పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతీయులకీ అఖండ భారతచరిత్ర అవసరంలేదా? ఆంధ్రులంతకన్నా అలసులు. ఈ దేశాలే రారు. మన దేశంలో చరిత్రకారులు దేశాలు తిరుగుతారుగనుకనా! వారు, ఎవరో రాసిన గ్రంథాలు, భావాలు చూచి, స్వకల్పిత గాథలతో చరిత్ర నింపుతారు. ఈ దౌర్భాగ్యస్థితి ఎప్పటికి అంతమవుతుందోగదా!


                                                                                                       10
       
   ఆ  యాత్రలన్నీ  ముగించుకొని  నా  స్నేహితులైన  డిజాంగ్, విల్హె ల్మినాలతో బటేనియా చేరాను. మా యాత్రల  పొడుగునా విల్హె ల్మినాకూ, నాకూ ఎంతో  స్నేహం అయింది. ఒక జాతికి  ఇంకో జాతికి  స్నేహం కుదర్చగలవారు, ఇరుజాతుల్లోని వనితామణులే. భారతీయ నారీమణులు. విదేశీయులతో సంపర్కం  కలుగజేసుకునే  ఆచారం  భరతదేశంలో  లేకపోవడం ఆ రోజుల్లో  నా కెంతో  టీరనిలోటు అనిపించింది. విల్హె ల్మినా  నేనంటే  చూపిన  గౌరవము, ఆదరణ  వర్ణనాతీతము. అమెరికాలో  వివేకానంద రాజర్షిని గౌరవంచేసి  అఖండ  స్వాగతం  ఇచ్చింది  అమెరికా  నారీమణులు. వారికి చదువు ఉన్నది, స్వేఛ్చ ఉన్నది.                                                                                                                           
           
               

భారతీయస్త్రీ ఒక విదేశీయుని కలుసుకోలేదు, అతనితో మాట్లాడదు. సంస్కృతిని గూర్చి చర్చించ లేదు. సరోజినీదేవీ, విజయలక్ష్మి, దుర్గాబాయి, కమలాదేవిగార్లవంటి ఏ నలుగురైదుగురో తక్క విదేశ యాత్రికులతో మాట్లాడే వనితలేరీ? మన ఇంటికి వారిని పిలువలేము. మన మతం మనకు అడ్డం. మన ఆడవాళ్ళ హృదయంలో ఉత్తములైన పరదేశీయులతో వారివారి విజ్ఞానాలను గూర్చి మాట్లాడాలని, వారిని హృదయమారగా ఆదరించాలనీ ఉంటుంది. కాని వారికి సావకాశాలెవరు ఇస్తారు?

   ఈనాడు  మన బాలికలు  చదువుకొంటున్నారు. ఈ  విద్యావంతులైన బాలికల జీవితం ఒక మహోద్యమం  అనే  విషయజ్ఞానం  భారతీయులకు  లేనేలేదు. వారికి  పురుష భేదభావమింకా  వదలలేదు.  ఆ  భావంవల్లనే  పురుషుణ్ణి ఆదరించడం మానేస్తారు. ప్రేమించిన వానితో  మాత్రం  ఆ భావం  ఉంచుకొని, తక్కినవారు  తమతోటి  మనుష్యులకే భావం వారి జీవితాల నిండలేదు. భారతీయ  పురుషులలోనూ  ఈ తుచ్ఛభావం  నశించలేదు. ఒక  స్త్రీ  తనవేపుచూస్తే,  ఒక స్త్రీ  తన్నుపలకరిస్తే, ఒక స్త్రీ  తనలో ఒంటిగాఉంటే, ఈ  హీనపశుత్వభావాలు పురుషుల  హృదయాలను  గగ్గోలు  పెడతాయికదా!
   నేనూ, విల్హె ల్మినా  మాత్రం  యెన్నోసార్లో  దేవాలయాలకడకు పోయి బొమ్మలు  వేసుకుంటూ  ఉండేవాళ్ళం.  అలాంటి  సంఘటన  వచ్చినప్పుడల్లా  నా   గుండె  ఉలికులికిపడేది.  నా  ఒళ్ళువేడెక్కేది.  ఏవేవో చెడు ఆలోచ