పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమను చూడగానే. ఇంత విచిత్రమైన పోలిక వచ్చిందేమిటి? కవలపిల్లలలోనన్నా పోలికలు కొంచం తేడా వుండవచ్చును. మెరుములా నాకు హేమ కనబడిన పదిక్షణాల్లో నా గుండె చలనం ఆగిపోయింది! కైలాసేశ్వరుడు ఈ పోలిక హేమ కెందుకిచ్చాడు? ఇంత విచిత్రమైన పోలిక ఎలా సంభవమైంది? అదే నడక! ఆ చూపులే! మళ్ళీ నాదేవి ప్రత్యక్షం అయింది అనుకున్నా! నేను నమ్మలేదు. నా ఊపిరే ఆగిపోయింది. భ్రమ అనుకున్నా! లోకమే తిరిగిపోయింది....ఆ వెంటనే అత్తగారు, మామగారూ, ఋషి దంపతుల వంటివారు ఈ మాటలేమిటి?

   నా గుండెలో నా కుడిచేయి  నా శకుంతల  బొమ్మపై వేసి, ఒక  నిమేషం కళ్ళు మూసుకున్నా!  మాటియ్యండి. నేనే హేమను, హేమే నేను! మీ కోసం హేమలో  ఎదురుచూస్తూ ఉన్నాను. ప్రాణమూర్తీ! అమ్మకూ, నాన్నకూ  మాట ఇవ్వండి అని నా హృదయంలో మాటలు  మారుమ్రోగినట్లయినది.  
    అత్తయ్యా! ఈవిషయం నేనెప్పుడూ అనుకోలేదు. నా కసలు  మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న  భావం  ఎప్పుడూ కలగలేదు. కాని  మీ ఆజ్ఞ పాలించడంకన్న నాకు ఉత్తమమైన  కార్యం ఇంకోటిలేదు.
   అత్త : నా తండ్రీ! నాకు ప్రాణం లేచివస్తోంది. నా తల్లి  తిరిగి  బ్రతికి వచ్చినట్లే  అవుతున్నది. మళ్ళీ  నువ్వు  మమ్ము విడిచి  ఎక్కడకూ వెళ్ళకు తండ్రీ. మీ అమ్మగారిని  ఎలా  క్షేత్రాలు తిప్పావో అల్లాగే  మమ్మల్నీ తిప్పుగాని,  మా  ఇద్దరినీ నువ్వు  వదలనని  మాట  ఇవ్వు మూర్తీ!
   మామ : నాయనా! మీ  అత్తగారి  మాటలన్నీ వేదవాక్యాలు. నీ కోసం  ఈ  తొమ్మిదేళ్ళూ  యెక్కువ కుమిలిపోయింది!
   నేను : మామయ్యగారూ! నేను ఇక  మీ ఇద్దర్నీ వదలి  వెళ్ళనండీ. ఈ ఊరే వచ్చి  మా అమ్మా, నేనూ కాపురం  పెడతాం. ఒకటి మాత్రం  నాకు తోస్తోంది. నేను ఫలానా అని హేమకు తెలియనీయకండి. అలాంటి  ఆలోచన ఎందుకో  నాకు ఘట్టిగా తట్టింది. ఎవరో  చుట్టం  అని చెప్పండి. ఏ  అడయారులోనో, ఏ  సందర్భంలోనో  నాకూ, ఆమెకూ పరిచయం కలుగజేయండి. ఇప్పుడు వద్దు.
   మామ : అదీ బాగానే వుంది. పెళ్ళంటే  దాని ఆలోచనలు  విపరీతంగా  ఉన్నాయి.
   అత్త : పెళ్ళే చేసుకోనంటుంది. అదేమాట  చిన్నతనాన్నుంఛీ! పెళ్లి అంటే  ఏడ్చేది  అతికోపంతో  గుడ్డలు  చింపుకునేది. నేనూ, మీ మామగారూ  భయపడి  దాని దగ్గర  పెళ్ళిమాటే తల పెట్టడం  మానివేశాము.
   నేను : అందుకనే....ఆమె....నన్ను....పెళ్లి చేసుకునేటట్లు  నేను చేసుకోవాలికదా!........ చదువుకున్న పిల్ల! వాళ్ళకు  విచిత్రమైన  ఆలోచనలు ఉంటాయి.        మా  మామగారూ, అత్తగారూ కొంచెంసేపు  మౌనం వహించారు. మా అత్తగారు  కన్నీరు కారుస్తూనే ఉంది. కన్నీళ్ళు  తుడుచుకుంటూ,