పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాఢంగా హృదయానికి అదుముకొని, తల వెనకకువాల్చి, అస్పష్ట ధ్వనితో నన్ను గాఢంగా ముద్దు పెట్టుకో అంది. నేనామెను నా హృదయానికి తనివితీరా అదుముకొని, గాఢమైన చుంబనా లామె పెదవులపై కురిపించాను.

   ఇరువురము విడిపోయాము. అదే మాలోని  కాంక్షల పుట్టుక, నాశనమున్ను. అంతకన్న మేము  వాంఛించ లేదు.  మనసుల కలయిక మాత్రమే  కోరిన మాకు దేహముల కలయిక  అవసరమే  లేకపోయింది. అక్కడి నుంచి  మా స్నేహము  నానాటికి  పవిత్రమైపోయింది. అలాంటి  ఉత్తమ  సంఘటనలే  మనుష్యుని  జీవితంలోని దివ్యక్షేత్రాలు.
   బటేవియా వెళ్ళాము. అక్కడి డిజాంగ్ గారి ఇంటిలో  నా మకాం బటేవియా యాత్ర  ప్రథమ దర్శనంలో  చూచినదానికన్న  ఈనాడు చక్కని  రూపముతో  ప్రత్యక్షం అయింది. విల్హె ల్మినా  శిల్పాలలో, చిత్రాలలో ఏదో  ఒక  మహానుభూతికై నిరీక్షిస్తున్న  ఆవేదన  ఉంది. జావా పల్లెటూరి దృశ్యాలు  ఆమె అనేకం  చిత్రించింది. బటేవియా  రేవులో  ఉన్న ఓడలు, నావలు, సరంగులు, నావికులు, కూలీలు, బజారులు, దుకాణాలు  ఎన్నో చిత్రాలామె  లిఖించింది. అన్నిటిలోనూ  ఆ నిరీక్షణే దృశ్యమౌతుంది.
    దేనికోసం  నిరీక్షిస్తున్నావు మీనా!  (అది ఆమె  తల్లిదండ్రుల ముద్దు పేరు).
    నీ  చిత్రాలన్నీ  ఆ నిరీక్షణే  తెలియజేస్తున్నాయి?  అని ఆ బాలికను  ప్రశ్నించాను.
    భూషణ్! నే నేమి చెప్పగలను? ఏదో మా జావాకు  వస్తుంది. అది  ఉపద్రవమో, శుభమో!  ఆ  నిరీక్షణ నాలో  నిండి ఉంది. నాతోటి  మా ప్రజలందరిలోనూ  ఆ  నిరీక్షణే  చూస్తాను.
   మీనా! నిజం. మన దేశాలన్నీ  సంపూర్ణ  స్వాతంత్ర్యం  కోసం  నిరీక్షిస్తున్నాయి, మీరు మాత్రం  హాలెండు సామ్రాజ్యం వాంఛిస్తున్నారా? ప్రపంచంలో సామ్రాజ్యకాంక్ష మారణ మేఘంలా  ఆవరించుకొని ఉంది.  అది ఎప్పుడు  పోతుందా  అని ప్రతి  మానవ  హృదయమూ  నిరీక్షిస్తోంది. ఆఖరికి  సామ్రాజ్యవాదుల హృదయంలోనూ  ఆ   నిరీక్షణ  అప్పుడప్పుడు కొంచమైనా  తల ఎత్తక మానదు.
    నిజం, భూషణ్! నీ భావం  నా  కర్థమయింది. నా హృదయం పూర్తిగా  గ్రహించావు.
   ఆమె  ఒక నిట్టూర్పు విడిచి, నా  చేయి స్పర్శించి  విసవిస  లోనికి వెళ్ళిపోయింది.
      
   ఆమెను వివాహం కానున్న యువకుణ్ణి  చూశాను. అతడును  డచ్చి తండ్రికీ, జావాసుందరికీ  ఉద్భవించిన మిశ్రమ  జాతివాడు. విల్హె ల్మినా  అంటే ప్రాణమే  అతనికీ.  ఆమె  నడచినచోట పూవులు చల్లుతాడతడు. ఆమెను గూర్చి  సగర్వంగా, పూజ్యభావంగా నాతో  ఎంతో   చెప్పాడు.