పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమా? ఆ సంబంధాలవల్ల ఇతరులకు బాధ కలిగించుకోకుండా జాగ్రత్తపడాలిగాని!

   ఏవో  వేదాంత  రహస్యాలు  మాట్లాడక  స్పష్టంగా మాట్లాడుదూ? 
    నేను  నీ బావనయ్యాను.  నా జీవితంలోని ఉత్తమ భాగాన్ని పోగొట్టుకున్నాను.  ఆ భాగం  మీ అక్క  అవడంవల్ల నీకూ, నాకూ  సంబంధం ఏర్పడింది.  ఆ సంబందంవల్ల  నీ  జీవితానికీ,  నా జీవితానికీ  సంపర్కాలు, పరస్పర అభిమానాలూ, సహాయాలూ కావలసి వస్తాయి.
    తెలుగులో  మాట్లాడవయ్యా అంటే,  అరవంలో  మాట్లాడుతావేమిటి బావా!__ఎంత సులభంగా వస్తోంది 'బావా' అని   నా  నోటివెంట! నా చిన్నతనానికీ,  ఈ  ఈడుకీ  మధ్య ఉన్న  సంవత్సరాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి! 
    హేమా!  నా కథ అంతా   నీ స్నేహితులకు  చెప్పు. కాని  మీ అమ్మగారి, నాన్నగారి ఉద్దేశాలూ, నా భావమూ ఎవరికీ  తెలియనీయకు. నా జీవిత  చరిత్ర  గ్రంథం ఎవ్వరికీ యివ్వకు. మీ లోకేస్వరిని  మాత్రం చదువుకోనీ!
    అప్పుడే  ఆజ్ఞలు ప్రారంభించావూ! 
    అదేమిటి! త్యాగతి గుండె ఒక్కగతి తప్పింది.
    ఏమీలేదు. మీ మగవాళ్ళలో ఆడది నా వస్తువన్న  భావం  ఎంత ఉదార  హృదయం  కలవాళ్ళకీ పోదని నా ఉద్దేశంలే!
    అయ్యో రామా! ఇంతేనా నన్నిన్నాళ్ళు  అర్థం చేసుకున్నది! 
    ఆ!  బాగా అర్థం చేసుకున్నా! ఏడాది మౌనవ్రతాన్ని నీ కుట్రను  దాచుకోడానికి  ఆయుధంగా  ఉపయోగించుకొని, ఈనాడు  ఆ దొంగతనం బయలు పడితే, దానికి పవిత్ర  భావాలు కల్పించేందుకు లాయరులా  వడవడ వాగే  ఉపన్యాస  వాక్  ఝరీవేగం నా కర్థమయిందిలే  బావా! 
   అని  హేమ  మూతి  ముడుచుకొని  చటుక్కున  లేచి,  ఆ  డాబా వరండా  గోడ  నానుకొని ఇంటిచుట్టూ  పూవులతో  నిండి  వున్న  చేమంతుల  జాతుల్ని గమనిస్తూ నిలుచుంది.  ఆమెలో  నిర్వచింపలేని  మహావేదన ఆవిర్భవించింది.  అనేక  విధానాలుగా  తన  కుటుంబానికి బంధువైన  కుటుంబంవాడై,  అంతకుమించి  తన తండ్రి  ప్రాణస్నేహితుని కొమరుడై,  తన  అక్కకు  ఆత్మలు  కలిసిపోయిన  భర్తలు, తన్ను ఏదో  విచిత్రంగా అర్థం  చేసుకొని, ఏడాదిపాటు ఈ విచిత్ర  నాటకం ఆడినాడే? ఆమెకు  కోపము  పొంగిపొర్లి  వచ్చింది.
   త్యాగతి  ఆలోచించుకున్నాడు.  తాను   చేసిందంతా   తప్పనుకున్నాడు.  శకుంతలలేని  తన జీవితం చుక్కానిలేని  పడవనుకున్నాడు. శకుంతలా  లేదు! హేమసుందరి  తన్ను ఎప్పుడూ  సరీగా  అర్థం  చేసుకోలేదు. కానీ! ఏది  ఏమయితే  తనకేమి?
   త్యాగతి మౌనియై,  తలవాల్చుకొని  ఆ  కుర్చీలో  కూర్చున్నాడు. అతనికి  ఒకదాని వెంట  ఒకటి  ఆలోచనలు  తరుముకొని  వచ్చాయి. స్పష్టరూపంలేని ఆ