పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నన్నూ ఏ ఉత్తమ కుటుంబ యోషారత్నమయినా ఈ పూట మా యింటికి భోజనానికి రండి అని పిలిచి చక్కగా ఆ తివాసులపై కూర్చుండబెట్టి తీయటి షరబతులను, రోజా పన్నీటిని కలిపి హుక్కా అందిస్తూ, డల్ సిమియరు వాద్యం తీగెల తన రింగారు పొడుగాటి వేళ్ళతో మీటుతూ, దానిమ్మపండు గింజల ఎరుపు పెదవుల కదుపుతూ, బుల్ బుల్ గొంతుకతో పాడుతూ నన్ను ఏ అప్సర లోకమో తీసుకొనిపోవునాఅని ఊహించుకొన్నాను.

   నా  చిత్రలేఖనాలు, బ్రిటీషు అధికారి భవనంలో  ఉన్న  ఒక  అరబ్బీ ఉద్యోగి  చూచి చాలా  ఆనందించాడు. ఆ  అరబ్బీ  ఉద్యోగి  ఆక్సు ఫర్డు విశ్వవిద్యాలయంలో  ఎం. ఏ. పరీక్షలో  కృతార్థుడైనాడు. ఇంగ్లీషు ఆంగ్లేయుల  వలెనే మాట్లాడగలడు. ఆయన  పేరు  ఖాలిద్-ఇబినె ఒమారుగారు. ఆయన  ఇంటికి  నేను ఒక రోజున  తేనీటి విందుకు  అతిథి నయ్యాను. ఆయన  సహోదరి టర్కీదేశ రాజధాని  ఆంకారాలో బి. ఏ. చదువుకొంటుంన్నది. ఆమెకు  టర్కీలో  పరదాలేదు. కాని  బాగ్దాదులో  పరదా ఉన్నది. ఆమె తన  ఇంటిలో చదువుకున్న  వారికడను, నూత్నాచార పరులకడను పరదాపాటించదు. సకల అరబ్బీయ రాజ్యాలు కలిసి  ఒక యుత్తమ సంయుక్తరాజ్యంకావాలని ఆమె వాదన. అమెరికా  సంయుక్త  రాజ్యాలవంటి సంయుక్త  రాజ్యసంస్థ ఉండాలని  ఆమె వాదించింది.  అనేక శాస్త్రవిషయాలలో  ఆమెకున్న  అసమాన జ్ఞానం  నాకు ఆశ్చర్యం  కలిగించింది. ఆమె  చిత్రలేఖనము కూడ  ఆంకారాలో నేర్చుకొనుచున్నదట. తమ  దేశములో  బయల్పడిన  అతి ప్రాచీననాగరికతను గూర్చి  బాగా  చదువుకొన్నది. ఆమెయే సుమేరు. చాల్డియా, అస్సీరియా ఎలామైటు, ఇరానియను సంస్కృతులగూర్చి  నాతో  చాలాకాలం చర్చించింది.
   ఇరాఖ్ లో  దొరికిన  పూర్వ  సంస్కృతిని  పాశ్చాత్యులందరు తమ దేశాలకు తరలించుకొనిపోవుట  కామె ఎంతయో విచారము  వెలిబుచ్చుతూ  తనకే  శక్తియుండిన, పాశ్చాత్యదేశాల  మ్యూజియంలో ఉండిన  శిల్పవస్తు  కోటిని  తిరిగి  తీసుకొనివచ్చి  బాగ్దాదులో ఒక పెద్ద  ప్రదర్శనశాల నిర్మించి అందులో  ప్రదర్శింతుననియు  చెప్పినది. ఆమె  పేరు  అజరా-బిన్-తె ఒమార్. నేను  మీతో  పూర్తిగా  ఏకీభవిస్తానన్నాను.
   అజరా : మీ  దేశంలో  మా  ముస్లిం  స్త్రీలు  ఏ  స్థితిలో  ఉన్నారు?
   నేను : మా దేశంలో  ముస్లిం స్త్రీలు చాలా  వెనుకబడి ఉన్నారు. పరదా  పోలేదు. కొంతమంది  పెద్ద కుటుంబంవారూ, ఉద్యోగులూ పరదాలు తీసివేశారు. ఖోజాలు మాత్రం  చాలా  ముందుకు  వచ్చి  ఉన్నారు.
   అజరా : మా  అన్నగారు  చాలాసార్లు   బొంబాయి, కరాచీ, ఢిల్లీ  మొదలయిన ప్రదేశాలు వెళ్ళివచ్చారు. ఆయన  తెలుసుకొన్నవన్నీ నాతో చెబుతూ వుంటారు.
   నేను  ప్రభుత్వ  వ్యవహారాలవల్లనూ, సరదాగానూ మూడుసార్లు మీ దేశం