పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ రాత్రి ఓడపై తట్టుమీద అడ్డకడ్డీల నానుకొని ఆశ్వయుజ శరత్కాలపు వెన్నెల కెరటాలను, దూరాలను ముత్యాలకాంతిలో తేల్చి ఆడిస్తుండగా నా చరిత్ర అంతా తలుచుకుంటూ నిలుచున్నాను. ఎంతకాలం నా శకుంతలను వదలి నేను ఈలా శిల్పమనీ, చిత్రమనీ కాలక్షేపంచేస్తూ ఉండను? ఈ జీవితం వృథా అనిపిస్తుంది. రష్యాలో, ఆ కార్మిక కర్షక మహారాజ్యంలో కూడా ప్రేమలేని బ్రతుకు ఎవరు బ్రతుకుతున్నారు? కర్మకు ఎంత పవిత్రత వారు ఆపాదించుకుంటుంన్నారో, ప్రేమకూ అంత పవిత్రతే ఉందనుకుంటారు. సన్యాసులు ఏ మంత్రంబలం చేత స్త్రీ స్నేహం లేకుండా ఉండగలరో! పశుధర్మమైన స్త్రీ సంపర్కం వేరు, పవిత్ర ధర్మమైన ప్రేమవేరు. ఏనాడు నా శకుంతల నా జన్మకు స్థాయీభావం అయిందో, ఆనాడే నా బ్రతుకూ సాత్ధకమయింది. నేడా స్థాయిలేని ఈ జీవితం నా కెందుకు? ఆమెను మరచిపోయేందుకు ఎంతదూరం పరుగెత్తగలను? ఈలోకంవీడి ఇంకో నక్షత్ర కుటుంబంలోని గ్రహానికి పారిపోతే నా శకుంతలను విడిపోయిన నా దుఃఖం నన్ను వదులుతుందా? శిల్పమూ, చిత్రలేఖనమూ మత్తు మందులే అవుతున్నాయి. స్వామీజీ సన్నిధిని నాకు కొంత ఉపశమనం కలిగేమాట నిజమయినా, ఆ తర్వాత ఒంటిగా ఉన్నప్పుడు నా దేవి నాకు మరింత స్పష్టంగా ప్రత్యక్షం అవుతుంది.

   కొలంబో చేరి  సింహాళం అంతా తిరిగాను.  అనూరాధపురంలో, సిగిరియాలో, కాండీలో  నాకేమీ  ఉపశమనం  కలుగుతుంది. ఈ  శిల్పయాత్ర  నా  ఆవేదన  మరింత  ఎక్కువ  చేసింది. మనుష్యుని  సర్వజీవిత  రసజ్ఞత్వంలోంచి ఉద్భవించిన మహాసౌందర్యం  నా శకుంతల  సౌందర్యానికీ   ఎలా సరిపోతుంది  అనుకున్నాను. ఎందుకీ అంతులేని  యాత్ర? 
                                                      ఎంతకాలం  నేను  తిరిగేదీ
                                                      ఓ  దివ్యమూర్తీ
                                                      అంతమే  నా  యాత్ర  మాన్పేనా?
                                                      శిల్పమంతా నిండి ఉన్నది
                                                      చిత్రలేఖన నిండి  ఉన్నది
                                                       నీవులేని బ్రతుకు  ఆవల
                                                       భావి  ఎందుకు? కళల తపనేలా?
                                                       ఓ  దివ్యమూర్తీ
                                                       నన్ను   విడిచి  నేను  పరుగేలా?
   
           
                                                                                                               18
   ఎక్కడికి  వెళ్ళినా, ఎక్కడ తిరిగినా  నా గురుదేవుడైన  కైలాసానంద మహర్షి  దగ్గరకు నేను  చేరవలసిందే. నాకు ఇరవై  తొమ్మిదవ  ఏడు  వచ్చింది. ఎన్నో  బొమ్మలు వేస్తున్నాను, ఎన్నో శిల్పాలు  రచిస్తున్నాను. మరి మనశ్శాంతిలేదు. నా  శకుంతల  నా పక్కన  ఉండి  నేనీ  అఖండ  శిల్పయాత్ర  చేస్తూ,