పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లేకపోయింది. సర్వవిధాలా పురుషునికి భోగ్యవస్తువుగా మాత్రం తన్ను తాను తయారుచేసుకుంది. ధనం ఉంది, చదువు ఉంది, అందం ఉంది, సంగీతం బాగా వచ్చు, ఏవో పాటలు రాస్తుంది, వ్యాసాలు రాసింది, రేడియోలో మాట్లాడింది, పాటలు పాడింది, ఒకటి రెండు రేడియో నాటకాలలో పాల్గొంది, అంతమాత్రాన తాను జీవిత కర్తవ్యం ఏమి నిర్వర్తిస్తున్నది ?

   పురుషుడు  జీవిత  ధర్మం  నిర్వర్తిస్తున్నాడు! నిర్వర్తించి? అలా  జీవితంలో  కర్మయోగి  కావడమే  మనుష్యుని ధర్మం.  ఆడది?  ఆడది  మొగవాడికి  చేదోడు, వాదోడు;  అతని పురుషత్వానికి  నాయిక.  అతనికి పక్కవేసి, అతని బిడ్డలకు  పాలిచ్చి, బువ్వపెట్టి, వాళ్ళకు నీళ్ళుపోసి,  బట్టలుకట్టి  పాఠశాలలకు పంపి, వాళ్ళకు  ఆపత్తువస్తే  ఆడుపులియై; రాత్రిళ్ళు  నీళ్లు పోసుకొని, తల  దువ్వుకొని,  బొట్టు  పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని,  పడకగదికి తయారై,  అతని కామదాహానికి  పెదవుల అమృతమిచ్చి, దేహమే  భోజనంగా అర్పించి;  అలసటపడి              నిద్రపోయి, మధ్య పాలబిడ్డ ఏడిస్తే  పాలు కుడిపి; తెల్లవారగట్ల లేచి, పాచిపనిచేసి,  చేయించి, కాఫీ ఉపహారాదులు పురుషునికి అర్పించి, వంటకు తయారై, భోజనం ఆ మగవాడకి పెట్టి, అతడు వంటకాలు బాగున్నాయంటే  సంతోషించి, అతడు వెళ్ళాక వంటిల్లు కడిగి, సర్ది,  ఏవో రెండు  మెతుకులు నోట్లో వేసుకొని; కొంచెం మేనువాల్చి, లేచి, రాత్రి భోజనానికి బియ్యం బాగు చేసుకొని, పప్పులు  అవి బాగు చేసి, ఇతర పనులు చేసుకొని,  పక్కయింటి అమ్మలక్కలతో నాలుగు కబుర్లు చెప్పి వాళ్ళనీ వీళ్ళనీ ఆడిపోసికొని;__తెలివి తక్కువదైతే, ఇంటిపక్క వుండే  ఓ  వెధవయ్య కళ్ళ కబళింపులకు గుటకులు మ్రింగి,  హడలి బేజారై ; పెరిగి, జుట్టు అక్కడక్కడ  నెరసి, అత్తగారై, కూతురు కాంక్షలతో  తన కాంక్షలు మిశ్రమంచేసి, ఆపేక్షలతో అల్లుళ్ళను ముంచి కోడళ్ళను కత్తులు నూరి; అమమ్మయై; బామ్మై, పళ్ళూడి  మనుమరాళ్ళనూ, మనుమలనూ ఆడించి;  వివధయై బుఱ్ఱ గొరిగించుకొని, వంగిపోయి,  వెఱ్రి ఆచారపరురాలై, ఆపేక్షలు మరచి,  అందరికి గుండెలో నిద్రై, చావు రాక  కష్టాలు రుచి చూచి,  ఏడ్చి,  చివరకు కళ్ళల్లో  నీళ్ళులేక క్రుంగి, మునిమనుమల మనుమరాండ్ర బాధలకు లోనై, ఇనిమనుమల నెత్తి, ఇతరులు తన చావుకోర,  తన చావుకై తాను దేవుళ్ళ ప్రార్ధించి పండై, ముగ్గి ముగ్గి, రాలిపోయి,  గంపెడు సంసారపు తల్లి తల్లిగా పొగడ్తలనందే,  ఆడదాని జీవితమేనా  తానూ  అనుభవించేది!
   తన స్నానాల గదిలోనే తానొక  నిలువుటద్దం అమరించుకొన్నది ఆమె అనుకుంది;  ఆడదానికి తన అందం తాను చూచుకొని ఆనందించే వెఱ్రి వుంది.  తన అందం ఆడవాళ్ళు చూచి  ఆనందించాలి.  మగవాడు చూచి ఆనందించాలని  అనాచ్చాదితమైన  తన దేహం  సంపూర్ణంగా చూచి  స్త్రీలు ఆనందించాలని  కోరుతుంది,  లేక అసూయతో వుడికిపోవాలని కోరుతుంది.  అచ్ఛాదితా నచ్చాదితంగానో