పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ మనిషీమూర్తి ఎత్తయిన పర్వతశిఖర శీతలంగా హాయిగా ఉన్నది. చక్కని చామంతి అత్తరు పరిమళము అతని మూర్తిలో నుంచి ప్రసరిస్తున్నది. అతనిలో ఏదో మహాశాంతి ఆమెకు తోచింది. ఆ తిరగడంలో ఆమెకు కొంచెం అతనిచేయి తగిలినప్పుడు ఆమెకేదో వివశత్వం కలిగింది.

                                                                                                                    3
   శ్రీమతి  రుక్మిణీదేవిగారి  నాట్యం  తంజావూరులో  విజృంభించిన ఆంధ్ర  సంప్రదాయనాట్యం. అలరింపు,  జతి, తానవర్ణము, కొన్ని  పదములు  ఆమె  అభినయించినది. ఆ  నాట్యంలో  ఉండే  అందాలు  శిల్పదృష్టితో  త్యాగతి వర్ణించి  హేమకు  చెప్పాడు.  ఉత్తరాది  నాట్యాలు  అంతకన్న  అంతకన్న లాలిత్యం  తాల్చి సంగీతంలా  ఎక్కువ  మధురమైపోయాయి.  మా శిల్ప  శాస్త్రానికి  నాట్యం  నేర్చుకోడం  చాలా ముఖ్యం. ఆరునెలలు  నేను కథక  సంప్రదాయం నేర్చుకున్నాను  అని  త్యాగతి  ఆమెతో  అన్నాడు.
    కథక్  అనీ, కథకళి అనీ,  భరతనాట్యం అనీ, కూచిపూడి  అనీ, మనిపురం అనీ నాట్యానికి పేర్లు  పెట్టారు. ఆ రకాలు  చూచాను. అవి అల్లా ఎందుకుండాలో  నాకు తెలియదు, చెప్పేవారూ లేరు. నేను వారినీ వీరినీ  అడిగి తెలుసుకోనూలేదు.
    పేరులు ఎందుకువచ్చాయో, అని  ఎల్లా రూఢి  అయ్యాయో, నేను  కొంచెం  తెలుసుకున్నానమ్మా!  అన్ని విధానాలూ  నేను   బాగా  అర్థం చేసుకున్నాను.  ఈ పేరులన్నీ  ఈ మధ్యనే  వచ్చాయి.  అని  ప్రజలలో  వాడుకలోనికి  వచ్చి  రూఢి అయిపోయాయి. 
   హేమా, ఈ  నూతన  పురుషుడూ  అంత స్నేహంగా  మాట్లాడుకోడం  హేమ తల్లిదంద్రులకూ , సోఫీకి  తప్ప  ఇంకెవ్వరికి  ఇష్టం లేకపోయింది. తీర్థమిత్రుడు  మండిపోయాడు. నిశాపతి పళ్ళు బిగించాడు. కల్పమూర్తికి  గుండె నీరసించింది. హేమకు  ఏ. ఐ. సి. ఎస్సో భర్తకావాలి  అని  లోకేశ్వరికి  పెద్ద కోర్కె. ఎవరీ త్యాగతి? ఎక్కడనుండి దాపురించాడు. అని  ఆమెకు  భయం  అంకురించింది. హేమసుందరీ  ద్వితీయుడై  త్యాగతి  రుక్మిణీదేవి నాట్యంలోని అందాలు  చూస్తూ, హృదయం పరవళ్ళెత్తగా తక్కిన సకలలోకమూ  మరిచిపోయాడు.
   మహదానందం  అతని హృదయంలో  ప్రతిధ్వనిస్తుండగా,  ఆ ప్రతిధ్వనికి హేమ  హృదయం  శ్రుతిగా   దడదడ  కొట్టుకొన్నది. యెన్నడూ ఎప్పుడూ  కలగని  యవ్వనానందం  ఆమెను  అలమివేసింది.  ఆ ఆనందానికి  రుక్మిణీదేవిగారి  పాదతాళగతులు  రూపము కల్పించినట్లా బాలకు తోచింది. రుక్మిణీదేవి  భంగిమలో  ఆనందసముద్రవీచికల   రేఖలు కనబడినవి. రుక్మిణీదేవి హస్తాభినయనంలో  సృష్టిలోని  సౌందర్యానికి వ్యాఖ్యానాలు  గోచరించాయి. రుక్మిణీదేవి  కన్నులు  తిప్పుటలో  మానవజీవిత  మహారహస్యాలు నర్తిస్తూ  దృశ్యమైనవి.
   హేమసుందరి  ఇదివరకు  రుక్మిణీదేవి  నాట్యాలు  ఎన్నిసారులో  చూచింది. ఒక ఉత్తమాంగన  నృత్యకళను అత్యంత ప్రజ్ఞతో  ఆరాధిస్తున్నది