పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తపస్సయింది. అప్పుడు దేవతలు ప్రత్యక్షమై విగ్రహాన్ని వనితను చేశారు. అతని కోర్కె నెరవేరింది. ఆ కథను ఈ కాలానికి సమన్వయం చేసి బెర్నార్డుషా మహాకవి ఒక నాటకం రాశాడు.

   ఆ కథలో  ఒక ఇంగ్లీషు భాషావేత్త  అయిన  మహాపండితుడు భాషలోని  యాసాలూ, గ్రామ్యాలూ  ఎందుకు వచ్చాయి? ఎల్లావస్తాయి? అనే  సమస్యను పరిశోధిస్తూ కూలివాళ్ళల్లోనూ, నికృష్టజీవులలోనూ తిరుగుతూ వుంటాడు. అప్పుడొక బాలిక  మాట్లాడే  కర్కశపు గ్రామ్యభాషను గమనిస్తూ ఉండగా ఒక పెద్ద మనిషితో పంతము వచ్చింది.  ఆ పరిసరాలనుబట్టి   భాష ఉన్నతి పొందడము, హీనస్థితికి పోవడము  జరుగుతుందని భాషావేత్త  వాదన. దానిపై వారిద్దరూ  పందేలు వేసుకొని  ఆ బాలికచే  స్వచ్ఛమైన భాష  మాట్లాడించగలనని భాషావేత్త  ఆ బాలికను  తన ఇంటికి  తీసుకొనిపోయాడు.  అతిప్రయత్నంచేసి  అతడు  ఆ బాలికకు  ఉత్తమ సంస్కృతీ, ఉత్తమ  భాష నేర్పుతాడు.  బాలిక సంపూర్ణంగా మారిపోయి, ఏదో పెద్ద కుటుంబములో జన్మించిన సుందరివలె  పెరుగుతుంది. నిద్దరపోయే ఆ బాలిక హృదయం  మేల్కొంది. ఆమె తన  గురువునే  ప్రేమిస్తుంది. ఈ నవీన  పిగ్మిలియాను తాను సృష్టించిన ఈ బాలికను  తానే ప్రేమిస్తాడు. ఈ గాథను  అత్యంత రసవత్తరముగా అమెరికా  హాలీవుడ్ వారు  చిత్రం తీశారు. మానవ జీవిత  సమస్య త్యాగతి  గుండెను  కదిపివేసింది. హేమ ఆలోచనలో  పడింది.
   తిరిగి వస్తూంటే హేమ బావా! నేను  ఆలోచించిన  కొలదీ  మగవాని  అహంభావానికి అంతులేదు అని  అనుకోవలసి వస్తుంది  అని  ప్రశ్నార్థకమైనమాట అన్నది.   నీ ఉద్దేశం ఏమిటి?  అని కదా ఆమె మాట. తానేమి  చెప్పగలనని  త్యాగతి అనుకొన్నాడు.
   నువ్వలా  అనుకోడానికి  కోటి కారణాలు  ఎప్పుడూ ఎదురుగా కనబడుతూ ఉంటాయి.
    సరేలే, నీ  గోడమీద  పిల్లివాటపు కబుర్లు!  షాగారి రాతల్లో మగవాడే  స్త్రీని  తయారుచేశాడు,  అని చూపించకపోతే, ఒక స్త్రీ మూర్ఖుడైన  కూలివానిని చూచి, వాణ్ణి ఎంతో నాగరికత కలవాణ్ణిగా మార్చి, వాణ్ణి తాను ప్రేమించి బాధపడినది అని  చూపించకూడదూ?
    అవును. అలానూ రాయవచ్చును.  యేదైనా అసలు సత్యాన్నే ప్రదర్శిస్తాయి కాదా?
   నేను  అసలు  సత్యంమాట  తేనేలేదు, మగవాళ్ళకు అంతరాంతరంలోనూ, వాచ్యంగానో ఉన్న   మేమే గొప్ప అనే  అహంభావం వాళ్ళరాతల్లో, చేతల్లో, మాటల్లో, పాటల్లో, వ్యక్తం అవుతూ  ఉంటుందని నా వాదన.                                                                                                                           
           
               

నిజమే! ఏ కారణంచేతనో పురుషుడు ప్రతి విషయంలోనూ ముందుగా పని ప్రారంభించాడు. అతనికి స్త్రీ ప్రేమ అన్నిటికన్న ముఖ్యంని అందుచేత తాను విడదీయదలచుకొన్న ప్రతి సమస్యకూ తమ నాయకుణ్ని చేసుకుంటాడు. తాను భావించుకొన్న స్త్రీని నాయికను చేస్తాడు. ఈ విధంగానే