పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆనందమయింది. మా అమ్మగారి ఆనందానికి పరిమితిలేదు. ఆమెకు నిజంగా వేయి ఏనుగుల బలం వచ్చినట్లే అయింది.

                                                                                                                4
   
   1931 నుంచి  నాకు  ఎనిమిది సంవత్సరాలు  ఎడతెగని  కళారాధనే. అననుభూతమైన  సౌందర్యదీప్తిలో  స్నాతుడనై  ఆ  సౌందర్యారాధనకే  దేశాలు తిరిగాను.   నా దేశంలో  జరిగిన  స్వాతంత్ర్య యుద్దాన్ని గూర్చి  మా సుబ్బులు  నాకంతా  చెప్పాడు. గ్రంథాలయాలకుపోయి 1930  మార్చి  నుండి  ప్రారంభమైన  దండి సత్యాగ్రహ  లవణయాత్రనుగూర్చీ, దేశం  అంతా  అనేక  లక్షల  దేశభక్తులు   ఈ స్వాతంత్ర్య సమరాగ్నిలో ఆహుతైన విషయమూ తెలుసుకొన్నాను. 
   నా శకుంతల  నన్ను  విడిపోయిన దుఃఖంలో  మునిగిపోయి, పశువునైనా చుట్టూ  జరిగే  మహాశాంతి  సమరంలోని  దివ్యసందేశము గ్రహించలేకపోయాను. ' ఎవ్వరీ  మహాత్ముడు? ' అన్న ప్రశ్న అప్పుడు  వేసుకున్నాను.  నేను చదువుకునే  రోజులలో  మహాత్ముని గురించి  నాకు తెలియకపోలేదు. అఖిలభారత జాతీయ  మహాసభ  ఉందనీ తెలుసును. ఖద్దరు  సంగతీ  ఎరుగుదును.  నేను తొమ్మిదేళ్ళ  బాలుడుగా  ఉన్న రోజులలో గుంటూరు  జిల్లాలో జరిగిన  ప్రథమ  సత్యాగ్రహ  చరిత్ర  పూరాణగాథలా విన్నాను. ఉప్పు సత్యాగ్రహ  యుద్ధం  అనేక  రామాయణ  భారతాదుల  సంపుటి! భారతీయాంగనలు వేలకు వేలు  జైళ్ళకుపోయారు. దెబ్బలు తిన్నారు, అవమానాలు పడ్డారు,  ప్రాణాలు అర్పించారు.  ఆ  యుద్దచరిత్రలో  ఆంధ్రదేశమూ  ప్రశంసాపాత్రమైన పాలు పుచ్చుకుంది. నా దేశానికి  స్వాతంత్ర్యం, నాదేశం  తన తొల్లింటి  ఔన్నత్యదశకు రావడం ఇవి  నా  సర్వజీవితమూ  నిండిన  ఆలోచనలు.
    సుబ్బులుబావా! నా  శకుంతల  నన్ను  వీడిపోయింది. ఆ  దేవిని  నేను  ఎప్పుడు  కలుసుకోగాలనో  నాకు తెలియదు.  ఆమెను కలుసుకోగలిగే పవిత్రత  నేను  సంపాదించుకోవాలి.  పశువులా  సంచరించిన ననుర  స్వామీజీ రక్షించాడు. ఇంక తరువాయి పని నాది. ఆ  రోజుల్లో నన్ను  కంటికి రెప్పలా కాపాడిన  నిన్ను  మరచిపోలేనురా! యింక  మా కొల్లిప్న విషయాలు, భట్టిప్రోలు విషయాలు  సావకాశంగా చెప్పు అని ద్వితీయ హిమాచల  ప్రయాణారంభంలోనే అడిగాను.
    మీ మామగారూ, అత్తగారు  కొల్లిపరలో  ఉండలేక, మీరు వెళ్ళి పోయినట్లే  వెంటనే  మదరాసు  వెళ్ళిపోయారురాబావా! మీ  అత్తగారికి చాలా జబ్బు చేసింది. వైద్యానికి  మంచిది  అని చెన్నపట్నం చేరారు. అక్కడ  వాళ్ళ  చిన్నమ్మాయికి  చదువు చెప్పించుకుంటూ  ఉన్నారు. అక్కడే  మైలాపురంలో  ఒక చక్కని మేడ కొనుక్కున్నారట!