పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కష్టాలపాలవుతూ, పశువుగా కూడా అవుతూ, చివరకు విజయమైనా పొందుతున్నాడు, లేదా విజయాభిముఖుడై నశించిపోతున్నాడు.

   ఇంక  భరతదేశంలో బీదలస్థితి  తలుచుకొంటే నాబోటి  నిస్సంగులు  కూడా  లజ్జపడి, తలవంచుకోవలసి వస్తోంది. లక్షాధికారులు, భూస్వాములు, పారిశ్రామిక వేత్తలు  ఇంకా ధనం, ఇంకా ధనం  అని బీదల  మాన ప్రాణాలను  తమ  ధనక్షాంక్షాయజ్ఞానికి ఇంధనాలు చేస్తున్నారు. ముప్పది  అయిదు  కోట్ల  జనాభాలో  ఇరవై  అయిదు  కోట్లు  కటిక బీదవాళ్ళు; అయిదు కోట్ల  ముప్పాతిక  బీదవాళ్ళు; మూడు కోట్లు  సగం బీదలు; ఒక కోటిన్నర  కొంచెం ధనవంతులు; అరకోటి ధనవంతులు; కొన్ని వేలమంది  మాత్రమే  కోటీశ్వరులు.
   ప్రపంచం అంతా  అల్లాగే వుంది. అయినా  ఆసియా  దేశాలలో  ఈ దుర్గతి  ఘోరాతి ఘోర  స్వరూపంలో  ప్రత్యక్షమౌతుంది. ఎన్ని కోట్ల జనానికో, పెద్దలకు, పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు కట్టగుడ్డా, తిన తినతిండీ, పండ పక్కాలేదు. తండ్రీ కైలాసప్రభూ! రష్యా  భౌతికంగా  ఈ భయంకర సమస్యను  ఎదుర్కోవడానికి  ప్రయత్నం  చేస్తూంది. బౌద్దధర్మము మానసికంగా  తృప్తి  తీసుకొని రావడానికి  ప్రయత్నం  చేసింది.  ఈ  రోజులలో  భరత  దేశాన  దారిద్ర్యం లేనేలేదు. ఆ  బౌద్దమతం _జపానుకు కర్కశత్వమూ, చీనాకు  నిద్రమత్తూ, సింహళానికి  ఆశానేర్పింది. వట్టిమతంవల్ల, ఆధ్యాత్మిక  చింతవల్ల భౌతికమైన  ఈ  దుర్భరస్థితి  పోతుందా శ్మశానదేవా? భౌతిక మానసిక  పారమార్ధిక  సమన్వయత లేనినాడు ఏ దేశమైనా  ఉత్తమస్థితికి ఎలా వస్తుంది?  ఈ  ఆలోచనలతో  త్యాగతి  శర్వరీభూషణుడైన  శ్రీనాథమూర్తినీ, నా శిష్యులైన కొందరు  సన్యాసులనూ ద్యూపాంగు  సంఘారామంలో  ఉంచి, నేనూ, రాజపుత్ర జమీందారుడూ, అతని అనుచరులూ  భరతదేశానికి బయలు దేరాము. 
                                                                                                                             
           
               

రాజపుత్ర జమీందారుడు, కపూర్ బహదూర్, శ్రీనాథమూర్తి దగ్గరకు పోయి, శ్రీనాథమూర్తిగారూ! నమస్కారం. మీవంటివారి సహవాసం ఇప్పించినందులకు స్వామీజీకీ, ఈ కైలాసప్రభువునకూ నేను ఆత్మాభివందనాలు అర్పిస్తున్నాను సుమండీ. మన స్నేహం ఇంతటితో ఆగిపోకూడదు. మీరు మా జమీకి రావాలి. మా ఆతిధ్యం స్వీకరించాలి. మా ఇంటిలో ఎన్నో రాజపుత్ర చిత్రలేఖనాలూ, మొగలు చిత్రలేఖనాలూ ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలి. అవే కాకుండా కొన్ని స్ఫటికశిలా శిల్పాలూ, కొన్ని లోహ శిల్పాలూ, అనేక కళాపూరిత వస్తువులూ ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలి. పూర్వకాలపు సంగీత వాద్య విశేషాలు వున్నాయి. నేను అర్పించబోయే కొన్ని వస్తువులు టాము స్వీకరించాలి అని మనవి చేశాడు.

   శ్రీనాథమూర్తి కళ్ళనీరు  తిరుగుతుండగా  జమీందారుగారికి  నమస్కారంచేసి, జమీందారుగారూ! నేను  వాక్కు  కర్మల  ద్వారా తమ కప్పుడు  కష్టం కలిగించి ఉండవచ్చు. మన ప్రయాణంలో తమ స్నేహం  పూర్తిగా  అర్ధం