పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ నవల తెలుగు నవలా చరిత్రలో రెండవ యుగానికి గోపురద్వారం. ఆయన ఎన్నో జానపద గీతాలు ప్రోగుచేశారు. తీయని నుడికారంలో పాటలల్లుతారు.

   ఆంధ్ర  చరిత్రకున్న తెరలన్నీ తొలగించి తీయని భాషలో  సమగ్ర చరిత్ర ఇచ్చిన  చరిత్ర చతురాసన  చిలుకూరివారినీ; సుందరమూర్తీ, ప్రతిభాశాలీ, నవనీతహృదయుడూ  అయిన  మల్లంపల్లివారినీ; నిశితబుద్దిశాలి, దూరదృష్టిగల నేలటూరి వెంకటరమణయ్యగారినీ; కాలం తెరలు బలవంతంగా లాగిపారవేసే  ధృతముష్టి  భావోర్వగి  భావరాజు  కృష్ణారావుగారినీ  కలసికొన్నాను. శిల్పికి వెనకాలే  బలం  కవిత్వమూ, సంగీతమూ, నాట్యమూ, చరిత్రా, భారతీయ  సంస్కృతీ అవడంవల్ల ఈమహామహుల కలసికొన్నాను. ఇంక  చూడవలసింది ఆంధ్రగాయకులను, చిత్రకారులనూ, శిల్పులనూ.
   
                                                                                                                       7
   
   ఆంధ్ర సంగీత  పాఠకులలో పేరెన్నికగన్నవారు వాగ్గేయకారరత్న హరినాగభూషనంగారు. ఆయన వాయులీనవాద్యము  ఆనందవీచి, కంఠము మధ్యమ శ్రుతిస్వరూపం. ఆయన సనాతనచారి, గాంధీ శిష్యుడు. సంగీతం విద్యగాని  కళ కాదంటారు. అన్ని  కళలూ జగత్కళ్యానానికి వుపయోగిస్తే విద్యలౌతాయి.  తుచ్ఛానందంకోసం  అయితే, వట్టి హీనకళలౌతాయి.  కళ అన్నంతమాత్రంలో హీనమనే అర్థంలేదు.  కల్యత  ఇతికళా  అని కదా!
   సంగీతంలో  అపర  త్యాగరాజు. నాగభూషణంగారు  భక్తుడే. కాని ఆవేశి, కొంచెం కోపం. ఆ కోపమే  లేకపోతే మూడుమూర్తులాత్యాగబ్రహ్మ  అని చెప్పతగిన  గాయకుడు. ఆయన పాట  వింటూ  సర్వమూ  మరచిపోయి పరవశత్వంతో కరిగిపోయినాను. ఏ  దివ్యామృతమో నన్ను  ముంచెత్తింది.
   గాయక సార్వభౌమ పారుపల్లి  రామకృష్ణయ్యగారు నిజంగా  సార్వభౌముడే. ఆయనను వింటేనే కంఠంలో  సంగీతదేవి  ఆవర్భవిస్తుంది. వీరితో పాటు వారణాశి బ్రహ్మయ్యగారు,  బలరామయ్యగారు  సంగీతకళానిధులు.  వీరికి  నారద  తుంబురులు అని పేరు  పెట్టుకొన్నాను. యువకుడైన  క్రోవి  సత్యనారాయణగారు  గానావేశి.  ఈయన స్వరావతారమే!
   బందరులో  కోటయ్యగారనే  గానతపస్వి  వుండేవారు. ఆయన  కుమారులిద్దరూ  చాలా  పేరుపొందారు. ఆరోజుల్లోనే  తుమురాడ  సంగమేశ్వర శాస్త్రి  గారి  సంగీతం  విన్నాను. వీరు   అపర  సరస్వతీదేవి అవతారమే. ఆయన  వీణతోనే వుద్భవించారా? ఏమి  పరమాద్భుతంగానం!  ఏ రాగమైనా, ఏ  తాన  వర్ణమైనా, వేదాలైనా  సర్వమూ దివ్యరూపంతో  ప్రత్యక్ష మాయన  అంగుళీతంత్రీ సంయోగంవల్ల.
   విజయనగరంలో  ద్వారం వెంకటస్వామి  నాయుడుగారి ఫిడేలు విన్నాను. ఫిడేలు  భారతీయవాద్యంకాదు. కాని  ముత్తుస్వామి  దీక్షితుల కాలం  నుండి  వాయులీనం    భారతీయమైపోయింది. నా కాలేజి  దినాలలో  గోవిందస్వామిపిళ్లెగారి