పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సోఫాపక్కనా, సోఫాకుర్చీపక్కనా చిన్న అజంతా పీఠాలు పుస్తకాలుంచుకోడానికి ఉన్నాయి. ఆ పదునాలుగు బీరువాలలో సంస్కృత, ఇంగ్లీషు, రష్యా, జపాను, జర్మనీ, డచ్చి, ఫ్రెంచి, బంగాలీ, హిందీ, చీనా, ఉర్దూ భాషలలో వేదాంత, కావ్య, చరిత్ర, విజ్ఞాన గ్రంథాలున్నాయి. త్యాగతి ఆ భాషలన్నీ ఈ తొమ్మిదేండ్లనుండీ నేర్చుకుంటుంన్నాడు.

    ఇదీ  నా  గ్రంథాలయం. నా కళా  గ్రంథాలయం ఇదివరకు  ఎన్నిసారులో  నీవు చూచినదేకదా! పైన  సోఫాలో కూర్చుందామా, లేక  లోపల ఈ  పరుపులమీద అధివసిద్దామా?  అని త్యాగతి ప్రశ్నించాడు.
   పైన  ఆ  సోఫాలమీదే కూర్చుందాము. అక్కడ  ఆ  పుస్తకాలలోని వాళ్ళూ,  ఆ  విగ్రహాలూ  మన సంభాషణ  వినడానికి  వచ్చి  కూర్చున్న  పరాయివాళ్ళలా నాకు కనబడతారు బావా! అది అలా ఉంచు.  ఇంత అందమైన  మేడ, ఈ  అపురూపమైన  వస్తువులు, ఇంత  చక్కని  పుస్తకాలయం, ఈ  మనోహరమైన అలంకారాలూ ఇన్నాళ్ళనుంచీ మాకు  చూపించకుండా ఎలా  ఉన్నావయ్యా!  ఆమె  ప్రశ్న కొంచెం  బాధతో  మిళితమయ్యే ఉంది.
                                                                                                                  5
   ఇద్దరూ  పై వరండాలో ఆ  సాయంకాలాల్పారుణ కాంతులతో  చెరి ఒక సోఫా కుర్చీపైన అధివసించారు. త్యాగతి  ఒక సిగరెట్టు వెలిగించాడు.
    హేమా, నేనేమీ రహస్యం  దాచకుండా  నా జీవిత చరిత్రా, నా హృదయమూ, అన్నీ  నా గ్రంథంలో వ్రాశాను.  ఈ ఏడాదినుండీ  నీయీ ఆనందమయ జీవిత  చరిత్ర  గమనిస్తున్నాను. నువ్వు  నీ మనస్సును నా విషయంలో  అనాచ్చాధితంగా ఉంచుకో, అంతే నేను కోరేది. 
    అంటే  నీ భావం ఏమిటి బావా? 
   ఏమీలేదు నేను   నీకన్న  పన్నెండేడుల పెద్దవాడిని. ముసలివాడిని. నువ్వు చిన్న పిల్లవు. నీ ఆశయాలు వేరు, నా ఆశయాలు వేరు.  నేను అన్ని  తలదెబ్బలూ తిని, బొప్పెలు కట్టిన  శిరస్సుకు  తలటోపీ అలంకరించుకొంటున్నాను. నువ్వు ఇప్పుడే విరిసిన  హిమాలయపుష్పంలా ఉన్నావు. అందుచేత  నువ్వు  తలిదండ్రుల కోర్కె పరిపాలించాలని  ఆలోచించిగాని: బావ  దుఃఖానికి  ఉపశమనం కలుగచేద్దామని అనుకొనికాని, దేవీ స్వరూపిణియైన అక్క  ఆత్మకు నివేదన  ఇద్దామనిగాని ఆలోచనలతో తొందర పడవద్దు, అని  ఆత్మపూర్వకంగా  నిన్ను  కోరుకుంటున్నాను.
    మీరంతా కలసి,  ఈ  కుట్ర పన్నడం ఎందుకూ? ఆ తర్వాత ఆ కుట్రంటే లెక్కచేయకు అని  నాకు ధైర్యం  చెప్పడం  ఎందుకు? ఈ విచిత్రం  ఎక్కడైనా  ఉందయ్యా?    
               

మానవ జీవితాలు ఒకదాని కొకటి సంబంధం లేకుండా ఉంటాయా