పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనుష్యులలో తెల్లజాతివారు సత్యగుణంలోనుంచీ, రంగులజాతివారు రజోగుణంలోనుంచీ, నల్లజాతులు తమోగుణంలోనుంచీ వుద్భవించారని నా వుద్దేశం. ఆయా జాతులలో మళ్ళీ మూడేసి అంతర్జాతులు వచ్చాయనీ, వీనిలో వీనికి కలయికలు కలిగాయనీ నా దృఢనమ్మకం. మంగోలియను జాతులవారు రహస్యాచార వర్తనులు, మతంలో వారికి గోప్యతాంత్రిక కర్మకలాపం బహుఇష్టము. వారి కళలలోనూ ఈ ఛాయలూ, తచ్ఛాయాజనితమైన అలంకారశిల్పమూ వుంటుంది. వారి బుద్ధుడు అవతారమూర్తియైన శాక్యసింహుడు మాత్రంకాక, లక్షల చేతులు కలిగిన మహాబుద్దుడు. నేపాలులో, త్రివిష్టపంలో, బర్మాలో, కంబోడియాలో, జపాను, చీనాలలో ఈ విచిత్రశిల్పం ప్రత్యక్షమౌతుంది. బర్మావారికి స్పష్టమైన గాఢమైన రంగులు ఇష్టం. గులాభి పసిమి రంగులు వారికీ ఎక్కువ ఆనందం కలుగజేస్తాయి.

   బెంగాలువారిలా  ఆర్య, నీగ్రో, మంగోలియను రక్తాలు మిశ్రమం అయ్యాయి. అందుకనే  బెంగాలువారి రంగులు, రేఖలు, ఆచారాలు, శాక్తేయంగా, తాంత్రికంగా వుంటాయి. బెంగాలు  వారికి శోకరసం యెక్కువ  ఆనందం ఇస్తుంది. ఈ ఛాయలన్నీ బర్మాలో  ప్రత్యక్షం అవుతాయి. బర్మాలోని  అలంకారశిల్పం అత్యంతమై, అసలు భావాన్ని  ఒక్కొక్కప్పుడు దిగమింగుతూ వుంటుంది. దారుశిల్పమూ, వెండి నగిషీపని బర్మావారికి  బహుఇష్టం. రంగూను అంతకూ శిరోభూషణం భావేదగాన్ పగోడా. పగోడా అంటే గోపురం. భాషా సాంప్రదాయంలో గోపురం, పగోరం అయి, ర, డ  అవును  కాబట్టి పగోడా  అయినది.  స్థూపాలనే  పగోడా లంటారు. రంగూను  పగోడా  ఎత్తు 48 అడుగులు. బుద్ధధాతువులను తీసుకొనివచ్చి, రంగూను, మాండలే, పెగూలలో స్థూపాలను నిర్మించారు పూర్వ భారతీయ శిల్పులు.
   ఆంధ్రులే  ఇక్కడకు  వలసవచ్చారు. ప్రథమాంధ్రులను క్లింగులని అంటారు. కళింగులే క్లింగులయ్యారు. వారే  ఈ భౌద్ధసంప్రదాయాలను  ఈ సువర్ణ దీవికి  తీసుకొని వచ్చారు.  ఆ తర్వాత  కాకతీయులకాలంలో, కాకతీయ  రాజకుమారులు  సైన్యాలతోవచ్చి పెగూ  ప్రాంతం  అంతా నెగ్గి, అమరపురం, అవపురం, పెగూ నిర్మించారు. వీరిని  ఇప్పటికీ  తైలింగులంటారు. రంగూనులోని భౌద్ధస్థూపం  షేగాను  పెగోడా  మహాద్భుతమైన  శిల్పరూపం. స్థూపపాదంనుంచి శిఖరంవరకూ బంగారు రేకులతో  మాలామాచేశారు. ప్రార్థన చేసేందుకు  స్థూపంచుట్టూ  1400 అడుగుల  చుట్టుకొలతను  అద్భుతమైన  వసారా  ఉన్నది. ఈ  స్థూపంలోని దారుశిల్పం లోకానందదాయకమైనది. రంగూను, పెగూ, ఆవా, అమరపురం, మాండలేలు దర్శించి, అనేక  కళావస్తువులుకొని, హరిద్వారం స్వామీజీ  ఆశ్రమానికి  పంపి మార్చి నెలాఖరుకు