పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేను : నీవు చెప్పిన వాటిలో చాలా నిజముంది. ఈ విషయాలు పంజాబులో ఎక్కువ. కొత్తగా బాలికల చదువు ప్రారంభించడంచేత ఈలాంటి సంఘటనలు వచ్చాయి. దేశంలో ఇదివరదాకా బంధుత్వంలేని యువతీ యువకులు మాట్లాడుకోరు. అంత దూరంగా ఉన్న సుందరుడు నేడు చదువు ద్వారా సన్నిహితులు కాగానే బాలునిలో అప్పుడే పొడచూపిఉన్న యవ్వన రక్తం ఉప్పొంగి, అతనిలోని పశుత్వం బయటకు వస్తున్నది. కానిమాకూ ఈ ఉద్యమం బాగా ఆచారమై, మా జీవితంలో భాగమయితే మావాళ్ళూ ఎంతో గౌరవం చూపించగలరు. అమెరికా విద్యార్ధుల చరిత్ర వింటోంటే మా హీనత్వమూ కాటుకకొండ దగ్గర మసిలా కనబడుతుంది.

   విల్హె ల్మినా  చిరునవ్వు నవ్వి  భూషణ్ ,  నువ్వు నా అందం  చూచి  మరులు కొన్నావని ఎంచి  ఈ  ముక్కలనలేదు. నీ  మర్యాద, నీ  లలితమైన  హృదయం, నీలోన విరక్తిభావం చూచి  ఆశ్చర్యపడుతూ  అన్నముక్కలివి. నువ్వు  నేనంటే  కొంత  ప్రేమ  చూపించి, కాస్త దగ్గరకు  చేరితే, ఆ ఆనందం అనుభవిద్దామని రహస్యంగా  వాంఛించాను. అంతకన్న నాకు  వేరే దుష్టభావాలు కలుగలేదు. ఒక్కసారి  కూడా  నువ్వు  నా అందం  తేరిపార  చూడ లేదని నాకు కోపం కూడా  వచ్చింది. నాలో  యవద్వీప స్త్రీ  రక్తం వుంది. మా  వాళ్ళు  తలుచుకుంటే  ఏ  మనిషి  హృదయాన్నైనా చూరగొనే మంత్రాలెరుగుదురట. నాలోని  డచ్చి రక్తం  నన్ను  వాటికి  దూరం  చేసింది. పట్టలేక  ఈ రకంగా అడిగాను  అన్నది. నేనాశ్చర్యం  పొంది  కించపడిపోయాను.                                                                                                                           
           
               
                                                                                                                    11
   
   నా  మోమునందు  నర్తించిన కించపాటూ, అవమానమూ  విల్హె ల్మినా జూచింది.  నా ప్రక్కకు వచ్చి కూరుచుంది.  నా  చుట్టూ  వేయివైచి తన హృదయానికి  అడుముకొని, కుడిచేత్తో  నా గడ్డం పట్టి,  నా  మోమెత్తి,  భూషణ్, ఈ విషయంలో  నువ్వొక్కడివే  ద్రోహివికావు.  నేనూ  ఆ నేరం  చేశాను. నాకు నిన్ను  గురించి  ప్రణయాత్మికమైన   ఆలోచనలు  కలిగినమాట నిజం. నీ మాటలలో గాని,  నీ చర్యలలో కాని  ఒక యువతి  హృదయం  చూరగొనేందుకు చేసిన  ప్రయత్న స్పర్శ అయినా  లేదు. ఆడవాళ్ళకి  కళలు వుంటాయి. వనిత తన కలలు గాఢంగా  దాచుకొంటుంది, తేల్చదు. లోపల అగ్నిజ్వాలలతో మండిపోతున్నా, పైకి  మంచుగడ్డలా కనబడగలదు. నేను  బాలికను. మలయారక్తం నాలో వుంది. నిన్ను వాంఛించాను. నీజీవితంలో భాగస్వామిని అవుదాము అనుకున్నాను. నా  డచ్చితనము నన్ను హేళన చేసింది. మన  ఈ  స్నేహంలో  పవిత్రత  మన యిద్దరం  పాడుచేయవద్దు. పాడుచేయ్యలేము కూడా!  నేను పెళ్లి చేసుకోబోయే  యువకుడొకడున్నాడు.  ఈ  జీవితంలో, నీ  ఈ  జావాయాత్రలో  మనిద్దరి  స్నేహం ఆఖరేమో? మళ్ళీ  మన  జీవితాలు  తారసిల్లుతాయో,  లేదో!  ఈ  పవిత్ర క్షేత్రంలో ఒక్కసారి  మన కాంక్షను  వూతం చేద్దాము అని  నన్ను