పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇక్కడ ఓ అబ్బాయి ఇల్లు కొనుక్కున్నాడట. శిల్పాశ్రమం కట్టించాడట! ఇవన్నీ వదలి, గురువు దగ్గరకు వెళ్ళి వున్న కుఱ్ఱవాడు దెబ్బలాడలేక పరుగెత్తుకువెళ్ళి తల్లికొంగులో దాక్కున్నట్లు వాళ్ళ గురువుగారి జాభ్రా గుడ్డల వెనక దాక్కుంటాడట!

   త్యాగతి  ఆమె  మాటలకు  పకపక  నవ్వాడు.  నీ కోపమూ అందంగా  ఉంటుంది అన్నాడు.
    నువ్వు  నన్ను  పొగడనక్కరలేదు. ఒక అమ్మాయిని  తన వలలో  వేసికొని, 'పెళ్లి 'అనే పేరుతో  తన బానిసని  చేసుకుందామని  సంకల్పంతో  ఆ  తాయిలంగారే  మదరాసులో  ఏడాదిమకాం పెట్టి, ఆ అమ్మాయి ఏమీ తెల్పకుండా వుంటే, వాళ్ళ గురువుగారి దగ్గరకు  పరుగెత్తాడట. నిశాపతి నంది పర్వతాలకు వెడితే, త్యాగతి హిమాలయాలకు  పారిపోతాడట. కల్పమూర్తి  వింధ్య పర్వతాలకు దౌడుతీస్తే, ఇంక ఇక్కడ స్పచ్ఛంద ప్రణయవాదిని అని బడాయి  కొట్టుకునే చక్కని  పెళ్ళామున్న తీర్థమిత్రుడూ, నేనూ మిగలాలా? నేనేమన్నా  ఝాన్సీలక్ష్మినా, లోకంతో  ఒంటిగా  దెబ్బలాడటానికి?
   హేమా! నేను వట్టి  వాజమ్మనే! వేళాకోళంగా  అంటే అంత  కోప్పడతావేం అన్నాడు త్యాగతి.  ఈ బాలిక  ఎంత  నవీన యుగహృదయ! మొమోటమే లేకుండా కర్ర  విరిచినట్లు  చెప్పేసింది. నిర్భయం! యింత హంగామా  చేసి, అతి గోప్యంగా  అతి జాగ్రత్తగా  తాను  సంచరిస్తే, రెండు మాటలలో  తేల్చిపారవేసింది.  ఇంక తాను  మాత్రం  తన పూర్వ విధానానికి  ఏ  రీతిగానూ,  అణువు కూడా  తప్పకుండా  సంచరించాలి. ఇక తన కర్తవ్యం తన కళే! వీలయినంత  జాగ్రత్తగా హేమను  ఆమె ఎవరినో  తానిష్టపడిన యువకుణ్ణి  వివాహం చేసుకునేవరకూ,  కనిపెట్టి  వుండడమే  తన యోగం  అనుకున్నాడు.
    వెడదామా హేమా? 
    నేనంటే అప్పుడే  విసుగు  వస్తోందా బావా?  అవును, నేను  శిల్పినికాను, నీతో  కళలను  గూర్చి  చర్చించను.  పోనీ అంత సంగీతమూ నేర్చుకొని  ఒక్క  పాటైనా  పాడను. పాటలను గూర్చి, సాహిత్యాన్ని  గూర్చీ నిన్ను  ప్రశ్నలు వేయను. వేదాంతమును  గూర్చి   చర్చించలేను.  ఇన్ని దేశాలు తిరిగారు బావగారూ,  ఆయా  దేశాల విచిత్రాలు  చెప్పండి  అని అడగను. ఎంతసేపూ  సీతాకోకచిలుకలా ఇక్కడా  అక్కడా  వాలడమూ, టెన్నిసూ, సినిమాలూ, బాతాకానీ, బ్రిడ్జి అటా, స్నేహితులూ, స్నేహితురాండ్రూ,  బీచి షికారూ, దొంగతనంగా అప్పుడప్పుడు  సిగరెట్టూ, తుక్కునావెల్సూ ఇంతేగా  నా జీవితం. ఈ  సోదాబుడ్డితో  నీకు విసుగుకాదా మరి? 
    హేమా! 
    మళ్ళీ  ఇంకో  ఉపన్యాసం  ఇవ్వడానికి సిద్దం అవుతున్నావూ?
   త్యాగతి పకపక నవ్వాడు.  హేమ తన బావగారి  రెండు చెంపలు  తన అత్యంత  మృదులమై,  పరమ  సౌందర్య  రేఖలతో  చెన్నారే చిన్న హస్తాలతో అదిమి పట్టుకొని,  అతని కళ్ళల్లోకి తేరిపార చూచి,  బావా! నీవంటి