పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నలు నన్ను నిండేవి. దిజాంగ్ గారు తన కుమార్తెను ఒంటిగా నాతో పంపి, నాతో అంతకాలం ఒంటిగా వుండేటట్లు చేయడంలో, నేనాతని తనయను ప్రేమించవచ్చుననే భావంతోనే పంపారా అనుకున్నాను. ఎంత హీనమైంది నా హృదయం! ఈలాంటి ఆలోచనలు భారతీయ లొక్కరికే కలుగుతాయా, లోకంలోని పురుషులందరికీ కలుగుతాయా? అని ప్రశ్నించుకున్నాను. నాలో తుచ్ఛభావాలకు తావులేదనుకున్న నాకీ ఆరాటం యెందుకు? ఈ పశుత్వం ఉద్భవించిందేమిటి?

   విల్హె ల్మినాలో  ఏదో  సమ్మోహనశక్తి వున్నది.  ఆమె  అందంలో  మహత్తరమైన  విశిష్టతవుంది. ఆమె నాలోని సర్వసౌందర్యపిపాసలు  రేకెత్తించింది. ఆమె  జావా భాషలో  చిత్రమైన  పాటలు  పాడుతూంటే పదికోకిలల తీయటిగొంతుకలు కలిపి  పాడినట్లు  నాకు పులకరాలు కలిగాయి. ఆకలిలాంటిదే  స్త్రీవాంఛ అని నేనెట్లా  అనుకోను? నా  శకుంతల వెళ్ళిపోయి  నా  కనేక  విధాల అడ్డంవస్తూ  ఉన్నదా? ఉత్తమ కార్యోన్ముఖునికి  స్త్రీవాంఛ అడుగడుక్కి  అడ్డంతగిలే  కంటకారణ్యం.  అందుకనే భార్య  అనే  ఉత్తమ సంస్థ  ఉద్భవించిందికాబోలు! నాకీ  దుష్టవివశత్వం మాన్పింది విల్హె ల్మినా కన్యయే!
   ఒక రోజున  మేమిద్దరము చండి  కేదిరిలో  ముఖ్య  దేవాలయంలో  బొమ్మలు వేసుకుంటున్నాము. విల్హె ల్మినా తండ్రి  గుడి అంతా చూచి, ఆ  ప్రాంతాన వున్న  ఇతర కట్టడాలను పరీక్ష చేయడానికి  వెళ్ళినాడు.
   విల్హె : భూషణ్! మీ  దేశంలో  చిత్రలేఖనంగాని, శిల్పంగాని అభ్యసించే స్త్రీలు  ఉన్నారా? భారతదేశం మేము వెళ్ళినప్పుడు మాకెక్కడా శిల్పవిద్యార్దినులు కనబడనేలేదు!
   నేను : మీరు శాంతినికేతనం వెళ్ళారా ?
   విల్హె : రవీంద్రనాథ టాగోరువారి ఆశ్రయమేనా ?
   నేను : అవును. అక్కడ చాలామంది విద్యార్థినులు చిత్రకళను, కొందరు శిల్పకళను నేర్చుకుంటున్నారు.
   విల్హె : నేనూ,  మాతండ్రిగారు  అక్కడ  విద్యార్దినుల  చుచాము. అందరిలో  ఒక బెంగాలీ అమ్మాయితో నేను బాగా  స్నేహం చేశాను. ఆ  బాలిక  మీ దేశంలోని యువకులు చాలామందిమీదా, పెద్దవారిమీదా కొన్ని  నేరారోపణలు  చేసింది. బాలిక  చదువుకోవడంవల్ల భారతీయ  యువకునిలో  పశుత్వం  రేకెత్తించిందని ఆమె నాతో చాలా  గాఢంగా చెప్పింది.  చదువుకొనేందుకు బాలిక  సిద్దమైనదంటే, ఆమె దుష్టబుడ్డితోనే ప్రారంభిస్తుందని  అనేకుల అభిప్రాయమట.  కళాశాలలకు యువతులు వెడుతోంటే అనేకులు యువకులు  ఈలల  వేస్తారట.  యువతులు  వినేటట్లుభరింపరాని మాటలంటారట. ఇవి  పెద్దలకు  చెబితే  ఆ  బాలికలో  ఏదో  లోటు లేకుండా  బాలురు అలా  అల్లరి ఎందుకు చేస్తారు?  అని పెద్దవారు అనుకుంటారట.