పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాయులీనం విని ఆశ్చర్యం పొందాను. నేను వెంకటస్వామినాయుడుగారి పాటవిని గంధర్వలోకం ప్రత్యక్షం చేసుకున్నాను.

     సంగీతం ప్రథమంలో జీవితానికి  ప్రత్యక్షం  అయినప్పుడు  మనలోని కల్మషాలన్నీ పైకి  వుబికివస్తాయి.  అప్పుడు  మనుష్యుడు  పశువు. అతనిలోని  ఆహార  నిద్రా  భయమైధునపకృతులు శతసహస్రబలంతో  విజృంభిస్తాయి. ఆ స్థితిలోనే  అనేకులు  అధోగతి  పాలైపోయారు.  ఈ సత్యం  అన్ని కళలకూ వర్తిస్తుంది. నాటక ప్రదర్శనంలో   కళలలన్నీ ప్రాథమికస్థితిలో వుండడంచేత కళావేత్తలందరూ  పశువులలానే వర్తిస్తారు. అందుకనే సినిమాలలో కూడా  నీతినియమాలు  వుండవు. ఈ  ప్రాథమికస్థితి దాటిన  కళావేత్త స్వచ్ఛభూములలో అడుగులిడతాడు. అప్పుడాతడు వున్నత హిమాలయ పథాలలోనే విహరిస్తాడు. ఈ  ఆలోచనలతో మా అమ్మగారితో  బయలుదేరి హరిద్వారం  కైలాసాశ్రమానికి వచ్చాను. మా అక్కగార్లిరువురూ  నా ఆస్థి స్వీకరించమని స్పష్టంగా  తేల్చేశారు. ఈ సంగతులన్నీ  స్వామీజీతో  మనవి చేసి  సలహా  అడిగాను.
    నాయనా! ధనం  నీకు  బరువుగా  ఉంటే మీ  అక్కగార్లిద్దరకూ బలవంతంగా ఇవ్వడం  ఎందుకు? గర్భదారిద్ర్యంతో క్రుంగిపోతూ ఉన్న  కోట్లకొలది భారతీయులు  లేరా?  వారికి  ఉపయోగించే సంస్థ  ఒక దాన్ని నిర్మించరాదా? 
    స్వామీజీ! మాబోటి  యువకులలో  కొన్ని భావాలున్నాయి. అవి కొన్ని  తమకు మనవిచేసి ఉన్నాను. భరతదేశం సర్వవిధాలా ఉత్తమస్థితికి  పోవాలంటే, బీదలకు నల్లమందు  మత్తునిచ్చే ధర్మసంస్థలు మానివెయ్యాలి. వారందరినీ  ముష్టి మాన్పించి, వారికి  చదువులో, కృషిలో  పెద్దకులావారితోబాటు  సమంగా  విద్యాసముపార్జనము  ఆర్ధికస్థితి ఉండేటట్లు చెయ్యాలి అని. అన్నదాన సమాజాలు, వస్త్రాదాన  సమాజాలు, బీదల  సహాయసంస్థలు అన్నీ  నల్లమందు  దానాలు. బీదవారు జీవితసమస్యలకు ఎదుర్కొనే  కర్మవీరులు కాకుండా  అడ్డంవస్తూ వున్నవి.  ప్రపంచంలోకెల్లా  మహోత్తమదేశం  కావలసిన చీనా  ఎలా  నిజమైన  నల్లమందువల్ల  హీనదేశమైందో, అలా భరతదేశం  ధర్మంఅనే  నల్లమందు  ఎక్కువ  ఆరగిస్తోంది. అల్లానే బీదవారూనూ. బీదవారు ధనసంపాదకమైన  పెట్టుబడి  సొమ్ముగా  ఈ ధర్మాన్ని  చేసుకున్నారు. అదే భారతభూమి అధోగతికి కారణం అని మా నమ్మకం.                                                                                                      

అబ్బాయీ! నీ వాదన అంతా నా కర్థం అయింది. కాని తన శాయశక్తులా పనిచేస్తూ కుటుంబపోషణ చేసుకుంటూఉన్న ఒక సంసారి నాశనం అయ్యాడు. అతనికి సహాయంచేసే సంస్థ ఒకటి ఉండాలికదా! సరియైన సమయానికి సహాయం లభిస్తే అతడు అందుకుపోతాడు. లేకేపోతే నాశనమేకదా! చాలా బీదవాళ్ళు చదువుకునేందుకు సర్వవిధాలా సహాయంచేసే సంస్థ కావాలి. అదీగాక అన్నదాత సమాజాలు, విద్యాదాన, వస్త్రదాన సమాజాలు, నల్లమందు ఇంజెక్షను ఇచ్చేవికావు. ఇచ్చేదాత సదుద్దేశంతో చేస్తున్నాడు. అదీగాక