పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాబట్టి అతడు నిశాపతి అని హేమసుందరి నామకరణం చేసింది. తీర్థమిత్రుడు పేరు జానకిరామమూర్తి అతని చిన్నతనంలో అతని తల్లిదండ్రులు యాత్రలు చేసేటప్పుడు తమ బాలుణ్ణికూడా తీసుకువెళ్ళారని అతడు కోతలుకోస్తూఉంటే అతనికి తీర్థమిత్రా అని బిరుదనామం ఇచ్చింది కొంటెపిల్ల హేమ. అవే సార్థక నామాలయ్యాయి! ఆ రోజున సోఫీ, లోకేశ్వరి, ఈ ముగ్గురు పురుష స్నేహితులూ హేమ తలిదండ్రులతో అడయారుకు అయిదుగంటలకే వేంచేశారు. అక్కడ అడయారు కళాక్షేత్ర బాలబాలికలు రచించిన చిత్రలేఖనాలు ప్రదర్శించారు. ఆ ప్రదర్శనం చూద్దామని వీరంతా అక్కడికి వచ్చేసరికి వీరికి ఎదురుపడ్డా డొక పురుషమూర్తి.


అతడు అయిదడుగుల  తొమ్మిదంగుళాలున్నాడు. బలసంపద  గలవాడు, పొడుగాటి ఖద్దరు  పట్టులాల్చీ తొడుగుకొని, ఖద్దరుపంచె కట్టుకొని, ఖద్దరు  గుజరాతి  టోపి ధరించి, చక్కని  చేతికఱ్ఱతో  ప్రత్యక్షం  అయ్యాడు. వీరి  జుట్టు  చూడగానే, అతడు రెండంగలలో వీరి దగ్గరకు వచ్చి, వినాయకరావుగారికి, ఆయన భార్యకూ  వంగి  పాదాలకు  నమస్కరించాడు.
    ఓహో  త్యాగతి  శర్వరీభూషణుడా! ఎప్పుడు వచ్చావోయి, మన దేశాన్నుంచి?  అని వినాయకరావుగారి  కళ్ళనీళ్ళు తిరిగిపోతూ  వుండగా  అతన్ని కౌగిలించుకొన్నాడు.  కంటినీరు  జలజల ప్రవహించుపోతూ  వుండగా  నాయనా!  ఎన్నాళ్ళకు చుచామోయ్ నిన్ను! గుంటూరునుంచే  వచ్చావా? అక్కడ  మా మరిదిగారు కులాసాగా వున్నారా?  నా తండ్రీ!  ఇన్నాళ్ళకా  నువ్వు  మమ్మల్ని  చూడడానికి  రావడం?  అని  ప్రశ్నలు  కురిపించింది  హేమతల్లి  వెంకటరామరాజ్యలక్ష్మమ్మగారు.  హేమసుందరీ, ఆమె స్నేహితులూ   ఆ నూత్న పురుషుని  తెల్లబోతూ చూచారు.
   
                                                                                                                 2 
   
   వినాయకరావుగారు :  కన్న  నాన్నా,  ఈయన  మనకు  చాలా దగ్గర  చుట్టం. చిన్నతనంలో  మనదేశం   విడిచి  ఉత్తరానికి  వెళ్ళి వుంటున్నారు. ఇప్పుడు  మనదేశంలోనే  ఉంటారు. చిత్రకారులు, శిల్పిన్నీ. 
   త్యాగతి  శర్వరీభూషణుడు అలా  నమస్కారం  చేస్తూ నవ్వుతూ  నిలుచుని  వున్నాడు.
   వినా : నీ   చిన్నతనంలోనే  మన  యింటికి  తరచుగా  వస్తూ వుండేవారు.
   హేమ : అవును. నేను ఆ మధ్య  రెండుమూడుసార్లు  ఈయన పేరు  ఆంధ్రపత్రికలో  చదివాను. ' శిల్పకళ మళ్ళీ ఆంధ్రదేశంలో  విజృంభించాలి' అనే  వ్యాసం  వ్రాశారు. అదీగాకుండా  'పాశ్చాత్యశిల్పం' అనే నాలుగైదు  వ్యాసాలు  భారతిలో ప్రచురించారు.
   త్యాగతి : అవునమ్మా, నేనే  ఆ వ్యాసాలు ప్రచురించింది.
   కల్పమూర్తి : శిల్పం అంటే  మీరు  దేనితో  చేస్తారండీ?