పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంత మేధ వుండడంచేత, ఆయనకు హృదయం లేదని అపవాదు వేస్తారు. మహాత్మునకు హృదయం లేదంటే ఎంతో ఆయనకు లేదన్నా అంతే. ఇంటి దగ్గర ఆయన చిన్నబిడ్డలతో ఆడుకొంటూంటే చూచిన నాకు కళ్ళనీళ్ళు చెమరించాయి.

   సన్నగా  శలాకులా ఆరోగ్యంగా  అయిదడుగుల  ఆరంగుళాలుంటారు. నెరసినజుట్టు, మధ్య బట్టతల, నాయకుల మాటలు, చేష్టలు  ఆయన  అభినయిస్తే, అసలు  వారినే  మూడుమూర్తులా ప్రత్యక్షం చేస్తారు. వైద్యులలో  చక్రవర్తి అయినా, న్యాయశాస్త్ర  విషయంవస్తే  న్యాయవాడులకే  పాఠాలు నేర్పుతారు. ఆంధ్రదేశంలో  నాయకులైన కోలవెన్ను రామకోటేశ్వరరావు   గారిని, కొండా  వెంకటప్పయ్యపంతులుగారిని, గొల్లపూడి సీతారామశాస్త్రి  గారిని, బులుసు  సాంబమూర్తిగారిని, ప్రకాశంగారిని, బ్రహ్మాజోస్యుల  సుబ్రహ్మణ్యంగారిని  కలుసుకున్నాను, మాట్లాడాను.
   ప్రసిద్ద  కవులైన  వెంకటశాస్త్రిగారినీ, కృష్ణమూర్తి శాస్త్రులుగారినీ, చిలకమర్తివారినీ, వడ్డాదివారినీ, భాషావేత్తలయిన  గిడుగురామమూర్తిగారినీ,  నవకవులలో  వుద్దండులైన రాయప్రోలు సుబ్బారావుగారినీ, శివశంకరశాస్త్రిగారినీ, దేవులపల్లి  కృష్ణశాస్త్రిగారినీ, విశ్వనాథ   సత్యన్నారాయణగారినీ, నండూరి సుబ్బారావుగారినీ, వేదుల సత్యన్నారాయణశాస్త్రిగారినీ, కథకచక్రవర్తి  మునిమాణిక్యం నరసింహారావుగారినీ, మహాకవి  చింతాదీక్షితులుగారినీ, హాస్యరస సామ్రాట్టు మొక్కపాటి నరసింహశాస్త్రిగారినీ, నోరి  నరసింహశాస్త్రిగారినీ  కలుసుకొని  హృదయమార  మాట్లాడినాను.
   కాటూరి  వెంకటేశ్వరరావుగారు  మహోత్తమ  ప్రౌఢకవి. ఆయన కవి పింగళి లక్ష్మీకాంతంగారు  మధురకవిమూర్తి. వీరిద్దరి  జంటా జయ విజయముల వంటి  జంటే.
   దేవులపల్లి  వారిని  కాకినాడలో  కలుసుకున్నాను.  కుఱ్ఱవాణ్ణయినా  నన్ను ఎంతో  గౌరవంచేసి  ప్రేమతో  నింపారు. ఆయన  ప్రపంచంలో  సర్వసౌందర్యాలూ పూజించే  సౌందర్యకవి.  ఆయన  జీవితమే  సౌందర్యం. గుంటూరులో వేదుల సత్యన్నారాయణశాస్త్రిగారిని  కలుసుకున్నాను. ఆయన కవిత్వం  అమృత ప్రవాహం.  అప్పుడే  మాధవ పెద్ది  బుచ్చిసుందర రామశాస్త్రిగారిని కలుసుకున్నాను. ఆయన కవిత్వం  గంగా  ప్రవాహమే. నేను కొల్లిపర వెళ్ళలేదుగాని రేపల్లెవెళ్ళి  నోరినరసింహశాస్త్రిగారిని కలుసుకొని  మాట్లాడాను. ఆయన కవిత్వం  మిశ్రమపాకం. నన్ను తమ్మునిలా హృదయాని కద్దుకున్నారు. ఏలూరువెళ్ళి  నండూరి సుబ్బారావుగారిని  కలుసుకున్నాను. వకీలు వృత్తిలో  సంపూర్ణంగా  దిగిపోయి, సాహిత్యసేవ తగ్గిస్తున్నాడాయన.  ఆయన ఎంకిపాటలు ఎవరో  గంధర్వాంగన పాడినట్లే పాడి, నాకు  వినిపించారు. ఆయన