పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆరున్నరకు తల్లిని లేపమన్నదిగాని, ఆరింటికే లేచింది హేమ.

   అరగంటలో  తలంటి  నీళ్ళు పోసుకున్నది. లోకేశ్వరి మాత్రం మహిళాసభ పాఠశాల హాస్టలు విద్యార్థినులకు తెల్లవారగట్లనే తలంటు పోయిస్తూ ఉండి, తానూ అక్కడే తలంటుపోసుకుంది. ఏడుగంటలకు  పెళ్లికూతురిలా  హేమ ముస్తాబు చేసుకుంది. పెద్ద కారులో  తాను కొత్త  చింతపండు, కొత్తబెల్లం , చెరుకుముక్కలు, వేపపువ్వు, అరటిపండ్లు, మామిడిముక్కలతో తయారు చేయించిన సంవత్సరాది పచ్చడిని పెట్టించి, తానూ, తన తల్లీ  బయలుదేరారు. సోఫీ పందిరి దగ్గరే కలుసుకున్నది.
   ఆరు టాక్సీలలోనూ, తన కారులోనూ, సోఫీ కారులోనూ, ఇంకను ఆంధ్ర మహిళామణుల  కారులలోనూ  విద్యార్థినులు,  ఉపాధ్యాయులు, కార్యవర్గమువారూ, దుర్గాబాయమ్మగారూ, వారి తల్లిగారూ, తక్కిన కుటుంబమూ అందరూ  ఏడున్నర గంటలకు ప్రదర్శన మందిరము కడకు పోయినారు. అందరికీ పచ్చడి పంచినారు. అక్కడకు ఎందరో ఆంధ్ర వనితామణులూ, ఆరవ సోదరీమణులూ, ఇతర  స్త్రీలు  వచ్చినారు.  ప్రదర్శనము తలుపులు  వేసి  యుంచి, ఆ తలుపులకు ఉమ్మడి వారిచే తయారు చేయించన  వెండి తాళము వేయబడినది.  మామిడితోరణాలు, పూలమాలలు ఆ ప్రదేశమంతా అలంకరించారు. అగరవత్తులనుండీ పరీమళ ధూపాలు సర్వదిశలకు ప్రసరిస్తున్నవి.
   శ్రీమతి దుర్గాబాయమ్మగారు శ్రీ  ఆనందనగరం మహారాణీగారిని  ప్రదర్శనం ప్రారంభించవలసినదని, మహిళాలోకానికి వారి నెరుక పరుస్తూ వారి సేవ ఉగ్గడించారు. లలిత కళలన్నీ సుందరీమణుల సొత్తే  అనిన్నీ, సంగీతం విషయంలో  ఆంధ్రవనితలు దక్షిణాదివారికి,  ఉత్తరాదివారికీ చాలా వెనుకబడి వున్నా, శిల్ప చిత్రలేఖనాలలో భారతదేశంలో  ఆంధ్ర స్త్రీలు బెంగాలీవారితో సమంగా  ఉన్నారనీ అందుకు  నిదర్శనము శ్రీమతులు  రత్నాల  క్రిష్ణాబాయిగారు, కమలాదేవిగారు, దిగుమర్తి బుచ్చికృష్ణమ్మగారు, దామెర్ల సత్యవాణిగారూ, సీతాకుమారిగారూ, జంగం లక్ష్మీబాయమ్మగారూ, హేమసుందరీదేవిగారూ  మొదలైన సోదరీమణులు  ఉన్నారనియూ;  ఈ ప్రదర్శనం ఇంత  విజయవంతంగా  జరగడానికి  కమలాదేవి , హేమసుందరీదేవిగార్ల ఉత్తమ కృషేననీ మహారాణిగారు ఉపోద్ఘాతముగా చెప్పినారు.  సోదరీమణులారా! చిత్రలేఖనము, కవిత్వము, శిల్పము, సంగీతము, నాట్యము, ప్రక్రుత్యనుకరణంగా ఉండవలెనా, లేక  ఆశయ భావపూరితమై పూర్వసంప్రదయాత్మికంగా ఉండవలెనా అనే ప్రశ్న ఒకటీ;  రచనా వస్తువు కళాకారులకు ఉత్తమమని తోచిన విషయం  ఏదైనా  ఉండవచ్చునా  లేక  దేశానికి ఆర్ధికంగా, రాజకీయంగా  ఉపయోగించే విధానంగా  వుండవలేనా  అనే  రెండవ  ప్రశ్నా; ఇవి కళాప్రపంచంలో కళాస్రష్టలకు  కలత పెట్టుతున్నవి. నా ఉద్దేశ్యంలో  ఈ సమస్యలన్నీ  రాజకీయ, సంఘీక, మత విషయిక వేదాంతులకు వదలి, ప్రస్తుతము ఆంధ్ర వనితామణులు చితలేఖ