పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నదానం పుచ్చుకున్న బీదవాడు మానవాభ్యుదయ యుద్ధం చేయడానికి బ్రతికి ఉంటాడు. సదుద్దేశ పూర్వకమైన ప్రతిపనీ మానవ కళ్యాణానికి సోపానం అవుతుంది. నువ్వు వాదించేది కమ్యూనిస్టువాదన. కమ్యూనిస్టులు కోరే సర్వ ప్రజాసమరాజ్యస్థితి రావాలంటే, ఆ రాజ్యం తీసుకురాగలిగే వీరుళ్ళుంటేగదా! ఒక విద్యసంస్థ బీదవారికే చదువు చెప్తోంది అనుకో, ఆ బీదవారు కూడా, దేశహీనస్థితి పోవాలని కృషిసల్పే విద్యావేత్తలలో చేరుతారు కదా! అదీకాక వారి విద్యావేత్తృతలో తమ ఇది వరకు బీదస్థితి స్మృతి బలప్రధాన శక్తిగా కలిసిపోయి వారిని మరింత ఉత్తమవీరులుగా చేయకలుగుతుందకదా!

                                                                                                                    8
   
   నా  శిల్పదీక్షకు  సర్వతోముఖమైన శక్తి  తెచ్చుకోవాలని  కాబట్టి  చీనా, జావా  మొదలైన  మంగోలు  జాతుల  దేశాలు;  పర్షియా, టర్కీ మొదలయిన సిధియనుజాతి దేశాలు; కకేషియనుజాతి  యూరోపుదేశాలు; అమెరికాదేశమూ  చూచి రావాలని  సంకల్పం  చేసుకొని  స్వామీజీని  సలహా అడిగాను. స్వామీజీ అత్యంత సంతోషంతో  అనుమతి ఇచ్చారు. అందుకు ప్రయత్నాలు  ప్రారంభించాను. స్వామీజీ సహాయంవల్ల  నేను బర్మా, జావా, బలిద్వీపము  చూడడానికి  ప్రభుత్వంవారు యాత్రాపత్రికలు (పాస్ పోర్ట్సు) ఇచ్చారు. డచ్చి ప్రభుత్వంవారు, ఫ్రెంచి  ప్రభుత్వంవారు అనుమతి  పత్రాలు  (వీసాలు) ఇచ్చారు.
   1934 సంవత్సరం మార్చి నెలలో నేను కలకత్తాలో  ఓడ  ఎక్కి రంగూనులో  దిగాను. రంగూనులో ఒక  అరవ  హోటలులో  మకాం పెట్టి నగరం  అంతా తిరిగాను. అక్కడ  లక్కపనిచేసే  కార్ఖానాలు, దారుశిల్పాలు చేసే కార్ఖానాలు  చూచాను. అక్కడ  పనివాళ్ళకు కొంత ధనం  బహుమతిగా  ఇచ్చి, ఆ  పని  నేర్చుకున్నాను. తెల్లటి  పాలరాతితో  రంగూనులో  చక్కటి  బుద్ధవిగ్రహాలు చెక్కుతారు. ఇత్తడి, రాగి పాళ్ళు ఎక్కువ  వున్న  కంచుతో  విగ్రహాలు  పోతపోస్తారు.
   ప్రాస్యమైన  ఆర్యశిల్పానికి, మంగోలియను  శిల్పానికీ  చాలా  తేడాలున్నాయి. ప్రపంచంలో  సృష్టి  అయిన  వస్తువులన్నీ  మూడు  ముఖ్య  జాతులుగా వుంటాయని నా వాదన. సత్వ, రజస్, తమోగుణావృతాలయినవా  మూడు జాతులు: లోహంలో బంగారు, వెండి, ప్లాటినమ్  మొదలగునవి  సత్వగుణ భూయిష్టాలు. రాగి, మాంగనీసు మొదలైనవి రజోగుణ సంభవాలు. ఇనుము, సత్తు, సీసం  మొదలైనవి  తమోగుణజాలు. అలాగే జంతువులలో  ఆవు, ఏనుగు, లేడి, గుఱ్ఱము   సత్వగుణంలోంచి   వుద్భవిస్తే, సింహం, పులి, తోడేలు  రజోగుణంలోంచీ; ఎనుము, గాడిద, ఎలుగు మొదలైనవి  తమోగుణంలోనుంచీ వుద్భవించాయి.