పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉత్తమ పురుషునకు నేను తగిన మరదలను కాను సుమా? అని అంటూ చెంపలు వదలి, వెళ్దాం లే అంటూ లేచి కారు దగ్గరకు గబగబ నడవడం ప్రారంభించింది.

                                                                                                              10
   మరునాడు   ఉదయం   తీర్థమిత్రుడు   హేమసుందరి ఇంటికి వచ్చాడు. హేమ ఇంకా ఇంటికి  రాలేదు, లోకేశ్వరీ లేదు.
   పనిమనిషి, వాళ్ళిద్దరినీ రాత్రి  త్యాగతిగారు తన ఇంటికి తీసుకుపోయారండీ. అమ్మాయిగారు ఆరింటిలోనే బోయినముండీ! అక్కడే ఆరు  పడకంట అని  తీర్థమిత్రునితో చెప్పింది.
   అతడు తెల్లబోయాడు. అతని  ముక్కుపుటాలు విప్పారినవి. త్యాగతి  తన హేమకు  టోపీ వేశాడన్నమాటే! వృద్ద జంబుకము! దొంగ! హీనుడు! నికృష్టుడు! ఎవడు వీడు? హేమసుందరిని తనకు కాకుండా  చేయగలవాడు? తన శక్తి  ఎరుగడు గాబోలు. ఈ దద్దమ్మా, ఈ  శిల్పిగాడా, ఈ  ముసలి గాడిదా తనకు అడ్డం వచ్చేది? అతడు చిరునవ్వు నవ్వుకున్నాడు.
   ఒక్కొక్క    కొత్త    మన్మథవిజయం  ఒక కొత్త  రుచి  సమకూరుస్తుంది. తాను ధరించిన  స్త్రీ  హృదయాలకు  అఖండ  దాక్షిణాత్య సినీ ఆకాశ  ధళం  ధళకమైన కనకలతా, ఒక్కొక్క బొమ్మకు లక్ష రూపాయలు తక్కువ కాకుండా  పుచ్చుకునే  తారారాణి కూడా  కొలికిపూసలైనారు. ఎందుచేతనో  హేమ తన  రసికత్వానికి దాసురాలు  కాక తప్పించుకొంటోంది. రతీనాధుని అస్త్రాలూ  తన దగ్గిర  ఎన్ని  ఉన్నాయో, అన్నీ ఉపయోగించినా, పక్కనుంచి  జారిపోతోంది. ఈ అమ్మాయి ఒక విచిత్ర  స్త్రీ జాతికి  చెంది. ఉండాలి! పాత మంత్రాలు ఇచట  పారవు.  
   లోకేశ్వరి విషయంలో  కొంచెం  ప్రయత్నించినమాట నిజం. కాని ఆ తెలివి  తక్కువ దద్దమ్మ  తనంటే  ఓ  పురుగులా  చూస్తుంది. తన శక్తులలో  దిట్టమైనవి కొన్ని  ఉపయోగిస్తే  లోకేశ్వరి  ఈనాటికి....కాని  అసలు  వస్తువుకోసం  చూస్తూ  ఈ వడ్డీల గొడవ తన కెందుకు? నాయికను కరిగించలేక దూతికను  పట్టుకున్నట్టవుతుంది. తాను హేమతో  స్నేహం ప్రారంభించిన ఈ  రెండేళ్ళనుంచీ, జర్మనీయుద్ధం  చేయవలసి వస్తోంది. ఒక పక్క  ఆ  పందిగాడు కల్పమూర్తి,  ఓ పక్క లోకేశ్వరి,  నిశాపతి ఒకడూ, నిశాపతి తన సంగతి,  తన యుద్ద కార్యక్రమం గ్రహించిన అసాధ్యుడు. అందుకనే  తానతిజాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. తీర్థమిత్రుడైన జానకి రామమూర్తి   ఆ  ఉదయం  హేమసుందరి చిత్రానికి  ఎదురుగుండా  సోఫాలో కూర్చున్నాడు. హేమసుందరి ఎవరికైనా  మతి  పోగొట్టగల  బాలిక. ఈ  అందం వినాయకరావుగారి  కూతురు కెల్లా వచ్చిందో అనుకున్నాడు.