పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదిమంది యువతులు, వీణ , వేణు, నాదస్వరము, ఫిడేలు, సారంగి, ఇస్రాజ్, సితారు, మాండేలీను, తాంబూరా, వయోలా వాద్యాలు వాయిస్తూ వుండగా నలుగురు బాలికలు,

                                                         వృషాగమన కషాయితమ్మై
                                                           గొంతు విడివడగా
                                                          కొసరి కొసరి పుం
                                                          స్కోకిలరావము
                                                          దెసలముసరెనే.
   అంటూ ఉగాదిపాట పాడిరి. శ్రీమతి దుర్గాబాయమ్మగారంత లేచి, వేదిక పైకివెళ్ళి,  ఆ  ఉత్సవానికి  అధ్యక్షతవహింప దయతో అంగీకరించిన ఢిల్లీలో   వాసంచేస్తూ  ఒక జాతీయదినపత్రికకు సంయుక్త సంపాదకురాలైన ప్రసిద్ద ఆంధ్రమహిళ శ్రీమతి పద్మినీకుమారి. పి. హెచ్. డి. గారిని  అధ్యక్షపీఠమలంకరింపకోరినారు.
                                                                                                                   16
   అధ్యక్షురాలు పీఠమలంకరించుటకు  వేదికపై  వచ్చుటతోడనే హేమకుసుమసుందరి పుష్పదామం వారిమెడ నలంకరించింది. కంకణ క్వణిత కరతాళ ధ్వనులు చెలరేగాయి.
   దుర్గాబాయమ్మగారు  అధ్యక్షురాలిని గూర్చీ, మహిళామండలికి వారు చేసిన సేవనుగూర్చీ  ప్రశంసావాక్యాలు చెప్పి , కంఠమెత్తి గంభీరంగా  మహిశోద్యమం భారతదేశంలో మొదట  ప్రారంభించింది అనిబిసెంటుగారినిన్నీ ఆ  ఉద్యమం నానాటికీ  వృద్దిపొంది, ఇప్పుడు సర్వభారతీయ మహిళా మహా సభ ఏర్పడి, అందుకు రాష్ట్రరాష్ట్రానికి, మండల మండలానికిశాఖలువెలసి, మహత్తరమైన సంస్థగా పరిణమించినదనిన్నీ;  దేశం అంతా ఈనాడు మహిళాసంఘాలు, స్త్రీలకు క్లబ్బులు, కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయము, సేవాసంఘాలు వనితలకు ఉదయించాయనిన్నీ;  ఈ సకల ఉద్యమాల ఫలితంగా  భారతదేశంలో  జాతీయస్వాతంత్ర్యాది పవిత్ర ప్రయత్నాలలో స్త్రీలు పురుషులతోబాటు, ఒక్కొక్కప్పుడు వారికన్న అధికంగా దేశసేవచేస్తున్నారనిన్నీ; పవిత్ర స్త్రీల ఆశ్రమాలు మత్తు లక్ష్మీరెడ్డిగారు, యామినీపూర్ణతిలకమ్మగారూ మొదలగువారు స్థాపించి,  దీన సోదరీమణుల నెందరినో ఉద్దరిస్తున్నారనీ: ఈ సర్వకృషి ఫలితంగా నేడు భారతదేశంలో, స్త్రీలకు వోటూ, శాసనసభా సభ్యత్వమూ, మంత్రిత్వమూ, చదువూ, ఉద్యోగాలూ, న్యాయవాదిని, వైద్యురాలు, ఉపాధ్యాయుని మొదలైన వృత్తులెన్నియో లభిస్తున్నవనీ; ఈ  కృషి ఫలితంగానే శారదాశాసనము వచ్చిందనీ: అందువల్ల దేశంలో  ఎంతో మార్పు వచ్చిందనీ: స్త్రీలకు  ఆస్తి, బహుభార్యాత్వ నిషేధమూ, విడాకుల  వాసనమూ రాగాలవనీ; తామందరూ ఇంతవరకు చేసిన  ప్రయత్నం  వట్టి  నాందిమాత్రమేననీ, ఇంకనూ కొన్నివేల రెట్ల ఉత్సాహంతో స్త్రీలందరూ  నడుంకట్టుకొని