పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమ : నేను స్నానం చేసి వస్తాను. మీ రందరూ మాట్లాడుతూ ఉండండి. తీర్థం! నువ్వేమీ పెద్ద ఆశ్చర్యంలో పడి మా బావను హడల గొట్టకు. ఎలాగో దొరికాడు. మళ్ళీ ఏ దేశమో పోయాడా అంటే, కొంపలు మునుగుతాయి అని ఆమె పరుగెత్తినది.

                                                                                                                11
   త్యాగతి వినాయకరావుగారి  అల్లుడనీ, చనిపోయిన పెద్దమ్మాయి  శకుంతలమ్మగారి భర్త  అనీ నెమ్మదిగా  ఆ  యింటిలోని  నౌకర్లందరకూ, పనికత్తెలకూ, వంటవారికి  తెలిసింది.  వంటలక్కకు  ఎడాదినాడు  త్యాగతిగారిని చూసి  వెంకట్రామ రాజ్యలక్షమ్మగారు  మూర్ఛపోయిన దృశ్యానికి అర్థం  తెలిసింది. ఆనోట  ఆనోట  త్యాగతిగారికీ  చిన్నమ్మాయి హేమసుందరిగారిని  ఇస్తారని  గుసగుసలుగా తెలిసింది. అసలే నౌకర్లందరకూ  త్యాగతిగారంటే  ఎంతో ప్రాణం.  అతనిలోని తేజస్సు, అతనిలోని నమ్రత, ఠీవి,  ఉదార హృదయం, ఆయన శక్తులు, నౌకర్లందరకూ  గౌరవమూ, ప్రేమ కలిగించాయి. నేడు వారందరికీ  త్యాగతి  అత్యుత్తమ పురుషుడే  అనిపించినది.
   లోకేశ్వరి స్నానంచేసి,  బట్టలు  ధరించి, తిన్నగా తన  గదిలో  పూజాపీఠం దగ్గరకు  వెళ్ళింది. అక్కడ శకుంతల  ఫోటో, పార్వతీ, లక్ష్మీ, అన్నపూర్ణాదేవుల  విగ్రహాలున్నాయి.
                                                                                                                           
           
               

శకుంతలక్కా! హేమ బావగారిని తెలుసుకుంది. నువ్వే నన్ను రక్షించావు. నీ చెల్లెలిని కూడా రక్షించావూ? నువ్వే పార్వతివి, అన్నపూర్ణవు, లక్ష్మీదేవివి, సరస్వతీదేవివి? హేమను గురించే నాకు భయం. శకుంతలాదేవీ! నీ ఇష్టంవల్లనేకదా, శ్రీనాథమూర్తి బావగారు హేమ దగ్గరకు వచ్చానని తన గ్రంథంలో వ్రాసుకున్నారు! అని కళ్ళనీళ్ళు తిరుగుతుండగా ఫాలాన్ని ఆ పీఠంమీద ఆనించి ప్రార్థించింది.

   హేమసుందరి తాను  త్యాగతిని  వదలివెళ్ళి  స్నానంచేస్తూ  తన అందాన్ని చూసుకుంది. తెలుపుగులాబీల  ఆ బంగారు వళ్ళు, బిగువులు  తిరిగిన  వక్షోజాలు, గులాబీరంగుల  చూచుకాలు, వంకలు  ఎంచలేని  అంగరేఖలు  ఇది తన  ప్రథమ సంపద! అందంలో  నసీముకాని, మెహతాబ్ కాని, బీనాకాని, రేణుకాదేవికాని, లీలాచిట్నీస్ కాని, వనమాల, బీగంపారా, నర్గీస్, కాంచనమాలలుకాని ఎవ్వరూ తనకడ మైలుదూరంలోనైనా ఉండడానికి అర్హత ఉందో లేదో! కుర్షీద్!  సుబ్బలక్ష్మి, రోమలా, దేవికారాణి కన్నన్ బాలా, వసుంధర, జయమ్మలకున్న  ఆకర్షణ శక్తికన్న తనకు నూరురెట్లు ఎక్కువ ఉన్నదన్నమాటా  నిజం.  తాను ఆనర్సులో  మగవాళ్ళందరినీ మించి, విశ్వవిద్యాలయానికి  మొదలుగా జయమంది, పతకాలూ, గౌరవమూ సంపాదించింది.
   మూడునెలలైంది  తన్ను  వివాహంకాగోరి, ఒక అరవయ్యరు   ఐ. సి. ఎస్, రాయబారము పంపించాడు. కాని తన తల్లిదండ్రులకూ  తనకూ  ఏమీ  యిష్టం