పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తల్లి శోకంతో వణికిపోయి కూలబడిపోయింది. శకుంతల కొరకు దుఃఖము గాలివాన అయింది.

   ఎన్ని సంవత్సరాలనుండో  అణగిన  ఈ  ముగ్గురి శోకమూ ఈనాడు పాతాళం వీడి  వచ్చిన  పాతాళగంగవలె పైకి  పొంగిపోయింది.  ఏవేవో భావాలన్నీ  ఒక్కసారిగా పూర్వ  పవిత్ర స్మృతివల్ల, చంద్రకాంతివల్ల చంద్రకాంతశిల కరిగినట్లు శోకఝరులయినాయి.
   ఈబాలిక  తన జీవితంలో, శకుంతల  జీవితంలో  ఒకనాడు  భాగం పంచుకొన్నది.  ఆ  చిట్టి  శిశువు  ఈ  రూపాన  ఆ జీవితంలో ఇప్పుడు  పాలు  పంచుకోలేకపోతున్నది. అని త్యాగతి కరిగిపోయినాడు.
   ఇన్నాళ్ళు  దేశాలు తిరిగి, తన జీవితంలో  భాగం  పంచుకోక, ఈనాడు  ఈ విచిత్రంగా  తన బ్రతుకుదారుల ఈ  బావ నడయాడడానికి తన అక్క  లేకపోవడంకదా కారణమని  హేమ  వణికిపోయింది.
   హేమా  శ్రీనాథు లట్లు  ఒకరికడ  ఒకరు  నిలుచుండినప్పుడు మొదటిసారి చూచిన  శ్రీనాథుని తల్లికి, కొడుకు కోడలు  అలాగే  నిలుచుండి  వేళాకోళాలు చేసుకున్న వెనకటిరోజులు  ఒక్కసారిగా  స్పష్టమై, కూలిపోయిందామె. అందులో  హేమ  అచ్చంగా శకుంతల  పోలికే.                                                                                                                           
           
               
                                                                                                                     4
   శ్రీనాథమూర్తి కన్నీరు  తుడుచుకొని     హేమా!  ఈరోజు మా ఇంట్లో  భోజనం చెయ్యాలి. నీవు  మా అమ్మవంట  ఎప్పుడూ చూళ్ళేదు. ఇంటికిపోయి  చెప్పిరమ్మని మా బోయివాని కబురంపుతా;  నీతో ఎన్నో విషయాలు  మాట్లాడాలి. తర్వాత  నిన్ను  మీ ఇంటిదగ్గిర దిగబెడతానులే!  మీ ఇంటిదగ్గర  ఈ  విషయాలన్నీ మాట్లాడడానికి  తీరదు.  అందరి స్నేహితులను  చిన్నబుచ్చలేము అని  సవినయంగా  చెప్పాడు.

బావా! అత్తయ్యగారు ఎన్నాళ్ళనుంచి ఉన్నారు ఈ ఊళ్ళో?

    నేను  నీకు  అడయారులో  కనబడిన  రెండు నెలలకు  ఈ నగరం  అంతా  గాలించి, చిన్నదైనా, ఈ  అందమైన మేడ కొనుక్కున్నాను. కొని దానిలోకి  కావలసిన  వస్తువులు చేయించుకుంటూ  నెల రోజులున్నాను. ఆ తర్వాతే  మా అమ్మను  తీసుకొని వచ్చాను. 
    కాబట్టి  మీ అమ్మగారు  ఈ  పదినెలలనుంచీ చెన్నపట్నంలో ఉంటున్నారన్నమాట.
   అవును!
   ఎంతవాడవు బావా  నీవు! అత్తయ్యగారు మా ఇంటికివచ్చి మా ఇంటిలో  రెండు మూడు  రోజులు  ఉండడము  మా ఇంటిదగ్గర  నుంచేనన్నమాట? 
    అవును? 
    మా ఇంటి దగ్గర  అత్తగారున్నప్పుడు నీవు వచ్చి  వారిని  పలకరించకుండా ఉండేవాడవు.  వారు నిన్ను  పలకరించకుండా  ఉండేవారు.  మా అమ్మా,