పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మలయా, జావా, బోర్నియో, సుమత్రాలన్నీ మలయద్వీపలుగా పరిగణింపబడేవి. ఇండోచీనా కూడా మలయ ద్వీపమనే పూర్వనామం. ఈ దేశంలోకి భారతీయులు వచ్చేసరికి,అనాగరులైన మంగోలియనుజాతి అన్నాములను, చీనానుండి రాజ్యం పేరను వచ్చిన దక్షిణ చీనావారును ఈ దేశం అంతా నిండి ఉండేవారు. భారతదేశ తూర్పుతీరస్థులైన కళింగ, చాళుక్యాంధ్రులు అంతకుముందు శాతవాహనకాల, తదనంతరకాల ఆంధ్రులను ఇండోచీనా తీరంచుట్టి చీనాదేశం ఓడ వర్తకానికి వెడుతూ ఈ దేశంలో కొన్ని ప్త్రదేసాలు తమ మకాములుగా చేసుకున్నారు.

   ప్రథమాంధ్రులు  ఈ  దేశవాసులకు  క్ష్మేరులు అని పేరు  పెట్టి  రాజ్యస్థాపనం చేశారు. వీరు  విష్ణుకుండిన వంశీకులై ఉండవచ్చును.  ఈ  రాజ్య వంశీకులు క్ష్మేర  రాజ్య  కన్యల వివాహమాడి, తమతోవచ్చిన క్షత్రియులనట్లే చేయించారు. వీరితో బ్రాహ్మణులు వలస వచ్చారు. రాజులలో  శ్రుతవర్మ యశోవర్మలు  ప్రఖ్యాతి గాంచారు. సముద్ర  మధ్యదేశమని   మన  పూర్వీకులు  తలవడంచేత  దీనికి కంబుజ లేక  కాంభోజ దేశం  అని  పేరు పెట్టారు. ఈ  కుటుంబాలు  రెండై, రెండు రాజ్యాలు స్థాపించాయి. ఆ  నూతన  ద్వితీయ రాజ్యం  పేరు  చంప.
   తోస్లే సావ్, తోయధి  అనదగిన మహాసరస్సు. ఈ  ఆంధ్ర వంశీకులే ఇప్పటికీ ఫ్రెంచివారికి  మాండలీకులై  ఈ  రాజ్యాన్ని  రాజ్యం  చేస్తున్నారు. వీరి  ఆచారాలు  తెలుగువారి ఆచారాలే. నొంఫే పట్టణం  ఇప్పటి రాజధాని.  ఆనాడు అంగకరరాజులు (కవచథరులు) వారి స్థానం  అంగకరవాసమనీ,  అంగకరణామమనీ  రెండుగా  ఆ  మహాపట్టణం  విభజించారు. బ్రాహ్మణులలో ప్రసిద్ధిగాంచినవాడు కంబుజుడను బ్రాహ్మణుడట.  అతడే  ఈ  రాజ్యము  క్రీస్తు వెనుక  అయిదవ శతాబ్దిలో స్థాపించాడు. తర్వాత  దివాకరుడను బ్రాహ్మణుడు పదవ  శతాబ్దంలో  ఈ  రాజ్యం  రెండుగా  చీలినప్పుడు మళ్ళీ  కలపడానికి  కారకుడయ్యాడు.
   ఇప్పుడు అంగరధామంలో  జయవర్మ  క్రీ.శ. 900 లో  కట్టించిన గుళ్ళు  చాలా  కనబడుతాయి.  ఈ  గుడులచుట్టూ ప్రాకారం  నాలుగుమైళ్ళ పొడుగు  వుంటుంది.  గోడ ఎత్తు ముప్పది  అడుగులు  వుంటుంది. ఇక్కడే  మహారాజ మందిర చిహ్నాలు  కూడా  కనబడతాయి.  ఈ  ప్రాకారానికి  చుట్టూ అయిదు గోపురాలున్నాయి. ఈ  గుళ్ళలో కాంభోజ దేశస్థాపకుడైన కంబుజ బ్రహ్మణునియందు  భక్తిని  తెలపడానికి  నిర్మించిన   బయాంలేక  బ్రహ్మగుడి ముఖ్యమైనది. బ్రహ్మ నాలుగు తలలు చెక్కిన  యాభై శిఖరాలీ గుడి  ఆవరణంతా నిండి వున్నాయి. లోపల బ్రహ్మ విగ్రహం  వుండేది. తర్వాత  బుద్ధవిగ్రహం పెట్టినారు. ఈ  గుళ్ళలో అలంకారశిల్పం  అత్యంత శ్రుతి స్వరూపమై, శక్తివంతమై ప్రత్యక్షం  అవుతుంది.  రామాయణ గాథలు, నాట్యస్త్రీలు , ఈ  గుళ్ళల్లో, మండపాలలో  నిండి వున్నాయి.