పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాజసులు పసిఫిక్ సముద్రంలో మునిగిన భూఖండంలోనూ, తామసిక రాజసులు కెనడా, అట్లాంటిక్, యూరపు భాగాలలోనూ వుద్భవించారు. దక్షిణ భూఖండంలో, దక్కనులో, సింహళంలో అరేబియా సముద్రగర్భంలో ఇంకిన భూమిలో సాత్వికతామసులు, దక్షిణ ఆఫ్రికా అట్లాంటిక్ అమెరికా భాగాలలో రాజసిక తామసులు, దక్షిణ పసిఫిక్ భాగ ఆస్ట్రేలియా, బోర్నియో, న్యూజిలాండు, దక్షిణ అమెరికా భాగాలలో తామసిక తామసులు వుద్భవించారని నాకు సంపూర్ణ నమ్మకము.

   రాజసికార్యుల  సంతతివారు ఇప్పటి యూరపుఖండవాసులు.  రాజసికార్య  సాత్విక  రాజసుల మిశ్రమ  సంతతివారు  హిట్టెటులు,  డెమిటెక్ లు, యూదులున్నూ. సాత్వికార్య, సాత్వికరాజసుల సంబంధీకులు  సింధుతీరవాసులు, చాల్దియనిలు, ప్రాచీన  ఈజిప్టువారు. వీరే  అసురులు.  సాత్వికార్య, రాజసిక  రాజసుల  సంబంధులు  ఈనాటి  బర్మా, బెంగాల్, వురియా, అస్సాంవారు. వీరే  ప్రాచీన గాంధర్వులు. సింధుతీరవాసుల  సంతతివారు దాక్షిణాత్య నెల్లాలులు, పూర్వాంధ్రాసురులు.  తామసిక   రాజసురులు  ఈనాటి అస్సాం  నాగులు.
   ఈ  మిశ్రమాల  వైచిత్ర్యం ఆయా దేశాల  శిల్పాలలోనూ దృశ్యం అవుతుంది. బోరోబదూరులోని శిల్పంలో  ఆంధ్రార్యా  సాత్వికత్వమూ,యవద్వీప మిశ్రమ  రాజసమూ సంపూర్ణంగా కనబడతాయి. కొన్ని శిల్పాలు  పూర్తిగా  ఆంధ్రార్యులు శిల్పించినవే. ఆ శిల్పాలకూ,  అమరావతీ, నాగార్జున కొండ  శిల్పాలకూ ఏమీ  తేడాలేదు.  బోరోబదూరు  బుద్దుడూ, నాగార్జున  బుద్దుడున్నూ ఒకటే. ఈ  స్థూపంపైకి  వెడుతూంటే, మెట్టు మెట్టు ఎక్కుతూంటే, ప్రథమ  శ్రేణులలో పక్షులు, జంతువులూ, లతలూ వుంటాయి, తర్వాత శ్రేణులలో  ప్రక్త్రుతి దృశ్యాలు,  మానవ జీవిత దృశ్యాలు, ఇంకనూ  దానబుద్దదేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఈ  శిల్పాలన్నీ వరసగా పెడితే  మూడు మైళ్ళ పొడుగు వుంటాయి.  మధ్య మధ్య   వుండే  బుద్ధదేవుల మూర్తి విధానం  గమనిస్తే  తూర్పునవున్న బుద్దులు  అక్ష్యోభ్యులు.  వీరు ధ్యానబుద్దులు, వరముద్రాలంకారులు. పచ్చిమ భాగాన  అమితాధిబుద్దులు  పద్మాసవస్థులు, చిన్ముద్రా పద్మముద్రాలంకారులు. వుత్తరపువైపు అమోఘసిద్ద బుద్దులు అభయముద్రాలంకారులు.  
   ఇక్కడే ప్రజ్ఞాపరిమితాదేవి శిల్పం  వుండేది.  ఈమెను  శిల్పించిన  మహాశిల్పి  యవద్వీప సుందరికిని, ఆర్యశిల్పికిని వుద్భవించినాడు. ఆమెలో ఆర్య సౌందర్య రేఖలు, గాంధర్వ  సౌందర్యరేఖలూ  యమునా గంగా నదులు సంగమించినట్లయ్యాయి.