పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంధాన్ని గజనీ మొహమ్మదు చాలా గౌరవించి, తగిన పారితోషికమిస్తానని అన్నాడు. కాని గజనీస్తులాను అరవై వేల వెండి నాణేలు మాత్రం పంపాడట. అరవై వేల బంగారు దినారాలు వస్తాయని పిరదౌసీ ఆశించాడు. దానితో ఈ డెబ్బది ఏండ్ల ముసలి కవికి కోపంవచ్చి ఆ నాణేలు తన సేవకులకు పంచి తాను దేశం వదలి పారిపోయాడు.


మొదట తన్ను  గజనీ మొహమ్మదు తన  రాజసభా  కవిరత్నాలలో  ఒకణ్ణిగా తీసుకున్నప్పుడు  పిరదౌసీ  ఆ  సుల్తాన్ పై  ఆత్యద్భుతమైన పద్యాలల్లాడు.  నేడు కోపంలో  ఆ భాగం అంతా  షానామా  నుంచి  తీసివేశాడు. పైగా గజనీని  హేళనచేస్తూ భయంకర  హాస్యకావ్యం ఒకటి  రచించాడు. పదేళ్ళు  నిలువనీడలేక తిరిగి చివరకు  లూబరిస్తాను సుల్తాను సభాకవిగా అతడు చేరాడు. ' యూసుఫ్ జులైఖా' అనే  కావ్యం  రచించి   ఆ  సుల్తానుకు  అంకితం  చేశాడు. తన  ప్రాణం  టస్ నగరంచేరి అక్కడ  దుఃఖంతో ప్రాణాలు  విడిచాడు.
   అక్కడ గజనీమొహమ్మదు  పారిపోయినప్పటినుంచీ  కించపడి తన మంత్రిన్నీ, పిరదౌసీ ప్రాణస్నేహితుడూ  అయిన  ఆల్ మియమాందీ సలహా  పాటించి  తనకడనుండి  పారిపోయిన  ఇరవై  ఏళ్ళకు  అరవై వేల  బంగారు  దీనారాలు  ఒంటెలపై  ఎక్కించి ససైన్యంగా  పంపించాడు.  ఆ  సమయంలోనే పిరదౌసీ  శవాన్ని  తీసుకుపోతున్నారు. పిరదౌసీని  అతని  తోటలోనే  సమాధిచేశారు. షియా అవడంవల్ల  సాధారణ  ముస్లిం సమాధి స్థలంలో  కొందరు  మతకర్తలు అడ్డం  పెట్టారట.
   ఎక్కడ ఉన్నదీ మహాకవి గోరీ? నగరం  అంతా  హంపీ శిథిలాలకన్న పాడైన స్థితిలో  వున్నది. అక్కడ కొందరు  ఇది అని నగరపు  గోడల దగ్గర  ఒక స్థలం  చూపించారు. ఆ  ప్రదేశమేనని జనశ్రుతివస్తూ  వుంది. ఓ  మహాకవీ! నీ  కవిత్వమే ఆకాశాన్ని  అంటే దివ్యభవనం నీకు  నీ  దేశస్థులే ఒక భవనం కట్టలేకపోయారా? నువ్వు  సర్వదేశాలకు వినిపించిన  ఉత్తమ  కావ్యం  మసక  మసకలాడక దెసలన్నీ నింపే కాంతై వెలుగుతూ వుంది. ఆ  సాయంకాలం  ఆ  శిధిలాలలో  కూరుచుండి పిరదౌసీకి  నా  హృదయాంజలి అర్పించాను.
                                                                                                                16
   1935 డిశంబరు  నెలాఖరుకు  ఈజిప్టు చేరాను. పిరమిడ్లు, తీబ్సు, కొనారక, మొపిస్ పట్టణాలలో ఉన్న ప్రాచీన ఈజిప్టుదేశ  సంస్కృతి  దర్శించి, 1936 జనవరిలో  గ్రీసుదేశం  చేరాను. ఏథెన్సు, స్పార్టా, ఒలింపను, కారిస్తు, డెల్ఫీ మొదలయిన  ప్రదేశాలు చూచి ఇస్తంబోలు పట్టణం చూచాను. అక్కడ నుంచి బెల్ గ్రేడ్, సోఫియా  పట్టణాలు  చూచి, ఇటలీ చేరుకున్నాను. ఇటలీలో  రోము, వెనీసు, ప్లారిన్సు, నేపిల్సు మొదలయిన  శిల్పక్షేత్రాలు దర్శించి ఉత్తరాఫ్రికా మొరాకో  1936 మార్చిలో చేరాను. ఫెజ్, ట్యూనిస్, సహారాలో  చాలా కొద్ది భాగం చూచుకొని,  అక్కడ నుండి