పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోకేశ్వరి : మళ్ళీ ఆ సుందరి మాత్రం ఎందుకే? ' భీమశక్తి ' అని పేరుంచుకోరాదూ?

   త్యాగతి: నేను ఆ పేరును బలపరుస్తున్నాను!
   కల్ప: నేనూనూ!
   అందరూ చప్పట్లుకొట్టి  పకపక నవ్వారు. ఇంతట్లో తోటలోనికి వెళ్ళిన తీర్థమిత్రుడు అక్కడికి వచ్చాడు.
   తీర్థమిత్రుడు:  ఏమిటి హేమం ఈ  గడబిడ అంతానూ?  త్యాగతి గారు మీ  బావగారట. ఏమండీ త్యాగతిగారూ! నా అభినందనాలు స్వీకరించండి.
   త్యాగతి: స్వీకరించాను. కాని  ఎందుకండీ  ఆ  అభినందనాలు?
   తీర్థ: మా హేమకు మీరు బావగారుగా?
   కల్ప: అది అంత గొప్ప ఉద్యోగమా  ఏమిటి?
   హేమ: అందుకు మా బావకు ఎంత జీతం ఇస్తానని   నీ  ఊహ తీర్ద్ !
   లోకేశ్వరి: ' ఓ మరదలా!' అని పిలిచే హక్కు!  అంతకన్న పెద్ద  జీతం ఏం కావాలేం?
   హేమ : చాలా బాగుంది. అయితే  రోజుకు  ఒకసారికన్నా  ఎక్కువగా నన్ను ' మరదలా ' అని పిలవకు బావా!
   లోకే: అది  సగం జీతమే!  నీచేత  'బావా' అని పిలుపించుకోవడం తక్కిన సగం జీతం.
   హేమ: అయితే నేనూ, మా బావాను,  రోజుకు ఒకసారికన్న ఎక్కువసార్లు 'బావా!'  అని పిలవకూడదన్నమాట. లేకపోతే ఇండియా  వైస్రాయికన్న మా 'బావకు' జీతం ఎక్కువౌతుందన్నమాట.
   త్యాగతి : ఈ  ఉద్యోగంలో వున్న విధులు?
   తీర్థ: మీ  మరదలితో కూడా  తిరుగుతూ,  చాకిరీలు చేసి పెడ్తూ వుండడం...
   హేమ: దద్దమ్మ  పనులకు నువ్వు మొదలు రకపువాడవు.  కల్పమూర్తి వీటిల్లో  నిసిందాయే.  మా బావ వట్టి ఉత్తరాదివాడు.  ఇంకా  వీటిల్లో కొత్త. ఇక నాకు  కావలసింది  మా బావగారి  గురుత్వం  ఏం బావా! నాకు శిల్పం, చిత్రలేఖనం బహుభాషాకోవిదత్వం నేర్పుతావా?                                                                                                                            
           
               

తీర్థ: అంతకన్న ఆయనకు ఏం కావాలి? ఉత్తమ గౌరవోద్యోగం?

   కల్ప: మన్ని పదిపుటాలు వేసినా  అవి  రావుగా మనకు.
   లోకే: తీర్థమిత్రుడుగారు  తలడువ్వుకోడం,  పౌడరు  అద్దుకునే విధానాలు అన్నీ  బాగా నేర్పగలరు.
   తీర్థమిత్రుడు  లోపల మండిపోతున్నాడు. వీళ్ళంతా  ఏకమయ్యారు. త్యాగతి చంటికుఱ్ఱవాడా?
   ఈ  ఆలోచన గ్రహించాడా అన్నట్లు  త్యాగతి  చిరునవ్వుతో, కల్పమూర్తి, లోకేశ్వరి, హేమల వైపు చూచి, మీరందరూ ఇవాళ  తీర్థమిత్రుడు