పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నకూ ఆరోగ్యమునకూ వేసుకొను పొడిగల వెండి డబ్బా వుంది. ఈ గదులలో అన్నీ ఆకుపచ్చ దీపాలున్నవి. అలంకారపు గదిలో కాంతిగల ధవళదీపాలే వున్నవి.

   హేమసుందరి చటుక్కున నీళ్ళుపోసుకొనవలెనని తలచి, తలుపు వేసుకొని, కంఠస్నావ  మాచరించినది. స్నానమాచరించి, అక్క  చీరకట్టుకొని, రవిక ధరించి బీరువా నిలువటద్దములోనూ, బల్ల అద్దములోను చూచికొని, దొనదొన కన్నీరు కార్చినది.
    అక్కా, ఈ  ఆనందం  వదలి ఎందుకు  వెళ్ళావు? నీకూ, నీభర్తకూ ఎంత ప్రాణమే! అని కుళ్ళిపోయింది.  వెంటనే స్నానాలగదికి పోయి మొగం కడుక్కొని తుడుచుకొని, తలదువ్వుకొని, బొట్టు పెట్టుకొని, గది యివతలకు వచ్చినది.
   శ్రీనాథమూర్తి తలుపునకు  ఉన్న  తెర వత్తిగించి వచ్చిన హేమను చూచిఅయ్యో! అని గబగబ ముందు హాలులోనికి పోయి  సోఫాపై  కూలబడ్డాడు. హేమ తెల్లబోయి  వంటింటిలోనికి పోయింది.  హేమను చూచి  రంగనాయకమ్మగారు నిలువునా  కూలబడిపోయినారు.
       
                                                                                                            8
   కూలబడిపోయిన రంగనాయకమ్మగారి దగ్గరకు  హేమ పరుగెత్తుకునిపోయి, అత్తయ్యా! ఏమిటి, ఏమిటి? అంటూ  మోముపై నీరు చల్లినది. వెంటనే  రంగనాయకమ్మగారికి  మెలకువ వచ్చినది. ఆమె లేచి కూరుచుండి, హేమా, చటుక్కున ఎందుకో నా తల తిరిగినది. ఏమీ భయంలేదు. మీ ఇద్దరికీ వడ్డిస్తాను. మీ బావను పిలు తల్లీ! అని అన్నది.
   హేమకుసుమ అత్తయ్యా ! నేను మా అక్కచీర కట్టుకుని వస్తే అచ్చంగా  శకుంతల  అనుకొని, మీరూ, బావా కంగారుపడిపోయినారు. నన్ను పదిపుటాలు వేసినా  మా అక్కను  కాలేను. నేను వెళ్ళి బావను  తీసుకువస్తాను, వుండండిఅని  ముందుహాలులోనికి వెళ్ళింది.
                                                                                                                            
           
               

కంటనీరు కారిపోతుండగా త్యాగతి సోఫాలో కూలబడి వున్నాడు.

   ఏమయ్యా త్యాగతీ, నీకేమన్నా  మతిపోయిందా! రా! ఆడవాళ్ళ కన్న అధ్వాన్నమైనావేమి! అని  హేమ త్యాగతి భుజంమీద చెయ్యివేసి అడిగినది. త్యాగతి  లేచి, కంటనీరు  తుడుచుకొని, డగ్గుత్తికతో హేమా! ఈలాంటి  హృదయవేదనలు వస్తూనే వుంటాయి. ఏదైనా  ఒక విషాద  సంఘటన  జరిగినప్పుడు, ఈలాంటి బాధలు రాకుండా వుంటాయా! అని  మళ్ళీ క్రిందనున్న స్నానాల గదికిపోయి మొగము కడుక్కొని, తువాలుతో తుడుచుకొని  వంటింటిలోకి పోయి, పీటపై కూర్చున్నాడు.
   హేమ వచ్చి, తన పీటపై కూర్చుంది. రంగనాయకమ్మగారు వడ్డన చేసింది. రెండు వేపుడు కూరలూ, కొబ్బరికాయ, పెరుగుపచ్చడీ, గోంగూర