పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ పూర్వ సంస్కృతులు క్రీస్తుపూర్వం5,000 బి. సి. నుంచో, ఇంకా అంతకన్న ప్రాచీనాంగో ప్రారంభం అవుతాయి. అనేకులు పాశ్చాత్య పండితులు, సర్వ ప్రాచీన చరిత్ర సామాగ్రి సమగ్రంగా పరిశీలించి చరిత్రలు వ్రాశారు. గ్రామాల కచట ఊరు, నిప్పూరు, శిరివూరు, అసూయ అని పేర్లు ఉన్నవి. వీరు భరతదేశంనుంచి వలస వచ్చారని పాశ్చాత్య పండితులు కొందరు వాదిస్తారు. సుమేరు పర్వత ప్రాంతం నుంచి సింధుతీరంలో ఉన్న వారుగనుక వీరికి సుమేరులని పేరు వచ్చిందని నా ఉద్దేశం. వీరిదేవుడు సూర్యుడు. సుమేరియలను సమితి, లేక సేమిటక్ జాతివారు ఓడించి, వారి దేశంలో రాజ్యాలేర్పరచారు. ఆ తర్వాత పర్షియానుంచీ, సింధునదినుంచీ వచ్చారు. ఆ తర్వాత పర్షియను మీడులు ఆ దేశం ఆక్రమించారు. ఈ రాజ్య పరంపరల చిహ్నాలు మహాశిల్పాలై, మెసపొటేమియా, పర్షియాలలో వున్నాయి.


వీరి తర్వాత అసుర రాజ్యాలు వచ్చాయి. వారినే అస్పీరియను లంటారు. వీరు సుమేరియనుల తర్వాత వచ్చారు. అక్కడినుండి సేమిటక్, హిట్టయిట్ రాజ్యాలు వచ్చాయి. మన దేశంలో సింధునదీ తీరంలో మొహంజాదారో బయల్పడిన సంస్కృతికీ, ఈ సంస్కృతికీ చాలాచుట్టరికం వుంది. యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల మధ్యదేశమే ఆదాము అవ్వల ఈడెను దేశమట. ఇవన్నీ నెలరోజులలో చూచుకొని, నేను పర్షియాదేశం వచ్చాను. మొదట టెహరాన్ వెళ్ళి అచ్చట విహ్నలే చూచాను. దారిలోనే బాబిలోనియా అను పట్టణం చూచాను.

   ఇరాన్  అంటే  ఆర్యను  అన్నమాట. ఇరాన్  దేశము  అంటే  ఆర్యదేశమనే! పర్షియా చుట్టూ ఎత్తయిన  కొండలున్నాయి. ఆ  కొండలలో  రాజులు  తమ  శవాలను  పాతిపెట్టడానికి గుహలు  నిర్మించుకొన్నారు. ఆ  గుహాముఖాలంతా అద్భుత  శిల్పసంస్కృతి నిండి ఉన్నది.
       
                                                                                                               13
   
   లోక  సౌందర్యము  మూర్తికట్టిన లోకశిల్పం దర్శించిన  ప్రతి  రసహృదయుడూ  రాకాచంద్రకిరణ కాంతిస్నాతమైన  చంద్రశిలలా  కరిగి పోతాడు. గాఢ కామేచ్ఛతో సుందరియైన ప్రియురాలి  శయన మందిరానికి  పోయిన  నాయకునిలా ఆర్ధ్రజీవియైపోతాడు. బాగ్దాదు పట్టణం  వెళ్ళినప్పుడు  ఆ  విధులన్నీ  తిరుగుతూ  అరబ్బీనైట్సు కథలకు  పుట్టినిల్లయిన హారోన్ అలఠాషిద్ గారి భవనం  ఊహించుకొన్నాను. ఆనాటి  దివ్యసుందరుల  గాథలు  కళ్ళకు  కట్టాయి. నిజంగా  ఆ దేశంలోని వనితలందరూ సుందరులే. సాయంకాలాల్లో వారి మేడలపైన కొందరు  బాలికలను  చూచాను. అరబ్బీనైట్సులోని  హౌరీలు నా ముందు  నాట్యం  చేసినట్లే అయింది.

.