పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నస్పేనియన్ రాజు ఒకడు ఈ నగరాన్ని నిర్మించాడు. నవషిపూరు నిషాపూరు అయింది. క్రీస్తుశకం1038లో పెల్ జుకీ వంశీకుడు టుగ్రిల్ బేగ్ ఈ నగరం రాజధానిగా చేసుకొని రాజ్యం స్థాపించాడు. టుగ్రిల్ బేగ్ షా అన్న మనుమడు మాలిక్ షా కాలంలో నిషాపూరులో ముగ్గురు సహాధ్యాయులు మిత్రులు ఉండేవారు. వారే మహాకవి ఒమారూ, మహామంత్రి నైజామ్. ఆలీ-ముల్కో, హషీషిన్ జట్టు(స్వర్గం చూపిస్తానని కోటీశ్వరులకు చక్కని బాలికలున్న భూతలస్వర్గం చూపి వారి ఆస్తి లాగి చంపేవారు). నాయకుడు హిసారు ఇ-సభాహయన్ను. ఈ ముగ్గురిలో ఎవరు జీవితంలో ముందుగా అభివృద్ధిలోకి వస్తారో, అతడు తక్కినవారికి సహాయం చేయాలని వారు మువ్వురూ రక్తశపథాలు తీసుకున్నారట. ఆ శపథాలు నిలుపుకున్నారు.

   ఒమారు చనిపోయిన  కొన్ని సంవత్సరాలకు  ఈ  పట్టణాన్ని మొగలులు  పూర్తిగా  దోచి నాశనం చేశారు. ఆ  తర్వాత  పునరుద్ధరింపబడి మళ్ళీ వృద్ధిపొందిందీ నగరం. ఆయనా భూకంపాలు, టర్కోమానుల  దోపిళ్ళు  ఈ తోటల  నగరాన్ని  రూపుమార్చి నేటి బీద నగరాన్ని  లోక స్మృతిపథానికి అర్పిస్తున్నవి. ఈనాటి  ఇరుకు  సందులు, దుమ్ము బజారులతో నిండిన  ఈ  నిశాపురం, ఆనాటి ఒమారు  నగరానికి  స్మృతిచిహ్నం మాత్రం.    
   ఒమారు ' రుబియాట్ ' గ్రంథం చక్కని  బొమ్మలున్నది   నా   దగ్గర  ఉంది. అందులో  ఒమారు గోరీ తోటలోని  గులాబీపూవుల రేకులు  కొన్ని  ఉంచాను, ఒక చక్కని  శిల్పరూపమున  మృణ్మయకలశము చిన్న ప్రార్థన రత్నకంబళి ఒకటీ, ఇంకను  కొన్ని  వస్తువులు, ఆ  ప్రదేశంలో  దొరికిన  పూర్వనాణేలు కొన్ని సంపాదించి, వెంటనే   పరిషియను  ముస్లిములకు పవిత్రమైన మాషాద్ పురం చేరుకున్నాను.
       ఏది ఒమారు తిరిగిన  సారాయి  దుకాణం? ఏ  తోటలో  తిరిగినాడు? వెలుగు కిరణాలు పడిన  సుల్తానుగారి భవనగోపురంఏది? ఎక్కడ ఒమారు? అని ఆలోచించుకుంటూ నాలుగు  గుఱ్ఱాల ప్రయాణపు బగ్గీమీద మాషాద్  చేరుకున్నాను. దారిలో హసనాబాద్  చూచి  అబ్బాద్ షా  గోరీ  చూచాను.
   ఇరాన్ లో  షియా ముస్లింలకు మాషాద్  అత్యంత  ముఖ్యమయిన పవిత్రప్రదేశం. ఇక్కడ వారి  ఎనిమిదవ  ఇమామ్ రిజాగారి దర్గా ఉన్నది. దీనిని వీరు మక్కాతో  సమంగా చూస్తారు. నజాఆలీ  నగరంలోని  దర్గా, కల్బరాలోని  హుసైన్ దర్గా కూడా వీరికి పవిత్ర ప్రదేశాలు. రిజాఇమాం మొహమ్మదువారి తర్వాత  ఎనిమిదవ  ఇమాం. ఈయన కుహార్  ఆరోన్ రషీద్  ఖాలిఫ్ గారి కూతుర్ని యిచ్చి వివాహంచేసి  గౌరవించారు. ఆలీ - రషీద్ కుమారుడు మామాన్ గారు  రిజగార్కి  విషం ఇచ్చి చంపించి  వేశారు. ఖాలిఫ్  హరోనుగారి  గోరీ, రిజాగారి  గోరీ  దగ్గరే  ఉంది.