పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా చరిత్ర అంతా ఒక పుస్తకంగా రాశానండీ. అది హేమకు చదవమని అందచేశాను.

   అమ్మయ్యో! ఇప్పటికైనా రహస్యం   బయలుపరచావయ్యా! ఏడాది  ఈ నాటకం నడిపావు. నీ దోషాన్ని మేమూ పాలుపంచుకున్నాము. ఇంకేముంది? మా హేమకు ఏమని  జవాబు చెప్పను? నన్ను దూది  ఏకేస్తుందయ్యా  నాయనా!
    నేను  ఏం  చెయ్యాలో  నిర్ణయించుకొనే,  ఆ పుస్తకం ఆమెకు పంపించా మామయ్యగారూ!  హేమ నాకోసంగాని ఏదైనా  వంకతోగాని మా యింటికి  వచ్చేటంతవరకూ, మీ యింటికి రాను.
    ఏమిటీ జర్మనీయుద్దం?
    నేను  హేమ హృదయంలోని  అభిప్రాయాలతో మహాయుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇంతవరకూ  హేమదే విజయం! అందుకని  ఈ  ఎత్తు ఎత్తాను. దీని పర్యవసానం ఏమవుతుందో?
    ఇందులో  మాత్రం  మా హేమ  నెగ్గకుండా ఉంటుందా?
    అదే నేనూ  అనుకుంటున్నానండీ.
    అయితే  ఈలాంటి పని ఎందుకు  చేశావు బాబూ?
    ఇవన్నీ  చివర  విజయానికి మేట్లేనండీ!
    ఏమో మూర్తీ! మీ  అందరి  హృదయాలు  నాబోటి  వాళ్ళకు  అగమ్యగోచరం!
    మీరు  మీ కాలంలో  మీ తాతగారి  ఎత్తులకన్న కొత్త ఎత్తులు  వేయలేదా?
    ఎత్తులంటే జ్ఞాపకం వచ్చింది. ఈనాటి  చదరంగం ఆటవేరు, మా రోజుల్లో ఆటవేరు.
    మీ  ఆటకన్న  ఇంకో  రకంగా  మీ తాతగారి ఆట  ఉండేదేమోనండి.
    సరే మూర్తీ! నీవు యుద్దయాత్రకై ప్రవేశించిన దేశం నీకే  తెలియాలి. కాని హేమ  హృదయానికి  బాధ  మాత్రం  కలిగించకు తండ్రీ!
    మామయ్యగారూ! నేను  ఆమె  హృదయంలో  చింతాకు కదలినంత బాధైనా కలిగించను. కాని ఆమే  తనంత తాను బాధ కల్పించుకొంటోంది. అది ఒక రోజున  ఆమెకు  చాలా కష్టం  కలిగించే  పరిస్థితులవరకూ తెస్తుంది.
    ఏమిటది మూర్తీ! నీవేమీ  ఆ  విషయంలో చేయలేవా ?  ఆమె కొంచెం బాధపడినా నాపని  హుళక్కయిపోతుంది బాబూ!
    మీరేమీ  గడబిడ  పడకండి;  నేను  నా సాయశక్తులా హేమపై  ఈగవాలనివ్వను.
    అంతా  నీదే  భారం మూర్తీ! అన్నీ  నీమీదే పెట్టుకొని  ఉన్నాను. అమ్మ  ఏంచేస్తోంది ?