పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృష్ణావతారం ఎంత సంపూర్ణ వ్యక్తిత్వ చిత్రాలు! కాళిదాసుని మేఘసందేశం వేరు, రఘువంశం వేరు. అలాగే మనుచరిత్ర వ్యక్తిత్వం వేరు, పారిజాతాపహరణ వ్యక్తిత్వం వేరు. ప్రవరాఖ్యుడు, మాయాప్రవరాఖ్యుడు, సర్వోచి ముగ్గురూ మూడు వ్యక్తులు అలాంటి వ్యక్తిత్వం రామారాయుని చిత్రాలలో తేర వెనకనుంచి అవతరిస్తున్నది. అతనికి కృష్ణలీలచిత్రము, సిద్దార్థ యశోధర చిత్రము రెండూ ఒకటే. కృష్ణుడికీ, సిద్దార్థుడికీ ఏమీ తేడాలేదు. యశోధరకూ ఆమె చెలి కత్తెలకూ ఏమీ తేడాలేదు. ఆ దోషం అతని చిత్రాలన్నింటిలోనూ మాయం కావడం ప్రారభించిన మహోత్తమ క్షణాల్లో ఆంధ్రుల దురదృష్టం వల్ల ఆతడావతారం చాలించాడు. రవివర్మలో ఇంకా ఎన్నో దోషాలున్నాయి. రామారాయుని చిత్రకళ అంతా కలిపితే ఒక వ్యక్తిత్వం ఉంది. ఒక మహాతపస్సు అతని కళ.


మూడు నెలలూ ద్యూపాంగు సంఘరామంలో గడిపాను. అక్కడి గురువులు నాకు దారి చూపించారు. ఆ దారిని నడిచి, మజిలీలు చేసుకుంటూ గమ్యస్థానం చేరవలసింది నేను. గురువులందరికడా, కులపతికడా సెలవు తీసుకున్నాను. వారి ఆశీర్వచనాలు పొందాను. మా స్వామీజీ ఆదేశం ప్రకారం ఆ ప్రదేశంలో, చలిలో, ఆ కొండలలో, లోయలలో ప్రయాణంచేస్తూ నేపాలు చేరుకున్నాను. మా గురువుగారి కరుణవల్ల నేపాలు ప్రభుత్వంవారు వారి దేశంలోనికి నన్నూ, నాతో ఉన్న సన్యాసులనూ రానిచ్చారు. నేపాలులో పదిరోజులు ప్రయాణం చేసి కాట్మాండు నగరం ప్రవేశించాము.

   కాట్మాండులో అనేక  దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల వాస్తునిర్మాణం అనేక రీతులుగా  ఉన్నది. భౌద్ధదేవాలయాలు, హిందూదేవాలయాలు  ఉన్నాయి. నేపాలులో  భారతీయ  శిల్పవిధానం ఒక విచిత్ర  పరిణామం పొందింది. భరతదేశంలో అలజడి  సంభవించినప్పుడల్లా కొన్ని కుటుంబాలు నేపాలు  చేరుతూ వచ్చాయి.  వీరికీ, ఆ ప్రదేశంలో  ఉన్న పూర్వవాసులకూ సంబంధాలు కలిగి  మిశ్రమజాతులు  ఉద్భవించాయి. అలాగే  మతాలు  మిశ్రమం  పొందాయి. నేపాలులోని  మధ్యలోయ  ఒకప్పుడొక మహారసస్సట. ఆ సరస్సును  మంజుశ్రీ   శాతవాహనుడనే  ఆంధ్ర  మహారాజు  కొండలు  బ్రద్దలుకొట్టి  దారిచేసి నదులుగా  మార్చి  గంగానదికి ఉపనదులు  చేశాడట.
   ఒకనాడు  ఇక్కడ  ఆంధ్ర శాతవాహనులు  రాజ్యంచేసినట్లు చిహ్నాలు  చాలా ఉన్నాయి. గోదావరినది, కృష్ణానది ఈ  దేశానికి  ఈవలావల ఉన్నాయి. ధాన్యకటకనగరము, -ప్రతిష్టానగరము రెండు పట్నాలున్నాయి. ఇక్కడ శాలివాహనశకము చాలా గౌరవస్థితిలో  ఉన్నది. నేపాలు శిల్పంలో  కూడా పూర్వాంధ్ర సంప్రదాయం మిళితమై ఉండిన  గురుతు  లీనాటికీ  కనబడుతాయి.