పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విధానం; శిథిలమైన ఆంధ్ర సంప్రదాయము, కూచిపూడి విధానమని అదీ నేర్చుకొనసాగింది. రాక్షసి పట్టుదల! తాను' వనదేవి' యట. లోకేశ్వరి వసంతుడట. సోఫీ పారిజాతమట. మహిళాసభ బాలికలు కొందరు పూలబాలికలట. అలా వసంత నాటిక వ్రాయసాగింది. హేమ గీతా నృత్యనాటకం తానే తయారు చేసుకుంది. త్యాగతి చేత దిద్దించుకుంది. తన సొమ్ము వేయిరూపాయలు ఖర్చు కోసం అంచనా వేసుకుంది. హేమా, కార్యదర్శిని , దుర్గాబాయమ్మగారు , కమలాదేవిగారూ, ఇతరులూ కలిసి ఇంకో పదిహేనువందలు వసూలు చేసారు. ఆంధ్రకవయిత్రుల గోష్టి అని పెట్టింది.

ఆంధ్రదేశ ప్రసిద్ద కవయిత్రులు___ చావలి బంగారమ్మగారు, తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు, బసవరాజు సౌదామినీగారు, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారు, పులవర్తి కమలాదేవిగారు, కాంచనపల్లి కనకమ్మగారు, మధునాపంతుల రుక్మిణమ్మగారు, ఇందుమతీదేవిగారు, పులుగుర్త లక్ష్మీనరసమాంబగారు, మొదలైనవారిని, ఇప్పుడు నవ్యనవ్యమార్గాల కవిత్వం చెప్పే బాలికలను పోగుచేసి, కావ్యగోష్టి ఏర్పాటు చేసింది. రోజుకు ఇరవైనాలుగు గంటలయితే హేమ ముప్ఫై ఆరు గంటలు పని చేయడం మొదలు పెట్టింది. అలంకరించుకోవడం మానింది. బీచి షికార్లు పోయాయి. సినిమాలు మాయమయ్యాయి. ఒక్కొక్కప్పుడు ఇంటిదగ్గర భోజనమే మానింది., బలవంతంచేసి వాళ్ళమ్మగారిని తీసుకుపోయేది. సోఫీని లాక్కుపోయేది. లోకేశ్వరిని ఎత్తుకుపోయేది.

   త్యాగతిని  బావా , నాకీ పదిరోజులూ సెలవియ్యి అని అడిగింది. మూడు శిల్పాలు పూర్తికానివీ, ఒక బొమ్మ పూర్తి అయినదీ తాను రచించినవి ప్రదర్శనంలో పెట్టుకొనదలచుకొంది. తాను చిత్రించిన మూడు దృశ్య చిత్రాలు, భారతీయ  విధానాన రచించిన చిత్రమూ ప్రదర్శనంలో ఉంచుటకు  నిశ్చయించింది. రేపు సంవత్సరాది అనగా ఆ రాత్రల్లా ప్రదర్శనం ఏర్పాటైన మహిళాసభా బాలికా పాఠశాల మందిరంలోనూ , మహిళాసభ ఆవరణంలో, పందిళ్ళలో, తాత్కాలిక రంగస్థలంలోనూ దానవిలా తిరుగుతూ, పనిచేస్తూనేఉంది. అన్నీ పూర్తిచేసుకొని, తెల్లవారుతోందనగా ఇంటికి వచ్చి, తాను రెండుగంటలు నిద్రపోతాననీ, సరిగ్గా ఆరున్నరకు లేపమనీ తల్లితో చెప్పి, పక్కమీదవాలి కళ్ళుమూసుకొని చిన్నబిడ్డలా నిద్రపోయింది.
   
                          
                                                                                                               15
   తూర్పు  సముద్ర తరంగాలపై అరుణరాగాల నద్డుతూ, లోకంలో దారుణ యుద్దరక్తరాగం యింకా  ఎరుపు చేస్తూ, నూతన మామిడిపూవుల వాసనలతో, మోదుగపూవుల దీప్తవర్ణంతో వృష సంవత్సరాది ఉదయించింది.