పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాది సర్వలలిత కళల్లోనూ సిద్దహస్తులు కావడమే ప్రధాన ఆశయంగా ఎంచుకోవలసినదని కోరుతున్నాను.

    కళావేత్తలయిన ఆంధ్ర సోదరీమణులు రచించిన  శిల్పచిత్రాదికాలూ, కళావస్తువులూ ఆంధ్ర స్త్రీలే కొని వారికి శతాథికంగా ప్రోత్చాహం ఇవ్వవలసివుంది. మీరందరూ  మన సోదరీమణుల  కళావైభవం చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. మీ  ఉత్సాహానికి  నేను అడ్డం  రాదలచుకోలేదు. ఈలాంటి ప్రదర్శనాలు ప్రతి సంవత్సరం చెన్నపట్నంలోనూ,  ఇతర పట్టణాలలోనూ  విరివిగా జరుగుతూ  వుండాలని ఆశిస్తూ, ఈ ప్రదర్శనం తెరుస్తున్నాను అని మహారాణిగారు ముగించారు. సభ్యురాంద్రందరూ హర్షకరతాళధ్వనులు మిన్ను ముట్టించారు.
   శ్రీ రాణీసాహెబాగారు తమ కందిచ్చిన రజితకండరములోని, వెండి తాళం తెరచి తలుపులు తోసినారు. తలుపులు వెనక్కు  పోగానే  గుమ్మంలో  అడుగిడిన రాణీగారి తలపై  పూలవర్షము కురిసింది. లోకేశ్వరి సోదరీమణులు  లందరిపైనా పూలజల్లులు కురిపించింది. గుమ్మానికీవలావల నలుగురు  బాలికలు నిలుచుండియుండిరి. లోపలికి పోయే  ప్రతి సదస్యురాలికి ఒకరు గంధమూ, ఒకరు అత్తరూ, ఒకరు పుష్పదామమూ, ఒకరు బొట్టునూ అర్పిస్తున్నారు.

ఆ విశాలమందిర సౌందర్యం చూచి, ప్రేక్షకురాండ్రందరూ ఆశ్చర్యపడిపోయారు. హేమసుందరి తన బావగారైనా త్యాగతిగారి ఇంట్లోనూ, అతని శిల్పాశ్రమంలోనూ వున్న సర్వదేశాల ప్రాచీన, ఆర్వాచీన శిల్పాలూ, సర్వదేశాల పురాతన చిత్రలేఖనాలూ, అధునాతన చిత్రాలూ, అజంతా చిత్రాల ప్రతిరూపాలూ, రాజపుత్ర చిత్రాలూ, పళ్ళేలు, సేమ్మాలు, జేగంటలు, రత్నకంబళ్ళూ, కరండాలు, కలశాలు, దంతపేటికలు, గంధపు పేటికలు, దంతశిల్పాలు, మంచిగంధపు శిల్పాలు, తమలపాకు దానులు, ఆడకత్తెరలు, ఆట సామానులు, చదరంగపు బల్లలు, తెరలు, దుప్పట్లు, తలగడలు మొదలగు అలంకారపు సామానూ; శిల్పపు పనితనంగల బలల్లూ ఆమందిరానికి సౌందర్యరేఖలు తీర్చేతట్లు అలంకరించినది. ఇక ఆంధ్రకళావిదుషీమణులు రచించిన చిత్రాలు అత్యంత మనోహరంగా అమరింపబడి వున్నాయి. మొదటి బహుమానాలు, ద్వితీయ బహుమానాలు, విశేషబహుమానాలు, పొందిన శిల్పవస్తువులు, చిత్రాలు, చిత్రాలక్రింద వ్రాసి ఉంచబడినవి. కళావస్తువుల గురించి చిన్న పొత్తము అందముగ అచ్చోత్తింపబడినది. అందులో బహుమతులందిన శిల్పాదికాల ప్రతిరూపాలు కూడా ఉన్నాయి. ఎంత తొందరగా చూద్దామన్నా ఎవ్వరికీ కాలవ్యవది చాలలేదు. పదింటికి ఉగాది ప్రార్ధనవున్నది. ప్రారంభసభ వున్నది. అందుకై తీరికగా చూడవచ్చునని ప్రేక్షకురాండ్రు సభాస్థలం చేరుకున్నారు.