పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బుడ్డి, కుంకుమ భరిణ, పండ్లపళ్ళేలూ, పూవుల సెజ్జలూ వున్నాయి. తూర్పుగోడకూ, పందిరి మంచానికీ ఈవల ఆవల నిలువుటద్దాలున్నాయి. గోడలపై త్యాగతి, నిన్ననాడు రచించిన రాధాకృష్ణ, సీతారామ, సుభద్రార్జున, ఉత్తరాభిమన్య, పార్వతీ పరమేశ్వర, ఉషానిరుద్ద, రతీమన్మథ చిత్రాలున్నవి. ప్రతిదంపతుల చిత్రాలలోనూ ప్రేమమయిమయిన అద్భుత సంఘటన ఒకటి చిత్రితమై ఉంది.

   ఇవన్నీ  పరిశీలించి  చూస్తూ,  ఆ గదిలోనుండి తూర్పుగా  ఇంకొక గదిలోనికి  వున్నద్వారం తెర ఒత్తిగించి, ఆ గదిలోనికి  వెళ్ళింది హేమ. ఆ గది  తమ వస్త్రాదులు, ఇతర వస్తువులు  వుంచుకునే గది. ఆ గది తూర్పు  గోడకు  రెండు కిటికీలున్నాయి. ఆ కిటికీలకు ప్రక్కనే  రెండు  అలంకారపు బల్లలముందు  చక్కని  కుర్చీపీటలున్నాయి.  ఆ బల్లకు పెద్ద పెద్ద  అద్దాలున్నాయి. ఒక బల్ల  స్త్రీల అలంకారపు బల్ల, రెండవది  పురుషులది,  ఒకటి తన అక్కదై  వుంటుంది. రెండవది తనబావదై  ఉంటుంది.  అందులో తూర్పు గోడపైన  నిలువెత్తు  ఛాయాపటంలో తన అక్కా, బావా వధూవరులుగా  తీయించుకున్న ఫోటో పెద్దదిగా చేయబడిన బొమ్మ వున్నది.  ఉత్తరపు గోడమీద ఆ  దంపతుల  గర్భాదాన  మహోత్సవము నాటి జంట చిత్రము,  నాలుగు అడుగుల ఎత్తున  పెద్దది చేయబడి వున్నది. దక్షిణపు గోడమీద  అంత పెద్దదే  తనబావ  అక్కను  పూజ చేయుచున్నట్లున్న పటమున్నది.
   తన అక్క్గగారి చిన్నఫోటో అద్దములోవున్న బట్టల బీరువా  ఉత్తరపు గోడవైపున వుంది.  దక్షిణపు గోడవైపున తన బావగారి  చిన్న ఫోటో  అద్దములో ఉన్న బట్టల బీరువా ఉన్నది. ఆగ్నేయమూలను బావగారికి కాబోలు  మాసినబట్టలు వేయుటకు  గవాక్షములున్న కఱ్ఱ పెట్టె ఉన్నది.  ఈశాన్యమున  అక్కగారి పెట్టె  ఉంది.  అక్కగారి పెట్టేలన్నీ అక్కగారి  బీరువాప్రక్క ఉంచబడినవి. బావగారి  తోలుపెట్టెలూ, ట్రంకులూ ఆయన  బీరువాప్రక్క ఉన్నాయి.
   ఈ గదిలోనుండి  ఉత్తరంగా  ఒక గుమ్మం ఉన్నది. అది ఒక చిన్న  స్నానాలగదిలోనికి దారి.  అందుండి పడమటివైపుకు  దేహబాధా నివారణపు గదిలోనికి  దారి ఉన్నది.
   అలంకారపు  గదిలో  అక్కగారి బీరువాకు తూర్పుగా  బట్టలు  వ్రేలాడదీయు నాలుగు కఱ్ఱల పొడుగాటి స్టాండున్నది. అలాగే బావగారి  బీరువాకు  తూర్పుగా  ఒక స్టాండు  ఉన్నది. తన అక్కగారి స్టాండుపై ఒక చక్కని  వంగపండు చాయ బెంగుళూరు చీరా, వంగపండు చాయ బెంగుళూరు రవికా ఉన్నవి. స్నానాలగదిలో వేడినీళ్ళూ,  గంధపు  సబ్బూ (వెండి పెట్టెలో)వున్నవి. స్నానాల పొడీ  పెద్ద తువాళ్ళూ వున్నవి. వేడినీళ్ళలో సువాస