పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మా నాన్నా కూడా యేమాత్రమూ రహస్యం తేలనిచ్చేవారుకారు. చీమకాలంత అనుమానమన్నా మా కెవరికీ రాకుండా చూచారు మీరంతా, ఎంత రాతి గుండెలయ్యా మీ అందరివీని!

    రాతిగుండెలో, నేతిగుండెలోగాని, మాకు బ్రహ్మవిద్యే  అయింది  హేమా  ఈ  రహస్యం  దాచడానికి. 
    అసలు  నీ ధైర్యం చెప్పాలి. నేనూ,  మనవాళ్ళూ ఈ ఇల్లు  మీ  ఇల్లనుకోలేదు.  నీ కళామందిరమే   నీ ఇల్లనీ,  నువ్వు ఘోటక బ్రహ్మచారివనీ, నీకు నీ  అనేవాళ్ళున్నా వారికి, నీకూ  సంబంధం సన్నదారం  వంటిదేననీ, మేము అభిప్రాయపడి  వాదించుకొనే  వాళ్ళం!
   త్యాగతి  పకపక నవ్వుతూ  ఈవాళ  ఈ  ఇల్లుమాది  అని ఎల్లా  తెలిసింది నీకు?  అని అడిగాడు.
    మా నాన్నగారు  నాకు రహస్యం  అంతా చెప్పారు. అందమైన  ఆ ఇల్లు  ఎవరిదయ్యా అని ఒకసారి  నీ కళామందిరంలో  నిన్ను  అడిగాను జ్ఞాపకం ఉందా? అప్పుదేమన్నావు నువ్వు? 
    ఏమన్నాను,  మా స్నేహితులదే. అ ఇల్లు ఎప్పుడోకొని  నా కళామందిరానికి కలుపుకుంటాను అన్నాను.
    ఓయి  బావా, ఏమిటి  ఈ  సినిమాకథ అంతా!
    అదే  నీతో చెప్పాలి, రా!  నా చదువుల గదికి.  అమ్మా! హేమకు అన్ని వేపుడుకూరలు  కావాలి. గోంగూర  పచ్చడి మా ఇష్టం.  కందిపొడి  శేరులు  గుటికాయాస్వాహా చేస్తుంది. వంకాయ పచ్చిపులుసు ఉల్లిపాయలతో జుర్రుతుంది. ఇక  నీ  ఇష్టం అమ్మా!
    నాయనా! మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. వంటకాగానే  పిలుస్తాను అని త్యాగతితల్లి   లోనికి వెళ్ళింది. బోయివాడు  త్యాగతి సైకిలు ఎక్కి  మైలాపురం కబురు  చెప్పడానికి వెళ్ళాడు. త్యాగతీ, హేమా  ఆ  చిన్న మేడలో  పైనవున్న  త్యాగతి చదువులగదికి పోయారు.
   మేడమీద  గదులన్నింటిలో  ఆ గదే కొంచెం  పెద్దది. గదిచుట్టూ  గోద్రెజ్ బీరువాలు-కిటికీలు, ద్వారాలు  తప్పించి  తక్కిన  గోడలను కమ్మివేస్తూ-అయిదడుగుల  ఎత్తున  అద్దాల  తలుపులున్న  ఆ బీరువాలు  అలంకరించి ఉన్నాయి.  నేలంతా  బందరు  జాతీయ  కళాశాల  రత్నకంబళ్ళు,  అక్కడక్కడ పరుపులు, పెద్ద అజంతా  దిండ్లు, పైకప్పు నీలం రంగూ, అజంతా  అలంకార  శిల్ప  చిత్రలేఖనమూ,  ఆ బీరువాలపైన  అయిదారు సుఖపద్మాసనమూర్తులైన సరస్వతీ, లక్ష్మీ, బాలాత్రిపురుసుందరీ, శ్వేతతారా, ప్రజ్ఞా పారమిత మొదలగు  దేవీవిగ్రహాలు తిబెత్తువి, నేపాలువి, బర్మావి, బలి, జావా, కాంబోడియా, చీనా, జపానువీ అలంకరించి  ఉన్నాయి. ఎనిమిది  కిటికీలకు, నాలుగు ద్వారాలకు  జపాను, చీనా, జావా  తెరలున్నాయి. ఆ  గదికి  చుట్టి  మూడువైపులా వరండాలున్నాయి.  ఆ  వరండాలో చక్కని  సోఫాలు, సోఫా కుర్చీలు మూడువైపులా ఉన్నాయి. ప్రతి