పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పచ్చడీ, ఉల్లిపాయ పచ్చిపులుసూ, ఆవడలూ, పరమాన్నమూ పిండి మిరియమూ,చారూ, పెరుగూ వరస వరసగా వడ్డించింది.

   హేమ: అత్తగారూ, పండగ  అనా ఏమిటి ఇన్ని చేశారు?
   రంగ: నువ్వు రావడమే  పండగ తల్లీ! ఎప్పుడో నీ చిన్నతనంలో  ఆరేళ్ళపిల్లవై ఉన్నప్పుడు మా ఇంటి భోజనానికి  వచ్చేదానవు. ఇన్నాళ్ళైన వెనక  ఈ మాత్రం చేస్తే ఒక గోప్పటే! నాకేమీ తృప్తిలేదు తల్లీ!
   త్యాగతి: మా అమ్మ అయిదు నిమిషాలలో  ఆరు రకాల పిండి వంటలు చేయడమూ, అబ్బే అనడం మామూలే హేమా!
   హేమ: అత్తయ్యగారి వంట ఎంత చక్కగా వుందీ! మా ఇంటిలో  ఈ  పోపు రుచి ఏది? ఏదో మా వంటలక్క  వండుతుంది. ఇంత గొడ్డుకారం  పారేసో. ఇంత ఉప్పు సముద్రం చేసో, మా  ఇంట్లో ఖర్చుతగ్గిస్తూ వుంటుంది.  మా నాలుకలు బండబారి పోయాయి.
   రంగ: వదినగారు దగ్గిర  వుండి చెబుతూనే  వుంటారే?
   హేమ: అస్తమానం  చెబుతూ  కూర్చుంటారా ఎవరైనా అత్తయ్యా? ఇంక నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో,  మా అరవయ్యరు నాకూ, లోకానికీ వేరే చేసేవాడు. అరవ వంటలు  మనం ఎరగమా! ఎప్పుడూ ఆ వుప్పు చప్పని  కూరలే. నేనందుకనే ఊరగాయల  పనే పట్టిస్తూ వుంటాను.
   వారిద్దరి భోజనాలు  అయ్యేసరికి  తొమ్మిదిన్నర అయింది. హాలులోకి పోయి  తివాసిమీద కూర్చుండినారు. వారి పనిమనిషి  తాంబూలపు పెట్టె తెచ్చి, వారి దగ్గర  ఉంచింది. హేమ  తమలపాకులకు సున్నం రాచి, బావగారికి  ఆకులూ, వక్కపోడుమూ, సువాసన ద్రవ్యాలూ  ఇచ్చింది. తానూ వేసుకుంది.
   హేమ: బావా! మనం ఇద్దరం ఈ వెంటనే  ఏదైనా సినిమాకు పోదాం వస్తావా?
   త్యాగతి: సినీమా! ఏ సినీమా?
   హేమ: ఏదో సినిమా. లేదా, సముద్రపు ఒడ్డుకు  షికారుకు పోదాం!
   త్యాగతి: సరే! మా అమ్మతో చెప్పిరా! మా బోయీని తీసుకొని వెడదాం. సినిమా  చూస్తున్న సేపూ కారులో వుంటాడు. అయితే నువ్వు  మా  ఇంటిలోనే  పడుకోవాల్సి వస్తుందేమో!
   హేమ: అలాగే పడుకుంటాను.
   త్యాగతి: సినీమా నుంచి వచ్చేటప్పుడు మామయ్య గారితో  చెప్పివద్దాం!
   హేమ: అలాగే  లోకాన్ని  కూడా  కొట్టుకు వస్తాను.
   ఇద్దరూ, బోయీ  వెనక కూర్చుండి వుండగా, కారు ఎక్కారు. హేమ తనపక్క  త్యాగతి కూర్చుని వుండగా, కారు వేగంగా  నడుపుకొంటూ వెస్ట్ ఎండ్ సినీమాకు కారు పోనిచ్చింది. ఆరోజు సినీమా 'పిగ్మి లియాన్' అనే చిత్రము. ఒక గ్రీకు  శిల్పి  ఒక అద్భుత సుందరమూర్తి  అయిన  జవ్వనిని  శిల్పించి,  ఆ శిల్పసుందరి అందానికి  తానే ముగ్థుడై ప్రేమించాడు. అతని ప్రేమ దేవతలను  కలచివేసే  మహాదుఃఖ