్యమైన  జాతి అభివృద్ధికీ, తనకు నచ్చిన పురుషునితో తాత్కాలిక సంబంధమో , స్థిరసంబంధమో ఏర్పాటు చేసుకొని  జాగ్రత్తగా , ఆరోగ్యశాస్త్రోచితంగా బిడ్డలను కంటూ  వారిని  ఉత్తమ విధానాన పెంచుతూ తానుకూడా ఈ జగల్లీలా మహా నాటకంలో  పురుషునితో సమంగానో, ఇంకా అంతకన్న ఉత్తమంగానో  కార్యయోగినియై లోక చరిత్రను కొనసాగించడమా? ఇది ఒక సమస్య.
                                                                                                                           
           
               

ఇక రెండవ సమస్య: ఇది పూర్తిగా మనదేశానికి సంబంధించింది. మనదేశంలో అన్ని మతాలూ ఉన్నాయి. అన్ని వర్ణాలూ ఉన్నాయి. ముఖ్యమైన హిందూమతంలో కొన్నివేల అంతశ్శాకలున్నాయి. బ్రామ్మణులంటే __వంగ బ్రాహ్మణులు, బీహారు బ్రాహ్మణులు, ఆంధ్ర, మిథిల, మహారాష్ట్ర, తమిళ, మళయాళ, కన్నడ, గుజరాతు, సింధు, పంజాబు, గౌడ, కాశీ, కాశ్మీర, రాజపుత్ర, లక్నో, అస్సాం, సరస్వతీ బ్రాహ్మణులని ఉన్నారు. వీరందరికీ ఏమి సంబంధాలు లేవు. ఇంకా ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులలో అంతరాంతర శాఖలున్నాయి. ఒక్క ఆంధ్రులలో చూడండి: ఆరువేలవారు, ప్రాజ్ఞాడులు, కరణకమ్మలు, నందవరీకులు, గోలుకొండ వ్యాపారులు,