పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిద్దరినీ ఎలా చూడగలనని ఒక భయం, అక్కడ నా శకుంతల కనబడుతుందేమో అన్న ఏదో మతిలేని ఆశా నన్ను కారు ఎక్కుతుండగా వణికించి వేశాయి. నా హృదయం దగ్గర ఎప్పుడూ బంగారు గొలుసున వేలాడే శకుంతల బొమ్మ పైకితీసి కళ్ళకద్దుకొని, కారులో కూర్చుని, పొమ్మని కారు అతనికి చెప్పాను.

                                                                                                               20
   తిన్నగా  మా కారు వెళ్ళివెళ్ళి  ఆళ్వారు పేట  నాలుగు  వీధుల  మొగనుంచి పిఠాపురం డేన్మోరు  భవనానికి  ఇవతల  కొత్తగా కట్టిన  ఒక చక్కని మేడ  దగ్గర ఆగింది. అప్పుడే  ఆ  మేడముందర ఉన్న  పోర్టికోలో నిలిచి వున్న కారు ఎక్కడానికి లోపలినుండి నా శకుంతల  ఒక అమ్మాయితో  కలిసి వస్తూన్నది.
   శకుంతల! శకుంతల! నా తల  తిరిగి  నా కళ్ళు  బైరువులు కమ్మి  ఒక్క నిమేషం మైమరపు  కలిగింది. శకుంతల  బ్రతికివుందా! నిజమా! ఆ  అమ్మాయి  లిద్దరూ నా కారువైపు  చూచి, తమ కారెక్కినారు. ఆ  కారు వెంటనే సాగి పోర్చి ముందరున్న  ఎడమ మార్గంలోనుంచి పోయి  చుట్టూ వున్న  తోటదాటి  గుమ్మందాటి వెళ్ళిపోయింది. నాకు భరింపరాని దుఃఖం  వచ్చి, కంటనీరు జలజలా ప్రవహించిపోయింది. నేను గుండె  దిటవు పరచుకొని, నన్నూ, లోకమునూ వీడి వెళ్ళిపోయిన శకుంతలాదేవి  మళ్ళీ ఎలా  వస్తుందనీ, ఆ బాలిక  నా మరదలయి వుంటుందనీ నిశ్చయం చేసుకున్నాను. కారు ముందుకు  జరిగి, వెళ్ళిపోయిన  కారు  స్థలంలోకి  వచ్చి ఆగింది.
   మొగం జేబురుమాలుతో బాగా  తుడుచుకొని, కండువా సర్దుకొని, మా కారు డ్రైవరు తలుపు  తలుపు తీయగా, కారులోంచి దిగి, మెట్లెక్కి, హాలులోనికి అడుగిడి, అక్కడ  వున్న  సోఫాలో కూర్చున్నాను. ఇంతటిలోకే ఒక  బోయీ, హాలులోకి వచ్చి, స్వామీ! ఎవరికోసం దయచేసినారయ్యా?  అని నన్ను  ప్రశ్నించాడు.
    వినయకరావుగారున్నారా? 
    చిత్తమయ్యా! 
    స్నేహితులొకరు గుంటూరు జిల్లానుంచి వచ్చారని చెప్పు. 
    చిత్తం అని అతడు లోనికిపోయి  చెప్పినాడు కాబోలు. వెంటనే ఆయన  ఒక కఱ్ఱచేత  ఆనుకుంటూ నడిచి వచ్చారు. ఆయన  ఎంతో  చిక్కారు. కళ్ళు  లోతుకుపోయాయి. ఆ  విఘ్నేశ్వరత్వమే లేదు.  బుగ్గలు వేలాడుతున్నాయి. మొగంలో  దుఃఖ రేఖలు  స్థిరత్వం తాల్చాయి.
   నేను లేచి  నుంచొని వారి  పాదాలకు నమస్కరించాను. ఆయన  నావైపు తేరిపార చూస్తూ  కూచోండి బాబూ! మీ  పేరు? మిమ్మల్ని ఎక్కడనో  చూచినట్లే ఉంది. పెద్దవాణ్ణయ్యాను  జ్ఞాపకశక్తి తగ్గిపోయిందండీ. 
    నన్ను  ఎక్కడ  చూచినట్లున్నారు?