పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆలోచనలు మాయమయ్యాయి. శకుంతల చిరునవ్వుతో ఎక్కడో మేఘాలలో నిలుచుండి కనబడింది. శకుంతలా! ఎందుకు నన్నిన్ని విధాల ఆరాట పెడతావు? అని అనుకొని ఆ దేవినే గమనిస్తూ తలవాల్చుకొని కన్ను మూసికొనే అలా కూర్చున్నాడు త్యాగతి.

   ఇంతలో ఆమె విగ్రహం  మాయమైపోయింది.  ఒక్క పెద్ద నిట్టూర్పు వదలి  తలెత్తి హేమసుందరి  నిలుచుండిన  ప్రదేశం  చూచాడు. ఆమె అక్కడలేదు. ఆమె ఎక్కడికి  వెళ్ళింది?  మూడు వరండాలు, డాబాలు చూచాడు. గ్రంథాలయంలోనికి వెళ్ళాడు  శ్రీనథామూర్తి. హేమ అక్కడ  ఒక చదువుల  పరుపుమీద వాలిపోయి,  దిండులో మోముదూర్చి వెక్కి వెక్కి  ఏడుస్తున్నది.
   శ్రీనాధమూర్తి తెల్లబోయి,  హేమా! అదేమిటమ్మా! నేను  రాక్షసుణ్ణి! నన్ను క్షమించు.  నీ జీవితంలోంచి  నేను  ఈనాడు  వెళ్ళిపోతాను. నువ్వు నన్ను  మళ్ళీ చూడగలిగే  స్థితి  వచ్చి  రమ్మన్ననాడే వస్తాను అన్నాడు.
                                                                                                                6
   హేమ కళ్ళనీళ్ళు  తుడుచుకొని  లేచి,  క్రిందకుదిగి వెళ్ళబోతూవుంటే శ్రీనాథమూర్తి  హేమా! నీవు మొహం  కడుక్కోవాలంటే,  ఈ మేడమీద  ఒక  స్నానాల గది  ఉంది, ఈలారా  అని  అక్కడకు  దారిచూపినాడు. హేమ  వెళ్ళి మొగం  కడుక్కొని లోపలికివచ్చి, శ్రీనాథమూర్తి పడకగదికి ముందు  చిన్నగదిలో  ఉన్న అద్దం ముందర పీఠికపై  కూర్చుని  తన చేతిసంచి తెరచి  అందులో  ఉన్న  చిన్న బంగారు  భరిణలోని పౌడరు మొగమునకు  చిన్న  కుచ్చుతో  అద్దుకుంది. ముందు  జుట్టు  సర్దుకుంది.
   ఇంతవరకు  శ్రీనాథమూర్తి  వరండాలో  నిలుచుండి ఆకాశాన  కమ్మిన నక్షత్రాలను చూపులేని  చూపుతో  చూస్తూ, ఆలోచనలేని  భావాలు  కమ్ముకురాగా,  వానిని   క్రుంగిపోయిన మనస్సుతో  గమనిస్తూ ఉన్నాడు.
   హేమ అంతా సర్దుకొని  త్యాగతితో మాట్లాడకుండా  క్రిందకు దిగి వెళ్ళింది అక్కడనుండి. ఆ చిన్న  మేడముందున్న  తన చిన్న  ఓపెల్ కారుదగ్గరకు పోయి, దానికి  ప్రాణోద్దీపన చేయబోయే సమయంలో  శ్రీనాథమూర్తి తల్లి  రంగనాయకమ్మగారు వంటగదిలోంచి పరుగెత్తుకొని కారు దగ్గరకు వచ్చి హేమా, వెళ్ళిపోతున్నావా?  అన్నారు.
   రంగనాయకమ్మగారి గొంతులోని  బాధ హేమకు సముద్రపు  కెరటంలా కొట్టింది. ఎంతో సిగ్గుపడి  ఆ బాలిక,   లేదండీ అత్తయ్యా! కారులో పెట్రోలు కావలసినంత ఉందోలేదో చూస్తున్నాను అని ఒక చిన్న  అబద్దం  చెప్పి, వెనక్కు తిరిగి వచ్చి  తొడుక్కున్న  కాలిజోళ్ళు మళ్ళీ విప్పి, వంటింటిలోకి వెళ్ళిపోయింది.  ఎందువల్లనో  కోపం వచ్చిందినిన్నీ, ఆమె  ఆ  కోపంతో  వెళ్ళిపోబోయి, తనమాటల  కాగి, ఏదోవంక చెప్పినదన్న నిజము  రంగనాయకమ్మగారూ గ్రహించకపోలేదు.