పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాలుగా కొన్ని, రంగులు పులుముడులుగా కొన్ని, రూపం తేలని మూర్తులు, భావం తేలని కలయికలు, స్పుటత్వం తాల్చని కుంచెసారింవులైపోయినవి.

   నేను  స్వామీజీ   దగ్గరకుపోయి,  స్వామీజీ! నాలోవున్న  కళ నాశనం  అవుతున్నదా?  అని అడిగాను.
    ఓయి శిల్పి! నీలో  సగం లోటుగా ఉంది. నువ్వు  పాశ్చాత్యకళలు  దర్శించావు. విల్హె ల్మినా, సుశీలతో చేసిన  స్నేహచరిత్ర రహస్యం  కొంచెం  నాతో చెప్పావు. నీలో లోటయిన ఆ సగమేమిటో నువ్వు  గ్రహించలేకపోయావా?  నీ యూరపు  యాత్రలలో, ఏదో  వాంఛ  నిన్ను  వెంబడిస్తూన్నట్లు భావించాను అని  నాతో చెప్పావు.  అంగకరువాటులోని నాట్యస్త్రీ శిల్పం  దగ్గర  కన్నులు నీరు  తిరిగినవి అన్నావు. పాలం పేట నృత్యమూర్తి దగ్గర  ఏదో మహత్తరమైన  బాధ అనుభవించానన్నావు. శ్రీనాథమూర్తీ! నీ పరీక్షా  సమయం  ఇంకా  దాటలేదోయి, నువ్వు నీ అర్ధభాగాన్ని  వెదికి  వెదికి  ప్రత్యక్షం  చేసుకో! ఆ  తపస్సుతో, ఆ  దర్శనంతో  నీకు సిద్ది  సంభవిస్తుంది అని స్వామీజీ  నాకు   ఉపదేశించారు. ఆయన  మాటలు  నాకేమీ అర్థంకాలేదు.                                                                                                                           
           
               
                                                                                                                   17
   నా శకుంతల  నన్ను వీడి ఏడు  సంవత్సరాలైంది.  ఆమె  నేను దర్శించిన  ప్రతి ఉత్తమ  శిల్పంలోనూ  నాకు  ప్రత్యక్షమయ్యేది. పాశ్చాత్య శిల్పాలలో  ఆమె విలాసాలు  చూచాను.  1938 ఏప్రిల్ లో  బయలుదేరి  చీనా, జపాను దేశాలు దర్శించినప్పుడు, జపాను శిల్పవిన్యాసంలో  హృదయమూ, చీనా  శిల్పాలలో  ఆమె  యోగమూ ప్రత్యక్షముయ్యాయి.  భారతీయ శిల్పంలో నా  శకుంతలాదేవి దివ్యత్వమే  నా  బ్రతుకును  పవిత్రం  చేస్తూ  ఎదుట  గోచరించినది.
   చీనా, జపాను దేశాలు తిరిగి తిరిగి  మళ్ళీ  వస్తూంటే  నాకు  అంగకరువాటు శిల్పమూ, బోరోబదూరు శిల్పమూ  తిరిగి  దర్శించాలని  కోర్కె కలిగింది. అంగరువాటు  ప్రయాణం  అంతా నా మనోవేధిలో  ప్రత్యక్షం  అయింది. అంగకరువాటులో,  అంగకరు థాములో పదిహేను రోజులు మకాము చేసి  ఆ  శిల్పమూ, ఆ గుడుల అందమూ  అన్నీ  గమనించాను.  ఈ  శిథిలాలయాలున్న  ప్రదేశమంతా, ఒకనాడు మహాపట్టణం.  కాంబోడియా లేక  కాంభోజ దేశానికి  ఇది  రాజధానిగా  ఉండేది.  తమ సంస్కృతిని పరదేశాలలో ప్రజ్వలింపచేసి, అనాగరికమై, రాక్షసమై వున్న  ఆ  దేశాలను నాగరికతతో  నింపిన  పూర్వ  భారతీయులు మహోత్తములుకదా!
   ఎక్కడ మలయా ద్వీపము! ఎక్కడి భారతదేశం!  ఆస్ట్రేలియా, అమెరికాలను నెగ్గి, అక్కడ రాజ్యాలు నెలకొల్పడానికి  పాశ్చాత్యులు ఎంతో కష్టపడ్డారు. కాని భారతీయులు ప్రజలను తమవారిగా చేసుకొని, వారితో  సంబంధబాంధవ్యాలను నెరపుతూ  నూతనరాజ్యాలు నెలకొల్పారు.