పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సింగపూరువెళ్ళాను. సింగపూరులోనూ భారతీయ సంస్కృతి అన్నివిధాలా ప్రత్యక్షం అవుతుంది. మలయ ద్వీపమే మలయ! ఇప్పుడీ ద్వీపవాసులు ఎక్కువమంది మహమ్మదీయులు. చాలామంది చీనా వారూ వలస వచ్చారు.


సింగపురంనుంచి జావాలో బటేవియాపట్నం చేరుకున్నాను. బటేవియానుంచి రైలుమీదా స్టీమరుమీదా, బయలుదేరి బోరోబదూరు చేరుకున్నాను. యువద్వీపము నిండా భారతీయులు. ముఖ్యంగా ఆంధ్రుల సంస్కృతి విలసిల్లిపోయినది. కథాసరిత్సాగరంలో ఆంధ్రవణిక్కులు యువద్వీపాలు వర్తకానికి వలసకు వెళ్ళినట్లు వ్రాసిన ఆ చిహ్నాలు, ఆ రాజ్యాలు ఇప్పటికీ యువద్వీపం అంతా నిండి వున్నాయి. బోరోబదూరు ఆంధ్రుల సొత్తయిన మహాయానపు బిడ్డ. ఏ ఇక్ష్వాకుల కాలంలోనో యువద్వీపానికి వలస వచ్చిన ఆంధ్రులు, బోరోబదూరులో ఈ మహానిర్మాణం కావించి ఉంటారు. బోరోబదూరు స్థూపం ఇటుకలతో, మన్నుతో కట్టలేదు. ఒక కొండనే స్థూపాకారంగా నిర్మించారు. ఆ కొండలో ఒక ప్రక్కతమ ఆంధ్రదేశాన్నుంచి తీసికొనివచ్చిన బుద్ధధాతువును ఆంధ్రులు స్థాపించి ఆ కొండనంతా పరమాద్భుత శిల్పాకారంగా నిర్మించారు.


                                                                                                                  9
               
   మంగోలియను జాతులు  పసుపచ్చంగానూ, ఎఱ్ఱగానూ, వుంటారు. బర్మావారు, చీనావారు, జపానువారు, లాప్ లాండ్ వారు, సైబీరియావారు, గ్రీన్ లాండువారు పసుపచ్చగా వున్నారు. అమెరికా  ఇండియనులు  ఎఱ్ఱ జాతివారు. భూమిమీద భూభాగం ఏర్పడేటప్పుడే,  ఉత్తర ఖండంలోనే ఎక్కువగా ఏర్పడిందని నా వుద్దేశం. శాస్త్రజ్ఞులు  అట్లాగే చెప్పుతారు.  ఆ  ఉత్తర  భూభాగము మూడు చక్రాకారపు చీలికలుగా ఏర్పడింది.  ఉత్తర  సముద్రము  భూమి; మధ్యోత్తర సముద్రము, భూమి; మధ్య  దక్షిణ  సముద్రము, భూమి: దక్షిణసముద్రమూ. ఈ  విధముగా  మధ్యభూమి  మహోత్తమ పర్వతమయమైనది: ఉత్తర, దక్షిణ భూములు  సమతలాలు. మధ్యమోన్నత పర్వతాలున్నూ, మధ్యభూభాగంలో స్వతగుణులైన ఆర్యులుద్భవించారు.
   మహామేరు (ఇప్పటి పామీడు) దానికి  శాఖలు, హిమాలయం, ఆల్టాయి, సులేమాను, హిందూకుష్ లలో శుద్ధసాత్వికులు, వేద పవిత్ర  మంత్ర దర్శకులు వుద్భవించారు. కాకసస్ మధ్యస్థమైన  తురుష్క పర్వతాలూ, ఆల్ప్సు పర్వతాలలో  రాజసిక  సాత్విక జాతి అయిన ఆర్యులు, వుత్తరఆల్ప్సు, అట్లాంటిక్  పర్వతాలలో (అవి ఇప్పుడు సముద్రగర్భంలో వున్నాయి) అమెరికా  మధ్య  పర్వతాలలో  తామసిక  సాత్వికులు  ఉద్భవించారు. అలాగే ఉత్తర  భూఖండంలో  సాత్విక  రాజసికులు చీనాలోనూ, రాజసిక