పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కమ: నాతోబాటు కళాసేవ చేసేవారు ఏడెననమండుగురు ఈ సంఘంలో సభ్యురాండ్రుగా ఉండిరాయేను. వారితో మీకు బాగా సంపర్కం కలుగుతున్న దాయెను. అయినా వారందరితోనూ మీకు స్నేహం కలిగిందా ?

   హేమ:   మీ  వ్యక్తిత్వమూ,     నా వ్యక్తిత్వానికి సంబంధం కలది కాబట్టి మీకూ ,నాకూ స్నేహం కలిగింది.
   కమ:  ఆ  వ్యక్తిత్వం  పూర్వజన్మ సంస్కారఫలితమే.
   హేమ: కుటుంబ, దేశ కాల  ప్రభావంవల్ల కాదా?
   కమ:  అది ఉండదనా!  అలాంటి సంపర్కంలో  మా చెల్లెలూ ఉండవచ్చును. ఆమె  గుణం ఎందుకు వేరుకావాలి?  అదే ఇద్దరు కవలలు పుట్టితే, జన్మంలో  ఏ  ఐదు నిమిషాలో  తేడాగాదా, తక్కినవన్నీ  ఒక్కటే ఉంటాయి.  అయినా  గుణగణాలలో, వ్యక్తిత్వంలో  తేడాలు ఉంటున్నాయా లేదా?
   హేమ: మీరు  చెప్పే విషయాలు  శాస్త్రంవల్ల నిర్ధారణ కావాలి కదా!
   కమ: అవి శాస్త్రంవల్ల నిర్ధారణ  చేసినప్పుడు  ఆయా  శాస్త్రాల మార్గాన ఈ  సిద్దాంతాలకు వచ్చి వుండిరి.
   హేమ: ఒక విషయం అల్లాంటిది చెప్పండి.
   కమ: వేదంలో  ఎన్నో సత్యాలున్నాయి. అవన్నీ ఈ రోజుకు నిజమేకదా! జ్యేష్ట పెద్దనక్షత్రం అన్నారు.

విష్ణుమండలానికి తారకాగోళాలన్నీ వెడుతున్నాయన్నారు. అవన్నీ నిజమని ఈరోజు శాస్త్రకారులు ఒప్పుకున్నారా లేదా?

   హేమ: ఏమండీ అక్కగారూ, మీరూ  అచ్చంగా మాబావకుమల్లేనే వాదిస్తున్నారే.
   కమ: ఎవరు మీ బావ ?
   హేమ: త్యాగతి  శర్వరీభూషణ్ గారు.
   కమ: అలాగా ! ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగన్న శిల్పి! మొన్న మదరాసు కళాసంఘంవారు  ఏర్పాటు చేసిన  శిల్పచిత్రకళా ప్రదర్సనంలో మూడు ప్రధమ బహుమానాలు పొందారు. మూటికన్న ఎవ్వరూ ఎక్కువ పొంద కూడదన్నారు. కాని, అన్ని ప్రథమ బహుమానాలూ ఆయన  కొట్టేయవలసిందే !
   ఆంధ్రమహిళా  సభాభివ్రుద్దికోసం పని చేయాలని ఆవేదనతో  హేమపట్నం అంతా  తన కారుమీద తిరగడం  , సబ్యురాండ్రను చేర్పించడం పెట్టుకుంది. నాలుగు వందలమందిని వివిధ విద్యాలయాలలో, కళాశాలలలో చదువుతున్న బాలికలను చేర్పించింది.
   వసంతోత్సవాలు తలపెట్టి  దుర్గాబాయమ్మగారితో కలిసి వసంతనాట్యం,  వసంత నాటిక,  వసంతపు ఆటలు, పోటీ పందేలు, వసంత చిత్రశిల్పకళా ప్రదర్శనం అన్నీ ఏర్పాటు  చేసింది. ఆంధ్రులకు  వసంతోత్సవం సంవత్సరాదినాడే బాగుంటుందని చెప్పింది. తాను నాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. నాట్యం నేర్చుకోవడానికి  అసలు  ఆంధ్రసంప్రదాయానికి  బిడ్డ అని తంజావూరి